For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువారం దినఫలాలు : ఈ రాశుల వారికి శృంగార పరంగా సానుకూలంగా ఉంటుంది...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు మంచి విజయాన్ని సాధించొచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇది మీ ఇద్దరికీ కలిసి ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఇస్తుంది. దీనితో పాటు మీ ప్రేమ కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మరోవైపు ఆస్తికి సంబంధించిన ఏ సందర్భంలోనైనా నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ముఖ్యంగా ఎలాంటి విషయంలో రిస్క్ తీసుకోకూడదు. వ్యాపారులు ఈరోజు కొన్ని సవాళ్ల తర్వాత విజయం సాధించగలరు. మీ జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యామ్నం 12 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మార్గదర్శకత్వం ఉంటుంది. వారు మీ పనితీరుపై కూడా సంతృప్తి చెందుతారు. ఈరోజు మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. చిన్న వ్యాపారులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు మీ శృంగార జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈరోజు మీ సమావేశం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. మీ ప్రియమైన వారి భావాలను మీరు అర్థం చేసుకోవాలి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

గ్రహణం తరువాత స్నానం చేయండి.. వీటిని తినకండి.. వీటన్నిటికీ శాస్త్రీయ కారణం ఇక్కడ ఉందిగ్రహణం తరువాత స్నానం చేయండి.. వీటిని తినకండి.. వీటన్నిటికీ శాస్త్రీయ కారణం ఇక్కడ ఉంది

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా సరదాగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఈరోజు ఎవరికి ఏదైనా వాగ్దానం చేసే ముందు, మీరు సరిగ్గా ఆలోచించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇది కష్టం కావచ్చు. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు విలువైనదాన్ని కొనాలనుకుంటే, ఈరోజు దానికి మంచిది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా రోజుల తరువాత మీరు ఒకరితో ఒకరు తగినంత సమయం గడుపుతారు. ఈరోజు వాహనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:20 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఇది కాకుండా, మీ సహోద్యోగులను విమర్శించకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 4:50 నుండి మధ్యాహ్నం 1:15 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి శుభవార్తలను వినొచ్చు. ఇది కాకుండా, మీరు ప్రమోషన్ కూడా పొందవచ్చు. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడానికి అవకాశం పొందుతారు. బంగారం, వెండి, కలప, బట్టలు మొదలైన వ్యాపారులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఆదాయం మరియు ఖర్చుల మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు

శని తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!శని తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మీకు వివాదం ఉండొచ్చు. అనవసరమైన విషయాలలో మీ సమయాన్ని వృథా చేయకుండా ఉండండి. మీరు మీ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ విద్యలో కొన్ని పెద్ద అడ్డంకులు ఉండవచ్చు. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ తొందరపాటు మరియు అజాగ్రత్త మీకు భారీ నష్టాలను కలిగిస్తాయి. మీ ముఖ్యమైన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఎక్కువ ఖర్చు చేయడం మీకు మంచిది కాదు. మీరు పొదుపుపై ​​ఎక్కువ దృష్టి పెడితే మంచిది. ఈరోజు కుటుంబ జీవితంలో అసమ్మతి ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీ పనిభారం పెరుగుతుంది. దీని వల్ల మీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ఈరోజు ప్రణాళిక ప్రకారం, మీ పనులన్నీ పూర్తి చేయాలి. వ్యాపారులు ఈరోజు కొత్త వ్యాపార ప్రతిపాదనను పొందొచ్చు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పెద్ద మెరుగుదల ఉంటుంది. ఈరోజు మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందొచ్చు. గతంలో తీసుకున్న ఏదైనా నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి చాలా శృంగారభరితంగా ఉంటుంది. వారు మీతో కొంచెం ఎక్కువ సమయం గడపమని అడగవచ్చు. మీరు మీ ప్రియమైనవారికి విలువైన బహుమతిని ఇవ్వాలనుకుంటే, ఈరోజు దానికి మంచిది. పని విషయంలో ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారుల పని పట్ల సంతృప్తి మరియు సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు మంచి అవకాశం పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పవి విషయంలో మంచిగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో తగినంత సమయం గడపాలి. పని యొక్క ఉద్రిక్తతలో మీ కుటుంబ సభ్యులను విస్మరించొద్దు. ముఖ్యంగా మీరు మీ పిల్లలను ఎక్కువగా చూసుకోవాలి. మీరు వ్యాపారవేత్త అయితే మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. ఈరోజు మీరు ఆర్థిక నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఈరోజు మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. మీరు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండాలనుకుంటే, మీరు మంచి డైట్‌తో పాటు రోజూ వ్యాయామం చేయాలి. ఇది మీకు మానసిక శాంతిని ఇస్తుంది. అలాగే మీరు శారీరకంగా కూడా బలంగా ఉంటారు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చాలా సరదా మూడ్‌లో ఉంటారు. చాలా కాలం తరువాత, ఈరోజు తేలికపాటి పనిభారం కారణంగా, మీరు మీ గురించి శ్రద్ధ పెట్టగలుగుతారు. మేము మీ శృంగార జీవితం గురించి మాట్లాడితే, ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది. మీ భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ప్రేమ కూడా పెరుగుతుంది. మీరు వివాహం చేసుకుంటే మీ జీవిత భాగస్వామి నుండి మీకు మానసిక మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా పవిత్రంగా ఉంటుంది. ఈరోజు మీరు ముందుకు సాగడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందొచ్చు. మీరు వ్యాపారవేత్త అయితే, అకస్మాత్తుగా ఈరోజు మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించొచ్చు. అదే సమయంలో, పనిచేసే ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు, సోదరులు మరియు సోదరీమణులు అందరి నుండి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. మీరు మీ పనిని పూర్తి ఉత్సాహంతో పూర్తి చేస్తారు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 10, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published: Thursday, June 10, 2021, 5:00 [IST]