Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
Solar Eclipse 2021: తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!
2021లో సూర్య గ్రహణం సందర్భంగా 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
2021 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం జూన్ పదో తేదీన ఏర్పడబోతోంది. జ్యేష్ట మాసం క్రిష్ణ పక్షం అమావాస్య రోజున అంటే గురువారం మధ్యాహ్నం 1:42 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది.

తిరిగి సాయంత్రం 6:41 గంటలకు గ్రహణం ముగుస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ గ్రహణం చాలా ముఖ్యమైనది. ఈసారి సూర్యగ్రహణం వృషభరాశిలో జరగబోతోంది. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సూర్య గ్రహణం మన దేశంలో పాక్షికంగానే కనిపిస్తుంది. అయితే వలయకారంగా ఈ గ్రహణం ఏర్పడుతుంది.

ఈ సమయంలో సూర్యుడిలో 99 శాతం భాగం చంద్రుడు కప్పబడి ఉంటాడు. దీని ఫలితంగానే వలయాకారం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. అంటే రింగు మాదిరిగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఏడాది గ్రహణం ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది.. ఈ సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఎవరికి సానుకూలం.. ఎవరికి ప్రతికూలం అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
తొలి సూర్య గ్రహణం వల్ల ఈ రాశి శుభ ఫలితాలు రావొచ్చు. మీరు విదేశాల నుండి కొన్ని లాభాలను పొందొచ్చు. మీ కెరీర్ కు సంబంధించిన కొత్త అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఆరోగ్య పరంగా అజాగ్రత్తగా ఉండకూడదు. మీరు మానసికంగా ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి. చాలా ఓపికగా ఉండాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు ఎలాంటి రిస్క్ చేయకూడదు. ఈ కాలంలో మీరు జర్నీ చేయకపోవడమే మంచిది. అప్పుడే మీకు సానుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పనికి సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. అయితే మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవాలి. ఈ సమయంలో మీ వల్ల ఒకరు ఇబ్బంది ఎదుర్కోవచ్చు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారిపై తొలి సూర్య గ్రహణం ప్రభావం అంతగా ఉండదు. వీరికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు ప్రస్తుత పరిస్థితులను బట్టి.. తమ ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా సూర్య గ్రహణం సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. దానికి ముందు సరైన పరిశోధన చేయాలి. అప్పుడే మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు బయట ఆహారం తీసుకోకుండా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ కాలంలో మీకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది.

తుల రాశి..
ఈ రాశి వారు సూర్య గ్రహణం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా ఇంటి పెద్దలను సంప్రదించాలి. మీరు స్నేహితులతో సన్నిహితంగా ఉంటారు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.

వృశ్చిక రాశి..
తొలి సూర్య గ్రహణం వల్ల ఈ రాశి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు డబ్బు ఆదా చేయడంలో విఫలమవుతారు. మీరు చిన్న విషయాలపై కోపం తెచ్చుకోవచ్చు. కాబట్టి మీరు చాలా ఓపికగా ఉండాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్య గ్రహణం సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రత్యేక ఫలితాలను పొందుతారు. మీరు మీ పని రంగంలో విజయం సాధిస్తారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారు సూర్య గ్రహణం సమయంలో సోమరితనాన్ని వదులుకోవాలి. మీ పనిని వాయిదా వేసే అలవాటు కారణంగా, మీరు విజయవంతం కాలేరు. ఈ కాలంలో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీకు ఇంటి సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారిపై సూర్య గ్రహణం ప్రభావం పెద్దగా ఉండదు. అయితే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఉద్యోగం, వ్యాపారం చేసే వారు నిర్ణయాలను తొందరపాటులో తీసుకోకూడదు. ఏదైనా కొత్త దాన్ని నేర్చుకోవడానికి సమయం కేటాయించాలి.

మీన రాశి..
ఈ రాశి వారిపై సూర్య గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కాబట్టి మీరు నిర్లక్ష్యాన్ని వీడి శ్రద్ధగా పని చేయాలి.



Click it and Unblock the Notifications