For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (22-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

విదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండివిదుర నీతి: మీరు ధనవంతులు కావాలంటే వెంటనే ఈ 6 అలవాట్లను వదిలేయండి

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు శారీరకంగా చాలా బలంగా ఉంటారు. మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందారు పని విషయంలో ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు అన్ని సజావుగా సాగిపోతాయి. ఉద్యోగులు కొన్ని శుభవార్తలను కూడా వినొచ్చు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించకుండా ఖర్చు చేయడం మానుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. అయితే మీ జీవిత భాగస్వామి మానసిక స్థితి సరిగా ఉండదు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయే సమయంలో మీకు ఇబ్బందులు పెరుగుతాయి. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ ఇంట్లో ఈరోజు అంతా ప్రశాంతంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు వ్యాపారం విషయంలో ఈరోజు ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈరోజు మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈ రోజు ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. ఈరోజు అకస్మాత్తుగా బంధువు మీ ఇంటికి రావొచ్చు. మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడటంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు ఈ రోజు డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. పని విషయంలో వ్యాపారులు ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా బిజీగా ఉంటారు. మీరు ఈరోజు అన్నింటిలో కష్టపడి పని చేయడమే కాదు.. నిజాయితీతో అన్నింటినీ పూర్తి చేస్తారు. దీని వల్ల మీ సీనియర్లతో ప్రశంసలను పొందుతారు. ఈరోజు దాని నుండి మీరు మంచి ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారులు పెండింగు పనుల గురించి కొత్త మార్గాలను అన్వేషించాలి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీ ప్రియమైన వారికి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు. ఇలాంటి సమయంలోనే మీరు తెలివిగా వ్యవహరించాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మీకు త్వరలో ఆర్థిక ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆతురుతలో ఎటువంటి ఆర్థిక నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. ఉద్యోగులు ఈరోజు ఎక్కువగా కష్టపడాలి. మీరు మీ పనిని నిజాయితీగా చేస్తే, పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:55 నుండి రాత్రి 7 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు చాలా భావోద్వేగానికి లోనవుతారు. ఈ రోజు మీరు జీవితంలో జరుగుతున్న సమస్యల గురించి చాలా ఆందోళన చెందుతారు. పరిస్థితులతో సంబంధం లేకుండా, మీరు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఉద్యోగులు లేదా వ్యాపారులు ఈరోజు ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...Solar Eclipse 2020 : ఈ 4 రాశుల వారికి అదృష్టయోగం... మీ రాశి ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు అనసవరమైన విషయాలపై శ్రద్ధ వహిస్తే, మీరు మీ శక్తిని, సమయాన్ని వృథా చేసినట్లే. అందుకే ఈరోజు మీరు మరింత కష్టపడాలి. మరోవైపు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంపై పెద్దగా గొడవ పడే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో సంబంధాన్ని కొనసాగించడానికి వారి భావాలను అర్థం చేసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న సమస్య ఉంటే, వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభఫలితాలు ఉంటాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా, మీరు మీ పని మొత్తాన్ని పూర్తి చేయవచ్చు. ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం కూడా గడపగలుగుతారు. మరోవైపు ఈరోజు మీ ఇంటికి కొంతమంది అతిథులు అకస్మాత్తుగా ఇంటికి రావచ్చు. ఇది మీ వాతావరణాన్ని పెంచుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:35 నుండి రాత్రి 7:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల గురించి అనవసరంగా వివాదాన్ని కొనితెచ్చుకుంటారు. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. లేదంటే, మీరు చట్టపరమైన కేసులో కూడా చిక్కుకోవచ్చు. ఈ రోజు మీరు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడానికి ముందు, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈరోజు కొంత ఉపశమనం కలుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా లావాదేవీలను చేస్తారు. మరోవైపు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య తలెత్తితే, వెంటనే మీరు పూర్తి శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు మీ మనసులోకి ప్రతికూల ఆలోచనలను రానివ్వకండి. ఎందుకంటే మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు ఖర్చులు తక్కువగా ఉంటాయి. తల్లి నుండి కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ముఖ్యంగా మీరు ఇంటి పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఏదైనా పని ప్రారంభించే ముందు ప్రణాళిక ప్రకారం చేయాలి. అలాగే కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడే కొంత ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఏవైనా సమస్యలుంటే మీరు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. పని విషయంలో ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే, రోజూ వ్యాయామం చేయాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. మీరు దీర్ఘకాలిక ఆందోళన నుండి ఉపశమనం పొందుతారు. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీ సంతోషకరమైన మానసిక స్థితి మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఇది మీ విశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ రోజు డబ్బు విషయంలో చాలా అదృష్టంగా ఉంటుంది. అకస్మాత్తుగా భారీ ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ మరియు మద్దతు పొందడం చాలా సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 22, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Saturday, June 20, 2020, 18:37 [IST]
Desktop Bottom Promotion