For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం మీ రాశిఫలాలు (23-06-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే మీరు ఎవరితో అయినా గొడవ పడొచ్చు. దీని వల్ల మీరు మీ సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప, ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు ఈరోజు మీ అమ్మకాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. అలాగే ఏదైనా కొత్త పనిని చేసే ముందు, పాత పనిని పూర్తి చేయడం శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పూర్తి సానుకూలంగా ఉంటారు. ఈ రోజు మీరు తి ప్రయత్నంలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు అన్ని సానుకూల ఫలితాలే ఎదురవుతాయి. నిరుద్యోగులకు కెరీర్ కు సంబంధించిన ఆందోళనలు ఈరోజు తొలగించబడతాయి. మీకు విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు అనేక ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:50 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఎలాంటి గాసిప్ లలో భాగం కాకుండా ఉండాలి. వ్యాపారులు ఈరోజు వ్యాపారంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు విలువైన సమయాన్ని వృథా చేయవద్దు. మరోవైపు, మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మరోవైపు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ స్వభావం కారణంగా మీరు ఇంటి సభ్యుడితో విభేదాలు కలిగి ఉండవచ్చు. మీరు మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకుంటే మంచిది. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఆందోళన ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అయితే వీటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. దీన్ని మెరుగుపరిచేందుకు మీరు అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే, మీరు మరింతగా కష్టపడాలి. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అయితే మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులపై చాలా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పనిలో మంచి ఫలితాలు వస్తాయి. మీ పనితీరు ప్రశంసించబడుతుంది. ఉన్నతాధికారులు కూడా మీ పని పట్ల సంతృప్తి చెందుతారు. మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మరోవైపు, వ్యాపారులు ఈ రోజు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో ఇంతవరకు ఉన్న అడ్డంకులు కూడా అధిగమించబడతాయి. మీ పని వేగంగా పూర్తవుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 05

లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులకు ఈరోజు కొంత పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. వ్యాపారులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాలి. లేకపోతే మీకు లాభం వచ్చే స్థానంలో నష్టం ఉండవచ్చు. మీ ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. అయితే మీకు మీ కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశం లభించదు. మీ ప్రియమైన వారితో సంబంధంలో మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 7 గంటల వరకు

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే వారిని అస్సలు వదులుకోకండి...

 తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. వ్యాపార పరంగా ఏ నిర్ణయమైనా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరోవైపు పనిలో ఉండే వారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. త్వరలో మీ కలలన్నీ నెరవేరుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు హెచ్చుతగ్గులతో ఉంటాయి. అయితే తల్లిదండ్రుల పూర్తి మద్దతు ఉంటుంది. మరోవైపు, జీవిత భాగస్వామితో సంబంధంలో కొన్ని విభేదాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు సమయానికి డబ్బు దొరకడం కష్టంగా మారుతుంది. అయితే మీరు నిరుత్సాహం చెందాల్సిన పని లేదు. మీ ప్రయత్నాన్ని పట్టు విడవకుండా కొనసాగించాలి. మరోవైపు ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీకు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. అవసరమైతే వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కొన్ని కొత్త వ్యూహాలను రూపొందించాలి, తద్వారా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు క్రొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే, తగిన సలహా తీసుకున్న తర్వాతే మీ తుది నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో కొన్ని అదనపు బాధ్యతలు రావొచ్చు. మీరు అందరితో కలిసి పనిచేస్తే, అది మీకు చాలా సులభం అవుతుంది. మరోవైపు, మీరు కష్టపడి పనిచేయాలి ఎందుకంటే మీ కృషి మిమ్మల్ని పురోగతి మార్గంలోకి తీసుకెళ్తుంది. మీరు పురుగుమందుల సంబంధిత వ్యాపారం చేస్తే ఈ రోజు మీరు మంచి ప్రయోజనం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత మెరుగుదల ఉంటుంది. మీ ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజు తోబుట్టువులతో. ప్రతికూల పరిస్థితులలో మీ జీవిత భాగస్వామితో కలవడం ద్వారా మీరు చాలా రిలాక్స్ అవుతారు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. అయితే మీరు ఎలాంటి రుణాలు తీసుకోకుండా ఉండాలి. లేదంటే రాబోయే రోజుల్లో మీపై ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని, సానుకూలంగా ముందుకు సాగడం మంచిది. వ్యాపారులకు ఈరోజు కొంత నష్టం రావచ్చు. మరోవైపు మీరు మానసిక శాంతిని కాపాడుకోవాలనుకుంటే, ప్రతిరోజూ ధ్యానం చేయండి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు పేదవారికి ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా, మీరు చాలా రిలాక్స్ అవుతారు. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈరోజు చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. మీరు సానుకూల ఆలోచనతో ఉంటే, అన్నింటినీ సులభంగా పూర్తి చేస్తారు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. తండ్రి నుండి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. తేలికపాటి వ్యాయామంతో ప్రతిరోజూ మీ రోజును ప్రారంభించండి. మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. మీ టాలెంట్ ను చూపించడానికి మీకు సువర్ణావకాశం లభిస్తుంది. మీరు లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తే, కచ్చితంగా మంచి ప్రయోజనాలే లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించుకుంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో ఆనందకరమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామికి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. మీ సంబంధం బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 23, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Tuesday, June 23, 2020, 6:00 [IST]