For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (26-06-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Gupt Navratri 2020 : ఇలా చేస్తే దుర్గామాత ఆశీర్వాదం తప్పక లభిస్తుందట...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కూడా ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు మీ సహోద్యోగుల నుండి కొన్ని సమస్యలు రావచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టలేరు. ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో మీ పని మీకు చాలా ముఖ్యమైనది. ఈ రోజు వ్యాపారులు మంచి ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారాన్ని మరింతగా పెంచడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే, ఈ రోజు మీరు సరైన దిశలో పయనిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ పింక్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. మీరు వారి ఆశీర్వాదం పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు పని విషయంలో మామూలుగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొత్త మార్గాలు కనిపించవచ్చు. మీరు తెలివిగా పనిచేస్తే, మీకు కచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :38

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే మీకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను నడిపించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. మీరు కష్టపడి పనిచేయడం మంచిది. వ్యాపారులకు మాత్రం ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు కుటుంబంతో మంచి రోజు అవుతుంది. మీరు అవివాహితులైతే, ఈ రోజు మీ కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :27

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి సాయంత్రం 4:50 గంటల వరకు

ఆశాడ గుప్త నవరాత్రి 2020 డే4: కుష్మండ పూజ, భోగ్, మంత్రం మరియు విధి

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయకపోతే, మీ ఇబ్బందులు పెరుగుతాయి. నిరుద్యోగులు వారి ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు మీ బృందానికి నాయకులైతే, మీరు ప్రతి ఒక్కరితో సరిగ్గా వ్యవహరించాలి. మరోవైపు, ఈ రోజు రిటైల్ వ్యాపారులకు చిన్న లాభాలు రావచ్చు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :37

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అయితే మీరు మీ వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు నష్టపోతారు. ఈరోజు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులకు ఈరోజు నిరాశ ఎదురవుతోంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈరోజు పనులు పూర్తి కాకపోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ఉపమశనం లభిస్తుంది. దీంతో మీరు చాలా రిలాక్స్ అవుతారు. మీరు మంచి మానసిక స్థితిలో ఉంటారు. మీపై పని యొక్క ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మీ పని అంతా సమయానికి పూర్తవుతుంది. ఉద్యోగులకు ఈరోజు కార్యాలయంలో వాతావరణం బాగుంటుంది. పని చేయడంలో మీరు ఆనందాన్ని పొందుతారు. వ్యాపారులు ఈరోజు ఎలాంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు ఎలాంటి సమస్యా ఉండదు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :39

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు అంతా సానుకూలంగా ఉంటుంది. అయితే మీరు అందరితో మర్యాదగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా మీరు మంచి విజయాన్ని పొందవచ్చు. మీరు పాత అప్పుల నుండి బయటపడొచ్చు.అంతేకాదు, మీకు కొత్త ఆదాయ వనరులు దక్కే బలమైన అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :20

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 11:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అనేక పనులు ఒకేసారి చేయాల్సి ఉంటుంది. అందుకే మీరు మీ పనులన్నింటినీ ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. అప్పుడే మీరు తొందరపాటు మరియు భయాందోళన చెందకుండా అన్నింటినీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీకు సకాలంలో డబ్బు అందకపోవచ్చు. ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :13

లక్కీ టైమ్ : ఉదయం 10:10 నుండి మధ్యాహ్నం 12:25 వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధంలో దూరాన్ని తగ్గించుకోవాలి. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి ఉద్యోగులకు ఈరోజు పనిలో చాలా మంచి రోజు అవుతుంది. వ్యాపారులు ఆర్థిక పరమైన రిస్కులు తీసుకోకుండా ఉండాలి. ఈరోజు మీ స్నేహితులతో చాలా సరదాగా ఉండే రోజు అవుతుంది. ప్రతికూల పరిస్థితులలో మీరు వారి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. మీరు కుటుంబంతో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీకు ఈరోజు ఏదైనా ముఖ్యమైన విషయం గురించి సందిగ్ధత ఉంటే, మీరు మీ జీవిత భాగస్వామితో మీ మనస్సును పంచుకోవాలి. మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా పూర్తి విశ్వాసంతో చేయాలి. ఇలానే ముందుకు సాగితే, మీకు కచ్చితంగా విజయం లభిస్తుంది. పనిలో ఉండే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఈరోజు ఓ సువర్ణావకాశం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ ఆశిస్తుంటే, మీరు కష్టపడి పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు గొప్ప ఉపశమనం కలగొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం వేగంగా పెరుగుతుంది. అయితే కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మీరు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, ప్రతి నిర్ణయాన్ని న్యాయమైన పద్ధతిలో తీసుకోండి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈరోజు ముఖ్యమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. మరోవైపు వ్యాపారులకు ఈరోజు గొప్ప రోజు అవుతుంది. మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. రాబోయే రోజుల్లో మీకు చాలా ప్రయోజనం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువగా ఖర్చులు చేయకూడదు. లేదంటే మీ ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా పడిపోతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 26, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Friday, June 26, 2020, 6:00 [IST]