`
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శనివారం మీ రాశిఫలాలు (27-06-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Gupt Navratri 2020 : ఇలా చేస్తే దుర్గామాత ఆశీర్వాదం తప్పక లభిస్తుందట...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత స్థానాలు దక్కవచ్చు. మీ కెరీర్ కొత్త మలుపు తీసుకుంటుంది. మరోవైపు, మీరు నిరుద్యోగులైతే, ఈ రోజు మీ ఉపాధి కోసం అన్వేషణ ముగియవచ్చు. ఇవన్నీ మీ కృషి ఫలితమే. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది, ముఖ్యంగా మీరు ఇంటి పెద్దల ఆశీర్వాదం పొందుతారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 11 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆఫీసులో మీ చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచండి. మీ సహోద్యోగులను ఎక్కువగా నమ్మకండి. లేకపోతే మీ కృషికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు. మీరు క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు మీ ప్రణాళిక ముందుకు సాగవచ్చు. ఈరోజు ఆర్థిక పరమైన సమస్యలకు పరిష్కారం దొరకొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు అదనపు బాధ్యతలు రావొచ్చు. దీంతో మీరు ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతమైన మనసుతో పని చేయాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు. అయితే మీరు తొందరపడకండి. మరోవైపు ఈరోజు మీకు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. మీకు ఆర్థిక సమస్యలు ఏమి ఉండవు. ఆరోగ్యం విషయానికొస్తే, మీకు మైగ్రేన్ సమస్య ఉంటే, సమయానికి ఆహారం తీసుకుని, తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ఆశాడ గుప్త నవరాత్రి 2020 డే4: కుష్మండ పూజ, భోగ్, మంత్రం మరియు విధి

 కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం విషయంలో, ఉద్యోగులు కొత్త కంపెనీలో ఏదైనా ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యుంటే, మీరు ఈరోజు శుభవార్త వింటారు. ఈ రోజు వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. మీరు క్రొత్త వ్యాపార ఆఫర్‌ను స్వీకరించవచ్చు. ఈ సమయంలో, మీరు ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక విషయానికొస్తే, ఈ రోజు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించాలి. తద్వారా భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీకు కుటుంబసభ్యుల నుండి భావోద్వేగ మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :9

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

 సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆర్థిక పరమితుల కారణంగా మీరు పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు. ఈ రోజు, కొన్ని పాత అప్పుల గురించి మీ ఆందోళన కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మీరు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం మీకు మంచిది. మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహిస్తే, మీ డిపాజిట్ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఉద్యోగం చేసేవారు సహోద్యోగులతో వాదనలు మానుకోవాలి. లేకపోతే మీరు మీ ప్రతిష్టను కోల్పోతారు. ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 8:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కార్యాలయంలో పనితీరు ప్రశంసించబడుతుంది. ఈరోజు మీ పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. కుటుంబ సభ్యులతో ఏదైనా విషయంలో గొడవ ఉండొచ్చు. అయితే ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే మీకు సమస్యలు పెరుగుతాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా భావిస్తారు... ఆధ్యాత్మికంగా మాత్రం గొప్ప ఫలితమొస్తుందట.. ఎందుకు?

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మరోసారి శ్రద్ధగా అధ్యయనం చేయగలుగుతారు. అవసరమైతే, మీ పెద్దలు మరియు గురువుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు మరింత భావోద్వేగానికి లోనవుతారు. మీ భావోద్వేగాలను నియంత్రించడం మీకు మంచిది. కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణమైనదిగా అనిపిస్తుంది. కుటుంబంతో మీ సంబంధం మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ఈరోజు నెమ్మదిగా సాగుతుంది. అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ముఖ్యమైనది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు కూడా చేయవచ్చు. మీ వివాహ జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :26

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు కొన్ని మార్పులు ఉండొచ్చు. అయితే, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మార్పు మీ ఆసక్తిలో ఉంటుంది. మరోవైపు, వ్యాపార వ్యక్తులు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు ధైర్యంగా పనిచేయాలి. అప్పుడే మీరు మీ కృషికి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ :10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:05 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఒక పెద్ద సమస్యను స్నేహితుల సహాయంతో పరిష్కరించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు వారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకూడదు. మానసికంగా ఈ రోజు మీరు బాగా అనుభూతి చెందుతారు. కుటుంబంతో కూడా చాలా సరదాగా గడుపుతారు. ఆర్థిక విషయానిస్తే, మీరు పొదుపుపై ​​ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కొంటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు ఓవర్ టైం కూడా చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు సాధారణంగా అవుతుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఉద్యోగులు ప్రమోషన్ గురించి ఆలోచిస్తుంటే, ఈరోజు మీకు నిరాశ ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి. అలాగే కష్టపడి పని చేస్తుంటే, మీకు త్వరలో కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ఖర్చులు చేయకండి. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి రాత్రి 7 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఈరోజు సహోద్యోగులపై ఆధిపత్యం చెలాయించకండి. ప్రతికూల పరిస్థితుల్లో వారికి తోడ్పాటునివ్వండి. మరోవైపు వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు అదే విధంగా పొదుపు చేయడంపై దృష్టి పెడితే, మీ ఆర్థిక సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబంతో సంబంధం ప్రేమ మరియు పరస్పర బంధాన్ని పెంచుతుంది. ఆరోగ్య పరంగా అనేక సమస్యలు తగ్గిపోతాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి మధ్యాహ్నం 3:50 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 27, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Saturday, June 27, 2020, 6:00 [IST]