Latest Updates
-
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి!
బుధవారం మీ రాశిఫలాలు (18-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, బుధవారం వారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి శక్తివంతమైన అనుభూతి చెందుతారు. ముఖ్యంగా మీరు కొన్ని దీర్ఘకాలిక వ్యాధితో పోరాడుతుంటే, ఈ రోజు మీకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది. ప్రేమ విషయంలో కొన్ని విబేధాలు ఎదురుకావచ్చు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. దీని వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఉద్యోగులు ఆఫీసులో పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు ప్రశంసించబడుతుంది. మీరు కుటుంబంతో కొంత సమయం గడపడానికి కూడా అవకాశం దక్కుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. వారు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతి ఉత్సాహం మంచిది కాదు.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 6
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత మెరుగుదల ఉంటుంది. సొంత వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా ఈరోజు ఓ వ్యక్తి నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. మీరు కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ప్రేమ ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అద్భుతంగా ఉంటుంది. మీరు వ్యాపారులైతే, ఈరోజు మంచి ప్రయోజనం పొందొచ్చు. మీకు ఆర్థిక పరంగా పెద్ద ప్రయోజనం కూడా లభిస్తుంది. అయితే వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క బలమైన మానసిక స్థితి ఈ రోజు మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణమవుతుంది. అదే సమయంలో, ప్రేమలో ఉన్న జంటలు వారి వివాహం గురించి వారి కుటుంబాలతో మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం విషయంలో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. నిరుద్యోగులకు ఈరోజు ఉపాధి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబసభ్యుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది.ఈ రోజు మీరు స్నేహితులతో కూడా కొంత మంచి సమయం గడపగలుగుతారు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయాన్ని గడుపుతారు. మీ ప్రియమైన వారితో మీ మనస్సును పంచుకోవడం మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈరోజు మీరు మీ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. నేటి ప్రయాణం వ్యాపారులకు ఎంతో మేలు చేస్తుంది. ఆరోెగ్య పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సమస్యలు మీ పనిని కూడా ప్రభావితం చేస్తాయి. తోబుట్టువులతో విభేదాలు లోతుగా ఉండే అవకాశం ఉంది, దీనివల్ల మీరు రోజంతా నిరాశకు లోనవుతారు. మీరు మీ సంబంధాన్ని మెరుగుపరచాలనుకుంటే, మొదట మీరు ఇతరులపై ఆధిపత్యం చెలాయించే అలవాటును మార్చుకోవాలి. మరోవైపు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి.కానీ అందుకోసం బాగా శ్రమించాలి. ఈరోజు మీ ఆరోగ్యం కూడా బలహీనంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 27
లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు గతంలో తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు వల్ల ఈరోజు సమస్యలు పెరగొచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనవసరంగా కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉంటారు. ఈ రోజు చాలా ప్రతికూల ఆలోచనలు గుర్తుకు వస్తాయి. మీరు ఓపికగా పనిచేయడం మంచిది. మొత్తం మీద, ఈ రోజు మీకు చాలా కష్టంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీరు పొందబోయే ఆర్థిక ప్రయోజనం వాయిదా వేయవచ్చు. దీని వల్ల మీ అనేక ప్రణాళికలు దెబ్బతినవచ్చు. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధాలు బాగుంటాయి. జీవిత భాగస్వామికి కూడా మద్దతు లభిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీరు విశ్వాసంగా ఉంటారు. ఈరోజు మీరు సానుకూల ఫలితాలను పొందొచ్చు.
లక్కీ కలర్ : కుంకుమ
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా విలువైన వస్తువును కొనే ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఈరోజు మీ కుటుంబంలో ఆనందం మరియు ఉత్సాహం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మరోవైపు, కొన్ని చట్టపరమైన అడ్డంకులు ఉండవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : ఉదయం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు ఓ పెద్ద అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో ఉపాధి ప్రజలకు ఈరోజు అద్భుతమైన రోజు కానుంది. మరోవైపు, ఈరోజు నిరుద్యోగులకు ఉపాధి లభించే బలమైన అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయటానికి ఈరోజు మంచిగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు, భాగస్వాములతో ఈ రోజు మంచి ప్రయోజనాలను పొందవచ్చు. వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ రోజు మీరు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు



Click it and Unblock the Notifications