For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (20-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శుక్రవారం వారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope March 20, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ 6 రాశుల వారు రహస్యాలు ఏ మాత్రం దాచుకోలేరు, వెంటనే రివీల్ చేసేస్తారు..ఈ 6 రాశుల వారు రహస్యాలు ఏ మాత్రం దాచుకోలేరు, వెంటనే రివీల్ చేసేస్తారు..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులపై శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యంగా ఈరోజుమీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంక్లిష్టమైన విషయాలను పరిశీలించాలి. ఈరోజు మీరు ఎంటర్ టైన్మెంట్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాదు ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈరోజు మంచిగా ఉంటుంది.మరోవైపు, ఈ రోజు వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అయితే అదనపు ఆదాయం కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీజీవిత భాగస్వామితో సంబంధం ఎంతో విలువైనదిగా అనిపిస్తుంది. పని విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. ఈరోజు మీరు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. మీకు ఈరోజు అన్నిచోట్ల పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు ఎంతగానో లక్కీ కలసివస్తుంది. ఈరోజు మీ పని విజయవంతం అయ్యే అవకాశం ఉంది.కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. తల్లిదండ్రుల సహాయంతో మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 8:45 గంటల వరకు

ఈ రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులవుతారట... మీ రాశి ఉందేమో చూడండి మరి...ఈ రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులవుతారట... మీ రాశి ఉందేమో చూడండి మరి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో మీరు చాలా ఆందోళన చెందుతారు.ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతారు. మరోవైపు ఈరోజు ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.మీరు మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు కొన్నిసందర్భాల్లో విజయం సాధిస్తారు. మరోవైపు, కొన్ని సందర్భాల్లో నిరాశ చెందుతారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ సామర్థ్యం చాలా బాగా ఉంటుంది. మీరు మీ పనిలో వేగం కూడా పెంచుతారు. ఆర్థిక పరంగా కూడా మెరుగ్గానే ఉంటుంది.చిన్న పెట్టుబడులు పెట్టడానికి రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ రోజు రుణాలు ఇవ్వడం మానుకోవాలి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పనిపై శ్రద్ధ పెట్టకపోతే, మీపై ఒత్తిడి పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాల గురించి చింతించడం వంటి అలవాటును మార్చుకోవాలి. ఈరోజు మీరు మీ కుటుంబంతో తగినంత సమయం గడపాలి. అయితేమీరు పని ఒత్తిడిలో మీ కుటుంబానికి సరైన సమయం ఇవ్వలేరు. పని విషయంలో మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. ఈరోజు మీరు మీప్రియమైన వారితో ఈరోజు ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు స్నేహితులతో కొంత సమయం గడపడానికి కూడా అవకాశం పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ఏదైనా ప్రత్యేక బహుమతిని పొందవచ్చు.ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరగడం వల్ల మీకు కొంత కష్టంగా అనిపిస్తుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా రిలాక్స్ అవుతారు.ఎందుకంటే ఈ రోజు మీకు ఏవైనా సంక్లిష్టమైన విషయాలను పరిష్కరించే బలమైన అవకాశం ఉంది. ఈ విషయం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కూడా కావచ్చు. ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది.మీ సంబంధాన్ని మీ కుటుంబ సభ్యులు ఆమోదించే అవకాశం ఉంది. ఈ రోజు కూడా వివాహితులకు కూడా మంచిగా ఉంటుంది.మీరు మీ జీవిత భాగస్వామితో నిశ్శబ్దంగా మరియు ప్రేమగా గడుపుతారు. అయితే ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సాధ్యమైనంత వరకు మీ స్వరాన్ని తగ్గించి మాట్లాడేందుకు సంయమనం పాటించండి. మరోవైపు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మంచి ప్రయాణం కూడా చేయగలుగుతారు.ఈ రోజు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైన రోజు. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత పెద్ద విజయం లభించవచ్చు. మీఉన్నతాధికారులు మీ సామర్థ్యాన్ని ఎంతో అభినందిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తీరడం వల్ల పెండింగులో ఉన్నపనులు కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. ఇది మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన రోజు అవుతుంది. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి సంబంధించి మీరు ఏ పని చేసినా, మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు.మీరు కష్టపడి పని చేస్తారు. ఈ రోజు మీ పనితో మీరు సంతృప్తి చెందుతారు. వ్యాపారవేత్తలు కొత్తగా ప్రారంభించిన వ్యాపారం నుండి ఏదైనా పెద్ద లాభం పొందవచ్చు. ఈ రోజు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు, తద్వారా మీరు ఒకేసారి అనేక పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధంగా ఉంచుకోవడం మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు చాలా లాభాన్నే పొందుతారు. కాబట్టి మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి.ఈ రోజు శ్రామిక ప్రజలు కొన్ని శుభవార్తలను పొందవచ్చు. బహుశా ఈ రోజు మీరు మీ కృషి ఫలాలను పొందుతారు. ఈ రోజు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో భంగం ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:15 నుండి రాత్రి 8:05 గంటల వరకు

English summary

Daily Horoscope March 20, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, March 20, 2020, 0:36 [IST]
Desktop Bottom Promotion