For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (25-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అపోహలన్నింటినీ తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే కొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఈరోజు మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందడం ద్వారా సానుకూలతను పొందుతారు. పని విషయంలో ఈరోజు పూర్తి ఉత్సాహంగా ఉంటారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 8:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అకస్మాత్తుగా కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు పని విషయంలో ఏకాగ్రతగా ఉండకపోతే, మీ ఉన్నతాధికారులు మీపై కోపంగా ఉంటారు. ఈరోజు మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థికంగా ఈరోజు మీకు కొన్ని గొప్ప అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఈరోజు ప్రతి విషయం మీకు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 45

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీ ప్రేమను కూడా పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు లావాదేవీలకు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంట్లో ఇతర సభ్యుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థక స్థితిని బలోపేతం చేసేందుకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. ఈరోజు మీకు తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామి యొక్క మద్దతు కారణంగా ప్రతి విషయంలోనూ ధైర్యంగా, సహనంతో పని చే్స్తారు. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణం మానుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10:15 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఓ ముఖ్యమైన సమస్యను వారి జీవిత భాగస్వామి సహాయంతో పరిష్కరించుకోవచ్చు. మీ ప్రియమైన వారి అవగాహన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీకు పని విషయంలో చాలా తేలికగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ప్రేమ విషయంలో ఈరోజు ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువ సమయం ఫోన్ లేదా ఇంటర్నెట్ లో గడుపుతారు. మీరు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:55 నుండి మధ్యాహ్నం12:35 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి భావాలను మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. త్వరలో మీ కెరీర్ కొత్త మలుపు తీసుకుంటుంది. వ్యాపారులకు ఈరోజు కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు మీరు అడుగడుగునా ఆలోచనాత్మకంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క తొందపాటు నిర్ణయం వల్ల మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. దీని వల్ల మీ మానసిక స్థితి కొంచెం దిగజారిపోతుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు మాటలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కార్యాలయంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆర్థిక పరంగా ఈరోజు పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఈరోజు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువులతో మీ సంబంధం బాగానే ఉంటుంది. మీరు మీ ఇంటి సభ్యులందరి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత నష్టాలు రావచ్చు. అందుకే మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు ఊహించిన విధంగా ఆదాయం ఉండదు. కుటుంబసభ్యుల మధ్య తేడాలు మరింత లోతుగా ఉంటాయి. ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు సంతోషంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, మీ ఉన్నతాధికారుల వైఖరి కఠినంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చూపే శ్రద్ధ వల్ల మీ సీనియర్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈరోజు మీకు కొన్ని కొత బాధ్యతలు రావచ్చు. మీ సామర్థ్యం నిరూపించుకోవడానికి ఈరోజు మంచి అవకాశం రావచ్చు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆదాయం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఖర్చులు తగ్గడం వల్ల, మీరు పొదుపుపై ద్రుష్టి పెడతారు. మీరు మీ పనులపై శ్రద్ధ చూపుతారు. మీరు ఈరోజు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే, ఉన్నతాధికారులు మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. మీ దూకుడు స్వభావం వల్ల మీ కుటుంబసభ్యులు కోపంగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య ఉండదు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ మానసిక స్థితి బాగానే ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి. మీరు అకస్మాత్తుగా దూరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై మీరు ఈరోజు శ్రద్ధ చూపాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా సందర్భాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ ఉత్సాహం కూడా పెరుగుతుంది. మీ చుట్టూ ఈరోజు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 32

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

English summary

Daily Horoscope March 25, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Desktop Bottom Promotion