Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
మంగళవారం మీ రాశిఫలాలు (03-03-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితి కొంత మెరుగవుతున్నట్లు కనిపిస్తుంది. మీ విశ్వాసం మీకు మళ్లీ తిరిగి వస్తుంది. మీ కుటుంబంలో మీకు శాంతి లభిస్తుంది. ప్రేమ విషయంలో మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుంది. ఆర్థిక పరంగా ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. పెద్ద లాభాలొస్తాయనే ఆశతో తప్పుడు మార్గంలో వెళ్లొద్దు. వైవాహిక జీవితంలో ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు మానసిక శాంతి లభిస్తుంది.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

వృషభ రాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ఆనందాన్ని పొందవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో మీకు మద్దతు ఇస్తారు. అయితే మీ ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ : 23
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు నమ్మకం పెరుగుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీకు ఈరోజు ఓ సువర్ణావకాశం రావచ్చు. మీరు కచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు
మార్చిలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... ఈ 2 రాశుల నిరుద్యోగులకు ఉద్యోగం ఖాయం...!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా వారి జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు. దీని వల్ల మీ ఇంటి వాతావరణం చెల్లాచెదురు అవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఓపికగా వ్యవహరించండి. మీ మనసు మార్చుకోండి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయ. మీ భావోద్వేగాలపై నియంత్రణ ఉంచండి. లేదంటే మీరే తర్వాత పశ్చాత్తాపడతారు. ఈరోజు సాయంత్రం అకస్మాత్తుగా పాత స్నేహితుడిని కలవవచ్చు.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:15 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పరీక్షల్లో విజయవంతం కావాలంటే, మీరు నిర్లక్ష్యాన్ని వీడాలి. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు కొంత వివాదం ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీరు పొదుపుపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తే, మీరు మీ రుణాన్ని సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 8
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు చాలా మంచి అనుభూతి పొందుతారు. పని విషయాలలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీరు గొప్ప గౌరవాన్ని కూడా పొందొచ్చు. ఇది మీ కెరీర్ కు కొత్త దిశను ఇస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 22
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు
గుడ్లగూబ నిజంగా లక్ష్మీదేవి వాహనమేనా? ఆ సమయంలో గుడ్లగూబ మీ ఇంటిపై వాలితే...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సందర్భాల్లో ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఓ కేసు ఈరోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. పని విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉండొచ్చు. ఈరోజు మీరు పనికి సంబంధించి అకస్మాత్తుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కార్యాలయంలో జరిగే పాలిటిక్స్ కు దూరంగా ఉండాలి. లేకపోతే అవనసరమైన వివాదాల్లో మీరు ఇరుక్కుపోవచ్చు. వ్యాపారులు భాగస్వాములతో ఏదైనా వివాదం ఉంటే మానుకోవాలి. కుటుంబ జీవితంలో ప్రతిదీ సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామితో అదనపు సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీకు చాలా విషయాలు ప్రతికూలంగా ఉండొచ్చు. సరైన సమయంలో మీ కుటుంబసభ్యుల మద్దతు మీకు లభించదు. దీంతో మీరు నిరాశ చెందుతారు. మరోవైపు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కష్ట సమయాల్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు ధైర్యంగా కష్టపడి పనిచేస్తే, త్వరలో పరిస్థితితో మెరుగుదల కనిపిస్తుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 15
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. జీవిత భాగస్వామితో పరస్పర అనుబంధం పెరుగుతుంది. ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు అకస్మాత్తుగా ఒక సమస్య తలెత్తవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ : 36
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఒత్తిడికి దూరంగా ఉంటారు. పని విషయంలో ఈరోజు మంచి ఫలితాలనే పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొంత పెద్ద మొత్తంలో లాభాలనే పొందుతారు. ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 13
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు పెట్టుబడి పెట్టే మంచి అవకాశాన్ని పొందవచ్చు. అయితే మీరు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంబంధాలు బాగుంటాయి. ఈరోజు మీ ఆరోగ్య విషయాలు కూడా బాగానే ఉంటాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : రాత్రి 9:20 నుండి రాత్రి 10 గంటల వరకు



Click it and Unblock the Notifications











