For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్లగూబ నిజంగా లక్ష్మీదేవి వాహనమేనా? ఆ సమయంలో గుడ్లగూబ మీ ఇంటిపై వాలితే...

|

మనం సాధారణంగా లక్ష్మీదేవి చిత్రపటాలను లేదా విగ్రహాలను చూసినప్పుడు, మనకు రెండు ఏనుగులు.. తామర పువ్వులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం లక్ష్మీదేవి చిత్రపటంలో గుడ్లగూబ కనిపిస్తూ ఉంటుంది.

అది కూడా ఏకంగా ఆ గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యమయ్యిందోనని చాలా మందికి అనుమానం వచ్చి ఉంటుంది. అందుకు సమాధానం కావాలంటే మీరు హిందూ పురాణాలను వెతకాల్సిందే. ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించిన వాహనం గురించి మనకు వచ్చిన అనుమానాలన్నింటికీ అక్కడ సమాధానం దొరికే అవకాశం ఉంది. అలాంటి ఆసక్తికరమైన కథను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

నారదుడి శాపం..

నారదుడి శాపం..

హిందూ పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసిన ఓ గాన సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవడంతో అతను చాలా బాధపడతాడు. పైగా అదే సభలో తుంబురుడు సకలమర్యాదలు పొందడంతో నారదుడు మరింత అసూయకు గురవుతాడు. అంతే వెంటనే లక్ష్మీదేవి పతి అయిన విష్ణువుని కలవడానికి వెళ్లగా.. చెల్లికత్తెలు తనని అడ్డుకుంటారు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. గుడ్లగూబను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు.

నారదుడి కోపాన్ని తగ్గించేందుకు..

నారదుడి కోపాన్ని తగ్గించేందుకు..

ఆ సమయంలో విష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి నారదుని గర్వాన్ని అణించేందుకు అతని పాదాలపై పడతాడు. దీంతో నారదుడు శాంతిస్తాడు. అప్పుడు నారదుడు తను చేసిన తొందరపాటు పనికి సిగ్గు పడతాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు. సంగీతం ఎవరి సొత్తు కాదని.. సంగీతాన్ని ప్రేమించే వారు గర్వానికి, అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు. అసలైన సంగీత తత్వ్తాన్ని అన్వేషించమని చెబుతాడు.

ఉలూకపతి ఎవరంటే..

ఉలూకపతి ఎవరంటే..

అంతేకాదు సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉలూకపతి వద్దకు వెళ్లి సంగీతాన్ని అభ్యసించమని కోరతాడు. ఆ ఉలూకపతి ఎవరో కాదు. ఓ గుడ్లగూబ. అప్పటికే ఉలూకపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు. అప్పుడు గుడ్లగూబను కలవడానికి వచ్చిన నారదుడిని చూసి ఉలూకపతి పరవశించిపోతాడు. తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు.

మరో కథలో చెట్టుతో కష్టాలు..

మరో కథలో చెట్టుతో కష్టాలు..

హిందూ పురాణాల ప్రకారం ఆనాటి కాలంలో అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురముండేవారంట. వారు దారిద్య్రరేఖకు దిగువగా జీవించే వారంట. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఓ గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే, మరొకరు చిన్న పేలికను ఒంటిపై కట్టుకుని యాచనకు వెళ్లేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్లగా ఏమీ దొరక్కపోవడంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చోని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటాడు.

అది విన్న గుడ్లగూబ..

అది విన్న గుడ్లగూబ..

అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని.. అతని కష్టాలను తీర్చాలని ప్లాన్ వేస్తుందట. ఓ వైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ.. తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అయితే లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్లు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది.

శాస్త్రం ప్రకారం..

శాస్త్రం ప్రకారం..

సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడ నుండి వెళ్లిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించినా ఇంటి దగ్గరికి వెళ్లి గుడ్లగూబ అరుస్తుండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తనవైపు కోపంగా చూస్తుంది.

అప్పుడే ఆ ఇంటికి..

అప్పుడే ఆ ఇంటికి..

ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్లిన వారి ఇంటికి తీసుకెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి ఆ లక్ష్మీదేవి చలించిపోతుంది. అంతే వెంటనే వారి ఇంట్లో కొలువై ఉంటానని, వారికి అష్ట ఐశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆరోజు నుండి తనకు దారి చూపించిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుందట.

గుడ్లగూబను శుభసూచికగా..

గుడ్లగూబను శుభసూచికగా..

అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుగొంటూ.. వారికీ, ఆ మహాలక్ష్మీకి మధ్య దిక్సూచిలా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండీ తన కొత్త ప్రస్థానాన్ని మొదలుపెడుతుంది.

గుడ్లగూబను అశుభానికే...

గుడ్లగూబను అశుభానికే...

పక్షుల జాతిలో సాహస యాత్రలు చేసే జీవిగా గుడ్లగూబకు మంచి ప్రావీణ్యం ఉంది. ఉల్లూక తంత్రంలో గుడ్లగూబలను ఇంటికి రప్పించే మార్గాలను గురించి తెలియజేశారు. పగలు గుడ్లగూబలకు కంటిచూపు సరిగ్గా పని చేయదు. అందుకే రాత్రి వేళలో మాత్రమే ఇవి సంచరిస్తాయి. ఎవరైనా అత్యవసర పని మీద బయటకు వెళ్లిన ప్పుడు గుడ్లగూబ ఎదురొస్తే, ఆ పని కచ్చితంగా నెరవేరుతుందని అంటూ ఉంటారు. అయితే ఎన్ని కథలు విన్నా.. ఇప్పటికీ అనేక మంది గుడ్లగూబను అశుభానికి సూచికగా భావిస్తున్నారు.

English summary

Reasons for sacred bird and goddess lakshmi vahana

Here are the reasons for sacred bird and goddess lakshmi vahana. Take a look.
Story first published: Wednesday, February 26, 2020, 16:26 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more