సోమవారం మీ రాశిఫలాలు (11-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీన రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయం లభిస్తుంది...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అనేక రకాలైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మరోవైపు ఆర్థిక పరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇలాంటి సమయంలో మీరు మీ ఖర్చులను వీలైనంత త్వరగా నియంత్రించడం మంచిది. పని విషయంలో ఈరోజు బాగానే ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రణాళిక ప్రకారం పని చేయాలి.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీని కారణంగా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ పనితీరు కూడా బాగుంటుంది. ఈరోజు ఎలాంటి సమస్యలైనా అధిగమించగలుగుతారు. మీ వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఈరోజు విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు పేదలకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఉత్సాహంగా ఉంచుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే మీకు ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా, విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం. ఉద్యోగులు ఈరోజు తెలివిగా పని చేయాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాహితులకు తమ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభించదు. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరిస్తే, కొన్ని ప్రయోజనాలు పొందుతారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈ రోజు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లలో వ్యాపారం చేసేవారికి, రోజు భారీగా ఉండవచ్చు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మరోవైపు కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీకు తోబుట్టువులతో మంచి సంబంధం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. ముఖ్యంగా బదిలీల విషయంలో మీకు సానుకూల వార్తలు వినిపిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను కూడా వింటారు. అయితే వ్యాపారులకు ఈరోజు కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే, అది మీ ఆలోచనా శక్తిని నాశనం చేస్తుంది. విద్యార్థులు ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టాలి, తద్వారా మీరు పరీక్షలో ఆశించిన ఫలితం పొందుతారు. ఈ రాశిచక్రంలోని మహిళలు తమ కోపాన్ని నియంత్రించాలి. ఈ రోజు మీ కోపం ఇంటి శాంతికి భంగం కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 7 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ రోజు సరైన ఫలితాలను పొందవచ్చు. మీరు విద్యా రంగంలో ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే, మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఈరోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు లాభాలను కూడా ఆశించవచ్చు. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. శారీరకంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా కష్టపడి పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యాపారులు కూడా ఈరోజు లాభాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈరోజు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా కొంత సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. మీరు అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు మీకు కొంత లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతం పెంపు వంటి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే వ్యాపారులకు ఈరోజు నిరాశ ఎదురవుతుంది. మీరు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈ రోజు మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 10:50 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు క్రమపద్ధతిలో పని చేస్తే, సాయంత్రంలోపు మీ పని అంతా సులభంగా పూర్తవుతుంది. ఈరోజు ఉద్యోగులకు ఉన్నతాధికారులు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పని చేయాలి. ముఖ్యంగా మీరంటే పడని సహోద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు వ్యాపారులకు వ్యాపారం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి రాత్రి 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీకు కుటుంబసభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం రావచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ పనులు పెండింగులో పడిపోతాయి. ఆర్థిక పరంగా సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 35

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగులు ఈ సమయంలో ఎలాంటి మార్పుల గురించి ఆలోచించకూడదు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. స్టాక్ మార్కెట్లో పని చేసే వారికి ఈరోజు కొంత ప్రయోజనం ఉండొచ్చు. అయితే కుటుంబ జీవితంలో ఈరోజు కొన్ని గొడవలు ఉంటాయి. మీరు సహనంతో వ్యవహరించాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:45 నుండి రాత్రి 10 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Monday, May 11, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion