For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (22-05-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Ketu Transit 2020:కేతు గ్రహ మార్పులతో కేవలం 2 రెండు రాశులకే లాభమా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. మీరు కొంత ఓపికగా ఉండాలి. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు ఈరోజు పెండింగు పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మీరు పనిని వాయిదా వేస్తే ఉన్నతాధికారుల కోపానికి గురి కావాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మందకోడిగా ఉంటుంది. మీరు ఓపికగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ఒత్తిడి తగ్గుతుంది. మీరు మానసికంగా కూడా మంచి అనుభూతి చెందుతారు. మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టగలుగుతారు. వ్యాపారులు కొన్ని శుభవార్తలను వింటారు. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 6:05 నుండి రాత్రి 9:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కఠినంగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, కష్టపడి పని చేయాలి. ఎందుకంటే పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రశాంతమైన మనసుతో పని చేయాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు మరియు ఆశీర్వాదం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. అయితే మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులుంటాయి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

ఈ 4 రాశుల వారు అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తారట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

 కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఇంట్లో పరిస్థితులు మాత్రం ప్రతికూలంగా ఉంటాయి. ఇంటి పెద్దలు మీపై చాలా కోపంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రసంగంపై చాలా నియంత్రణను కలిగి ఉండాలి. మీ వైపు ప్రశాంతంగా ఉండటం మంచిది. మీరు కష్టపడి పని చేస్తే ఈ రోజు మీరు మీ కృషి ఫలాలను పొందవచ్చు. ఈ రోజు మీ జీతం పెంపు గురించి మీకు శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 8:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా ప్రతికూల పరిస్థితులలోనూ మీరు సులభంగా పని చేస్తారు. ఈరోజు అధికారులు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీ సహోద్యోగులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మరోవైపు మీ జీవిత భాగస్వామిని ప్రేమతో చూసుకోండి. చిన్న విషయాలపై కోపం తెచ్చుకునే అలవాటు వల్ల గొడవ పెరగొచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు మీ ఉన్నతాధికారులను మెప్పించాలనుకుంటే, మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. నిరుద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులుంటాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు ఉంటే, చర్చల ద్వారా సాధ్యమైనంతవరకు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. తీవ్ర వాదనకు దిగడం వల్ల విషయాలు మరింత దిగజారిపోతాయి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

శని మకరంలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశుల వారికి లాభమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా ముఖ్యమైనది. మీకు ఈరోజు అదనపు పనులు అప్పగించవచ్చు. మీరు ఎక్కువ పని ఒత్తిడిని తీసుకోకపోయినా, మీ పనిని హాయిగా పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంది. మీ ఆదాయం పెరగవచ్చు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలని సూచించారు. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు అదనపు డబ్బు సంపాదించడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందవచ్చు. ఇవన్నీ మీ అవగాహన మరియు కృషి ఫలితమే. మీరు చిన్న పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు మంచి రోజు. ఈ రోజు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు సమయాన్ని జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేస్తే, అది ఉన్నతాధికారులపై మంచి ప్రభావం చూపుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 4:10 నుండి సాయంత్రం 3:50 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు పని విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మీరు ఓపికగా పని చేయాలి. మీ వృత్తిని కొనసాగించడానికి మీరు మరింత కష్టపడాలి.

ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ వివాహ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. అయితే ఇందుకోసం మీరు మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను అర్థం చేసుకోవాలి. మీ ప్రియమైన వారితో నిజాయితీగా ఉండండి. మీ సంబంధంలో శృంగారాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఇష్టమైన వంటకాలను మీరు ఆనందిస్తారు. మీ పని సామర్థ్యం కూడా బాగుంటుంది. ఈ రోజు మీరు కార్యాలయ పనిని సమయానికి ముందే పూర్తి చేస్తారు. దీని వల్ల మీకు అదనపు సమయం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు మెరుగైన అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, కుటుంబంతో సంబంధంలో సామరస్యం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే, మీరు ఈ రోజు మీ డబ్బును తిరిగి పొందవచ్చు.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో కష్టంగా ఉండొచ్చు. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మీకు కఠినమైన పోటీని ఇవ్వగలిగినప్పటికీ, మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి మీరు ఏ అవకాశాన్ని కూడా వదలరు. వ్యాపారులకు త్వరలో మీకు సరైన ఫలితాలు వస్తాయి. మీరు మీ తరపున ప్రయత్నిస్తూనే ఉంటారు. డబ్బు విషయంలో ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు, లేకపోతే మీరు ఈ రోజు మోసపోవచ్చ. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మీకు ఇష్టమైన పనులపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రోజును పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ రోజును ప్రత్యేకంగా చేస్తుంది. ఉద్యోగుల పని విషయంలో ఉన్నతాధికారులు చాలా సంతోషంగా ఉంటారు. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీకు సహోద్యోగులతో కూడా మంచి సంబంధం ఉంటుంది. వ్యాపారవేత్తలు వారి కొత్త ప్రణాళికలపై పనిచేయడం ప్రారంభించవచ్చు. ఈ రోజు మీరు మీ ప్రాంతంతో సంబంధం ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవవచ్చు. మీరు వారి నుండి క్రొత్తదాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:55 నుండి రాత్రి 7 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 22, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Friday, May 22, 2020, 6:00 [IST]