మంగళవారం మీ రాశిఫలాలు (26-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీకు ఆదాయ సంబంధిత ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది. మీ దగ్గరి స్నేహితుడు మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఈ రోజును కుటుంబంతో ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామిని గౌరవించండి. మీ ప్రియమైన వారి స్వభావంలో కొంత మార్పు ఉంటే, సంభాషణ ద్వారా వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నత విద్య కోసం, ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలను వినొచ్చు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామికి మంచి ఆశ్చర్యం కలిగించే రోజు మంచిది. ఇది మీ ప్రేమను పెంచుతుంది. మీ సంబంధం కూడా బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకూడదు. మీరు మీ పనులను పెండింగులో ఉంచకపోవడమే మంచిది. వ్యాపారులు ఈరోజు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరోగ్యంపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నతాధికారుల మానసిక స్థితి ఈరోజు మీకు సమస్యలను కలిగిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మెట్లు ఎక్కేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి, లేకపోతే మీరు గాయపడవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 12:30 నుండి సాయంత్రం 6:15 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఏదైనా సమస్య ఎదురైతే, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగిన సమయం వచ్చినప్పుడు మాత్రమే నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. పని విషయంలో ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఉత్తమ పనితీరును బట్టి, ఉన్నతాధికారులు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. గ్రహాల స్థానాలు మీ పురోగతి వైపు చూపుతున్నాయి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్య పరంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 5:15 నుండి రాత్రి 9:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా బాగుంటుంది. బహుశా ఈ రోజు మీకు గొప్ప పెట్టుబడి అవకాశం కూడా లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు ఏదైనా సమస్యలు ఎదురైతే, ఉన్నతాధికారుల సహాయంతో మీ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. మీకు సహోద్యోగులతో కూడా మంచి సంబంధం ఉంటుంది. అవసరమైతే మీరు వారి నుండి సహాయం కూడా పొందుతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తే, ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈ రోజు పాత అప్పుల గురించి చాలా ఆందోళన చెందుతారు. డబ్బుపై ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక పరిమితుల కారణంగా మీ పనులు పెండింగులో పడిపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల కోపానికి బలి కావాల్సి ఉంటుంది. మీరు మీ పనితీరును మెరుగుపరచాలి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపారులకు ఈరోజు కొన్ని లాభాలు రావచ్చు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు చాలా నిరాశకు గురవుతారు. మీ ప్రియమైన వారు మిమ్మల్ని విస్మరిస్తున్నారని మీకు అనిపిస్తుంది. అయితే, అనవసరంగా ఆలోచించడం ద్వారా మీ సంబంధాన్ని అణగదొక్కకండి. మీ మనస్సులో ఏదైనా గందరగోళం ఉంటే, మీరు మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం మంచిది. ఈ రోజు మీరు మీతో చాలా ముఖ్యమైన సంభాషణలు చేయవచ్చు. మీరు మీ పనిని నిజాయితీగా చేస్తూనే ఉంటారు. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 9:05 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని మంచి వార్తలను వింటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ పని చాలా తేలికగా పూర్తవుతుంది. స్నేహితుల సహకారం నుండి మీరు కొంత ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మీరు కుటుంబంతో కొంత సమయం గడపడానికి కూడా అవకాశం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు కొంచెం మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు కొంత అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా మంచి రోజు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. ఈ రోజు మీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడాలి. మీకు సరైన పెట్టుబడి అవకాశాలు లభించకపోయినా కొంత నిరాశ ఉండవచ్చు. మరోవైపు, మీరు మీ ఖర్చులను కూడా నియంత్రించాలి. ఈ రోజు విద్యార్థులకు ప్రతికూలంగా ఉంటుంది. మీరు చాలా అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కుటుంబసభ్యుల మధ్య పరస్పర విభేదాలు ఉండవచ్చు. మీరు అనవసరంగా తగాదాల్లో చిక్కుకుంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. మీరు శక్తివంతమైన మరియు మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు మీ తొందరపాటు నిర్ణయాలు మీకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఇంట్లో లేదా కార్యాలయంలో వివాదాస్పద సమస్యల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉండాలి. ఉద్యోగులు షాకింగ్ వార్తలను పొందవచ్చు. మీరు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అయితే, ఈ అవకాశం మీకు కొన్ని సవాళ్లను తెస్తుంది. మీరు వాటిని పూర్తి ధైర్యంతో ఎదుర్కొంటారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ రోజు, జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. దీని వల్ల మనస్సులో కొంత బాధ ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Tuesday, May 26, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion