Just In
Don't Miss
- Sports
రెండో టీ20లో సిమ్మన్స్ హాఫ్ సెంచరీ.. వెస్టిండీస్ ఘన విజయం
- News
చట్టాల మార్పులు సరిపోవు: మహిళలపై నేరాలపై వెంకయ్యనాయుడు
- Finance
ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
- Movies
ప్రతి పేరెంట్స్, స్టూడెంట్ చూడాల్సిన సినిమా.. జీవిత రాజశేఖర్ కామెంట్స్
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఆదివారం మీ రాశిఫలాలు (24-11-2019)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, కార్తీక మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు అనేక సందర్భాల్లో అనేక పరీక్షలు ఎదురుకావచ్చు. మొదట శృంగార జీవితంలో, మీరు మీ భాగస్వామితో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసరమైన చర్చలతో మీ సమయాన్ని వృథా చేయవద్దు. మీరు వారితో ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మరోవైపు, మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు లేకపోవడం వల్ల వైవాహిక జీవితంలో నిరాశ ఉంటుంది. వీలైతే, మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ ఇద్దరి మధ్య దూరాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కార్యాలయంలోని సీనియర్ మీ పనితో సంతృప్తి చెందుతారు. ఈరోజు పనిభారం తక్కువగా ఉంటుంది. మీ హృదయపూర్వక స్వభావం ఇంటి వాతావరణాన్ని మారుస్తుంది. మీరు మీ కుటుంబసభ్యులతో కొన్ని పాత తీపి జ్ఞాపకాలను తిరిగి పొందగలుగుతారు. ఆర్థిక రంగంలో ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి సాయంత్రం 6:45 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు కార్యాలయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఎవరూ ఆపలేరు. మీ కృషి ద్వారా రాబోయే కాలంలో మీరు కొంత గొప్ప పురోగతి సాధించబోతున్నారు. కుటుంబం ముందు నుండి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రోజులుగా కొన్ని గృహ సమస్యల కారణంగా మీరు చాలా చిరాకుపడతారు. దీని గురించి ఎక్కువ చింతించకండి. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి మెరుగుపడుతుంది. మీ శృంగార జీవితం ప్రేమతో నిండి ఉంటుంది. మరోవైపు, మీ జీవిత భాగస్వామితో సంబంధం క్షీణించే అవకాశం ఉంది. మీరు వాటిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మీ తోబుట్టువులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు తెలివిగా వ్యవహరిస్తే పరిస్థితులు అనుకూలంగా మారవచ్చు. ఆర్థిక రంగంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చులు నిర్వహించాలి. దీని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. పనిలో ఈరోజు బాగుంటుంది. మీరు ఈరోజు ఎంతో నిజాయితీతో కష్టపడి పనులను పూర్తి చేయగలరు. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 10:30 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఆనందంగా గడుపుతారు. మీ ప్రియమైన వారిని తమకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళతారు. ఇది వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇంటి వాతావరణం చక్కగా ఉంటుంది. తల్లిదండ్రుల వైపు నుండి ఆప్యాయత మరియు మద్దతు ఉంటుంది. ఈ రోజు, మీ తండ్రి నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అతను మీకు సహాయపడవచ్చు. ఈరోజు ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది. పనిభారం తక్కువగా ఉంటుంది. మీకు తగినంత సమయం లభిస్తుంది. సమయాన్ని బాగా ఉపయోగించుకోండి. ఆరోగ్యం పరంగా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు ఇతరుల సంతోషం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తే మీరు ఆర్థిక సంక్షోభంలో పడతారు. అధిక ఉత్సాహానికి వెళ్లి ఎక్కువగా ఖర్చు చేయకపోవడమే మంచిది. ఈరోజు వివాహిత జంటలకు సరైన రోజు అవుతుంది. ఈరోజు మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. మరోవైపు, మీరు మీ ప్రేమ భాగస్వామితో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు మీ భాగస్వామిని విశ్వసించాలి. వేరొకరి మాటలు విన్నప్పుడు అనుమానం రాకుండా ఉండాలి. మీ మనసులో ఏమైనా సందేహం ఉంటే, వారితో ఓపెన్ గా మాట్లాడండి. ఆఫీసులో, మీరు మీ కోపాన్ని అనవసరంగా ఇతరులపై చూపి, మీ ఇమేజ్‌ను పాడు చేసుకోవద్దు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి.
లక్కీ కలర్: స్కై బ్లూ
లక్కీ నంబర్ 29
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:55 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటే వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారవచ్చు. మీరు ఆసుపత్రిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఈరోజు మీ ఇంట్లో మీరు గొడవ పడొచ్చు. ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యనులను నిర్లక్ష్యం చేసినట్లు అనిపించవచ్చు. మీరు ఈరోజు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు.
లక్కీ కలర్: పింక్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి 10:00 వరకు

తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. చాలా కాలం తర్వాత మీరు మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాలను చర్చిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారు. ఈరోజు మీ యజమాని మీ పట్ల సంతోషంగా ఉంటారు. ఇది మీరు ముందుకు సాగడానికి గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మీరు సహోద్యోగులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి పిక్నిక్ కోసం వెళ్లడం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. మీరు ఎక్కువ ఖర్చు చేసినా కూడా సమస్య ఉండదు. ఆరోగ్య విషయాలు ఈరోజు పరిపూర్ణంగా ఉంటాయి.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 28
లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:05 నుండి ఉదయం 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు మానసికంగా బలంగా ఉంటారు. అన్ని నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోగలరు.పనిలో కొన్ని సానుకూల మార్పులు ఉండవచ్చు. ఈరోజు మీరు చాలా కష్టమైన పనిని చాలా తేలికగా పరిష్కరించగలుగుతారు, ఇది మీ ఉన్నతాధికారులను చాలా సంతోషపరుస్తుంది. అదే సమయంలో, వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ రోజు మంచి విజయాన్ని పొందవచ్చు. మీ క్రొత్త వ్యాపారం కోసం మీరు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. శృంగారం విషయానొకస్తే ఈ రోజు ప్రేమ మరియు శృంగారం మీ మనస్సులో ఉంటుంది. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. మీకు జలుబు లేదా ఎలాంటి అలెర్జీ వచ్చే అవకాశం ఉన్నందున ఈ రోజు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈరోజు స్నేహితులతో కలిసి చిన్నపార్టీని చేసుకోవచ్చు. ఉద్యోగం చేసే వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీతం పెంపు లేదా మీకు ప్రమోషన్ లేదా శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. వివాహిత జంటలు ఈరోజు ఒక కొత్త దాన్ని ఆశిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఆకస్మిక లాభాలను పొందవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. మీ మెరుగైన ఆరోగ్యం కారణంగా ఈ రోజు మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారు ఈరోజు వైవాహిక జీవిత సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించాలి. ఇందుకోసం మీరు చాలా ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండాలి. మీరు ఈ రోజు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో వివాదాలు సహజమే. అలాంటి సమస్యలు మిమ్మల్ని మీ లక్ష్యం నుండి దూరం చేస్తున్నాయని గుర్తుంచుకోండి. విజయవంతం కావడానికి, మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాగే, మీ శత్రువులు ఈ రోజు చురుకుగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ : 32
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే త్వరలో మీరు ఒకరి నుండి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికను అందుకు అనుగుణంగా తయారు చేసుకోవడం చాలా మంచింది. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. బహుశా మీ కుటుంబ సభ్యులు ఈ రోజు మీ వైఖరి పట్ల విముఖత చూపవచ్చు. అందుకే బాధ్యతారహితమైన పనులు చేయకుండా ఉండండి. మరోవైపు మీరు పిల్లలతో సమయం గడపడానికి అవకాశం పొందవచ్చు. ఇది మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కూడా బాగుంటుంది. మీ రొమాంటిక్ జీవితం కోసం మీరు కొన్ని ప్రణాళికలు వేయొచ్చు. మీకు ఈరోజు కొంచెం నిరాశ మరియు విచారంగా అనిపించవచ్చు.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోకండి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందడం కూడా మీకు చాలా ఆనందంగా ఉంటుంది. మిగిలిన కుటుంబ సభ్యులలో ప్రేమ మరియు ఐక్యత కనిపిస్తుంది. మీరు ఈ రోజు తల్లిదండ్రులతో ఒక మత స్థలాన్ని కూడా సందర్శించవచ్చు. కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ అన్ని పనులను సకాలంలో పరిష్కరించడంలో మీరు విజయవంతమవుతారు. ఆర్థిక పరంగా ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ మంచి ప్రణాళికల వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద ఎత్తున దూసుకుపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పరంగా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 12
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 7 గంటల వరకు