For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (18-10-2019)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఆశ్వీయుజమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

1) మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు పని నిమిత్తం ప్రయాణిస్తుంటే అందుకు అవసరమైన పత్రాలను మీ వద్ద ఉంచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మీరు పత్రాలను మీతో తీసుకెళ్లడం మర్చిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే విధంగా ఎక్కువ చింతించకండి. కార్యాలయంలో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ కోసం కొంత అదనపు సమయాన్ని పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ​​ఉంటుంది. తోబుట్టువులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అవి మీ ఒత్తిడిని పెంచుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు చురుకుగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయండి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:25 గంటల వరకు

2) వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

2) వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో కొందరికి వారి యజమాని నిఘా ఉంచుతారు. కాబట్టి మీరు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ రోజు మీకు డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశం కూడా వస్తుంది. అలాగే, మీ తండ్రి మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజు మీ భాగస్వామి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి. ఎందుకంటే మీ మధ్య అపార్థాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

3) మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ భాగస్వామితో మీకు చిన్న గొడవ ఉండవచ్చు. కానీ అది త్వరలోనే పరిష్కరించబడుతుంది. కార్యాలయంలోని గాసిప్‌లకు దూరంగా ఉండండి. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఆర్థిక రంగంలో మంచి రోజు అవుతుంది. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ప్రయాణానికి మంచిది కాదు. సుదీర్ఘ ప్రయాణంనిమిత్తం ఎక్కడికైనా వెళ్లడం మానుకోండి, ఎందుకంటే ఇది మీకు అలసట మరియు బలహీనంగా అనిపిస్తుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

4) కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు నిరాశగా అనిపించవచ్చు. కానీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. కొంతమంది మీ ఔదార్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఏదైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఎందుకంటే ఈ రోజు ఎక్కువగా నష్టపోయే అవకాశాలే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం తాగడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోండి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

5) సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

5) సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఊహించిన విధంగా డబ్బు సమయానికి అందుతుంది. కానీ ఈరోజు మీరు ఎక్కువ ఖర్చు చేసే మానసిక స్థితిలో ఉంటారు. అయితే మీరు ఎక్కువ ఆదా చేయడానికి ప్రయత్నించాలి. కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కొన్ని సమస్యలపై తక్షణ శ్రద్ధ అవసరం, లేకుంటే అది మీ పనిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఈ రోజు కొన్ని అసంపూర్ణ పనులను పూర్తి చేస్తారు. మీకు కొత్త బాధ్యత ఇవ్వవచ్చు. ఇది మీకు కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తుంది. కాని ప్రశాంతమైన మనస్సుతో మరియు మంచి ప్రణాళికతో ప్రతిదీ సాధ్యమవుతుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

6) కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

6) కన్యా రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు మీ ఆర్థిక పరిస్థితి సైతం మెరుగుపడుతుంది. మీరు కొన్ని అప్పులను కూడా తీర్చగలుగుతారు. ఈ రోజు, మీ తండ్రి మీతో కొంచెం అసంతృప్తిగా ఉంటారు; అతను మీ నిర్ణయాలతో ఏకీభవించకపోవచ్చు. మీరు వైవాహిక జీవితంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడేందుకు ప్రయత్నించండి. అతనికి / ఆమెకు అబద్ధం చెప్పకండి. వ్యాపార సంబంధిత ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సాయంత్రం ఒక మత స్థలాన్ని సందర్శించవచ్చు.

లక్కీ కలర్ : పీచ్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

7) తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

7) తులా రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని వద్ద వాతావరణం బాగుంటుంది. మీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి . దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు సవాలు పరిస్థితిని ఎదుర్కొంటుంటే, మీ వైఖరిని నిజాయితీగా మరియు స్పష్టంగా ఉంచండి. వివాహిత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ భావాలను మీ జీవిత భాగస్వామి ముందు బహిరంగంగా వ్యక్తీకరించవచ్చు. ఈ రోజు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. మీరు ఈ రోజు అదనంగా కొంత డబ్బును సంపాదించగలరు. మీ పాత మరియు ముఖ్యమైన పరిచయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ రోజు మీరు రిలాక్స్ అవుతారు. ప్రయాణానికి ఈరోజు మంచి రోజు కాదు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి రాత్రి ఉదయం గంటల వరకు

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

8) వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో కొందరికి వారి కృషికి తగ్గట్టు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ రోజు విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారందరూ ఈరోజు అన్నిటిలోనూ విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితుల విషయానికొస్తే చాలా డబ్బు సంపాదించవచ్చు, ఎందుకంటే మీకు మంచి అవకాశం లభిస్తుంది. వివాహ సంబంధానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. బిజీ దినచర్య ఉన్నప్పటికీ, మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని మంచి క్షణాలు గడపగలుగుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఎరుపు

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

9) ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

9) ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయానికి ఇప్పుడు మానసిక శాంతిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒంటరిగా ఉండిపోతారు. మళ్లీ మంచి నిర్ణయం తీసుకోలేరు. మీకు దగ్గరగా ఉన్న వారితో మాట్లాడటం మంచిది. ఈరోజు సానుకూల దృక్పథంతో, మీ వివాహ జీవితంలో జరుగుతున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. శృంగార జీవితంలో ప్రతిదీ సాధారణం అవుతుంది, మీ భాగస్వామితో పరస్పర అవగాహన ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారి వ్యాపారవేత్తలకు శుభం కలుగుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కానీ మీకు సీనియర్ల పూర్తి మద్దతు లభిస్తుంది.

లక్కీ కలర్ : ఎరుపు

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

10) మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా పెద్దల సలహా వినండి. మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారం పొందుతారు. మీ పని అంతా ఎటువంటి అంతరాయం లేకుండా సకాలంలో పూర్తవుతుంది, అయితే వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో వాదనలు మానుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు ఎవ్వరికి డబ్బు ఇవ్వకండి. తల్లిదండ్రుల ప్రేమ మరియు మద్దతుతో మీరు విశ్వాసం పొందుతారు. మీకు హాని కలిగించే అవకాశం ఉన్నందున ఈ రోజు ప్రమాదకర ఉద్యోగాలు చేయడం మానుకోండి.

లక్కీ కలర్: వైట్

అదృష్ట సంఖ్య: 34

అదృష్ట సమయం: ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 2:25 వరకు

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

11) కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రోజు వివాహిత జంటలకు గొప్ప రోజు అవుతుంది. మీ ప్రేమ, స్నేహం మరియు బంధం పెరిగి మరింత బలపడతాయి. మీరు మీ రంగంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు మీ శక్తితో నిండి ఉంటారు. ఇంట్లో పూజ కార్యక్రమాలను నిర్వహించవచ్చు. మీరు మీ కుటుంబంతో కొంత గొప్ప సమయాన్ని గడపగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల కోసం చేసిన చేసే ప్రయాణాలతో మీకు అంతా మంచే జరుగుతుంది. ఈరోజు ఎలాంటి చర్చలకైనా దూరంగా ఉండండి. ఎందుకంటే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. దీని వల్ల మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

12) మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆ చిరస్మరణీయ రోజులలో ఒకటిగా మారవచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి. ప్రతిదీ ప్రేమతో గెలవవచ్చని మీరు భావిస్తారు. మీరు ఈ రోజు వివాదంలో చిక్కుకుంటే, సహనంతో మరియు తెలివితేటలతో పనిచేయాలి. ఈరోజు ఆర్థిక రంగంలో మంచి రోజు అవుతుంది. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : గ్రే

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట సమయం : ఉదయం 8 నుండి రాత్రి 10:15 గంటల వరకు

English summary

Daily Horoscope October 18, 2019

Which signs are better if they postpone things? Do job efforts result? Can students excel in education? Is it convenient to express love? Travels & Travels Overseas Is it better to postpone? Investing in Business or Not? Read the full details of today's Bold Sky offerings in order to get a detailed look at the legal, court proceedings, property disputes, fortune teller, fortune teller, fate.
Desktop Bottom Promotion