Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Guru Purnima 2021:గురు పూర్ణిమ రోజున ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలో చూసెయ్యండి...!
గురు పూర్ణమి 2021 సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఈ మంత్రాలను పఠించాలి.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున, అంటే వ్యాస మహర్షిన పుట్టిన రోజున గురు పూర్ణిమ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది 2021లో జులై 24వ తేదీన గురుపూర్ణిమ వచ్చింది.

ఈ పవిత్రమైన రోజున గురువు ఆరాధనకు చాలా ప్రత్యేకమైనది. ఈరోజున చాలా మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తారు. గురువు భగవంతుని కంటే ఉన్నతమైన వారు అనేక గ్రంథాల్లో చెప్పబడింది. గురువు లేకుండా మనం ఎలాంటి జ్ణానాన్ని పొందలేము. గురువు సహాయం వల్లే మనం విజయం సాధించడానికి మార్గం సులభమవుతుంది.

తమ జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమని.. గురువునే తాము దైవంగా భావిస్తుంటారు. గురువు ఇచ్చిన జ్ణానం వల్లే మానవ జీవితంలో విజయానికి నిచ్చెన అవుతుందని పెద్దలు చెబుతారు. ప్రతి ఒక్క గురువు తమ శిష్యులకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపుతాడు. అంతేకాదు విద్యార్థులు విజయం సాధిస్తే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంతోషిస్తాడు. అందుకే విద్యను ప్రసాదించే గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండటం అనేది శిష్యుల కర్తవ్యం. శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే వ్యాసుడి పేరు క్రిష్ణద్వైపాయనుడు. పూర్ణిమ రోజున వ్యాస భగవానుడిని, గురువు పూజించడం అనేది విధిగా చేయాలని పెద్దలు చెబుతుంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే గురుపూర్ణమి రోజున ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలి.. ఏమి దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
‘ఓం అవ్యాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఎర్రని దుస్తులు దానం చేయాలి.

వృషభ రాశి..
‘ఓం జీవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
తెల్లని దుస్తులు దానం చేయాలి.

మిధున రాశి..
‘ఓం దివరాయ్ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఆకుపచ్చ రంగులను దుస్తులను దానం చేయాలి.

కర్కాటక రాశి..
‘ఓం వశిష్టాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
క్రీమ్ కలర్లో ఉండే దుస్తులను దానం ఇవ్వాలి.

సింహ రాశి..
‘ఓం స్వర్ణకయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. గులాబీ రంగులో ఉండే దుస్తులను దానం చేయాలి.

కన్య రాశి..
‘ఓం హరియే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఆకుపచ్చ మరియు లైట్ ఎల్లో దుస్తులను దానం చేయండి.

తుల రాశి..
‘ఓం వివేకతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఖాదీ దుస్తులను దానం చేయాలి.

వృశ్చిక రాశి..
‘ఓం జీవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
దోతిని దానం చేయండి

ధనస్సు రాశి..
‘ఓం జైత్రే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
మీ సామర్థ్యం మేరకు బంగారాన్ని విరాళంగా లేదా దానం ఇస్తే మంచి ఫలితాలొస్తాయి.

మకర రాశి..
‘ఓం గుణినే నమః' అనే మంత్రాన్ని జపించాలి.
పంచధాతు మరియు బట్టలను దానంగా ఇవ్వండి.

కుంభ రాశి..
‘ఓం దివరాయ్ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
ఉన్ని బట్టలను దానంగా ఇవ్వండి.

మీన రాశి..
‘ఓం దయసరయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
నీలి రంగు బట్టలను దానంగా ఇవ్వండి.



Click it and Unblock the Notifications