For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల భారాన్ని తగ్గించుకుందామని కటింగ్ చేయించుకున్నారు... కరోనాను కూడా కొనితెచ్చుకున్నారు...

లాక్ డౌన్ కారణంగా జుట్టు బాగా పెరిగిపోయిందని.. అయితే తాజాగా లాక్ డౌన్ సడలింపులువచ్చాయని సంతోషంతో తల మీద భారం తగ్గించుకుందామనుకుని సెలూన్ షాపుకు వెళ్లారు

|

కరోనా వైరస్ ఎప్పుడు ఎటు వైపు నుండి వచ్చి దాడి చేస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇందుగలడందు లేడని సందేహం వలదు అన్న చందంగా కరోనా సర్వంతర్యామిగా మారిపోయింది.

Hairstylist with coronavirus potentially exposed 91 people to disease, say health officials

రోజురోజుకు ఇది విలయ తాండవం చేస్తోంది. విశ్వవ్యాప్తంగా ఇప్పటికే అరకోటి మంది వరకు దీని బారిన పడ్డారు. లక్షలాది మంది మరణించారు. మన దేశంలో కూడా ఈ కరోనా వైరస్ కేసులు ఇటీవలే లక్ష మార్కును దాటగా..

Hairstylist with coronavirus potentially exposed 91 people to disease, say health officials

తాజాగా 200 దేశాల్లో టాప్ టెన్ లో కూడా భారత్ స్థానం సంపాదించుకుంది. ఇన్నిరోజులు మన దేశంలో ప్రతి 24 గంటలకు ఒకసారి కొన్ని కేసులు బయటపడేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Hairstylist with coronavirus potentially exposed 91 people to disease, say health officials

ప్రస్తుతం ప్రతి ఒక్క గంటకూ వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. ఇది వరకే మీరు అష్టాచమ్మా ఆడి 17 మందికి కరోనా పాజిటివ్... పేకాట ఆడి సుమారు 31 మందికి కరోనా అంటించిన వార్తల గురించి వినే ఉంటారు.

Hairstylist with coronavirus potentially exposed 91 people to disease, say health officials

ఇదిలా ఉంటే లాక్ డౌన్ తర్వాత కొన్ని సడలింపులు వచ్చాయని సంతోషంగా సెలూన్ షాపులకు వెళ్లిన వారికి కరోనా గట్టి షాకిచ్చింది. అది కూడా ఒకరిద్దరికి కాదు ఏకంగా 91 మందికి కటింగ్ చేయించుకున్నందుకు కరోనాను అంటించింది. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం...

సెలబ్రిటీలు సొంతంగా కటింగ్..

సెలబ్రిటీలు సొంతంగా కటింగ్..

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రముఖులు తమ ఇళ్లలోనే కటింగ్, షేవింగ్ చేసుకున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ కటింగ్ చేస్తూ ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అది కాస్త బాగా వైరల్ అయ్యింది.

కేటీఆర్ కూడా కటింగ్ రిక్వస్ట్..

కేటీఆర్ కూడా కటింగ్ రిక్వస్ట్..

ఇదివరకు లాక్ డౌన్ సమయంలో తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కు కూడా కటింగ్ గురించి ట్విట్టర్లో అనేక రిక్వస్ట్లు వచ్చాయి. దానికి కేటీఆర్ కూడా విరాట్-అనుష్కల ప్రయత్నించమని సలహా ఇవ్వడం.. అందుకు బదులుగా తన సోదరి కవిత కూడా ‘బాబీకి ఛాన్స్ ఇస్తవా‘ అని ట్వీట్ చేయడం వంటివి కూడా బాగా వైరల్ అయ్యాయి.

కటింగ్ ద్వారా కరోనా..

కటింగ్ ద్వారా కరోనా..

ఇక అసలు విషయానికొస్తే, కరోనా భూతం అగ్రరాజ్యం అమెరికాను ఎంతలా అతలాకుతలం చేస్తుందో తెలిసిందే. ప్రతి గంట గంటకూ అక్కడ మరణాల సంఖ్య రెట్టింపవుతోంది. అయితే తాజాగా ఆ దేశంలోని మిస్సౌరీలో ఒక వ్యక్తి నుండి 91 మందికి కరోనా వైరస్ వ్యాపించింది. అయితే ఆ వ్యక్తి సెలూన్ కార్మికుడు.

84 మందికి కరోనా..

84 మందికి కరోనా..

ఆ 91 మంది వ్యక్తులలో 84 మంది కటింగ్ చేయించుకోవడానికి వచ్చిన కస్టమర్లు కాగా, ఏడుగురు సెలూన్ కార్మికులు కావడం గమనార్హం. మిస్సౌరీలో ఇప్పటివరకు 11,572 కరోనా కేసులు నమోదు కాగా 676 మంది మరణించినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

కరోనా వ్యాప్తికి కారణం..

కరోనా వ్యాప్తికి కారణం..

కరోనా సోకడానికి కచ్చితమైన ఉదాహరణ ఈ కటింగ్ షాపు అని చెప్పొచ్చు. మన దేశంలో కూడా మధ్యప్రదేశ్ లోని ఖర్ గావ్ జిల్లాలోని బార్ గావ్ గ్రామంలో ఓ వ్యక్తి బార్బర్ షాపుకు వెళ్లి కటింగ్, షేవింగ్ చేయించుకున్నాడు. అతనికి వాడిన టవల్ తోనే మరో 12 మందికి కటింగ్, షేవింగ్ చేశాడు. అయితే మొదట కటింగ్ చేయించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఒకే టవల్ వాడటం వల్ల..

ఒకే టవల్ వాడటం వల్ల..

దీంతో అతని గురించి ఆరా తీస్తే కటింగ్ షాపుకు వెళ్లిన విషయం చెప్పాడు. కటింగ్ షాపులో కటింగ్ చేయించుకున్న 12 మందికి టెస్టులు చేస్తే వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ 12 మందికి ఒకే టవల్ ను ఉపయోగించి కటింగ్ చేసిట్టు షాపు నిర్వాహకుడు తెలిపాదు. విచిత్రం ఏమిటంటే కటింగ్ చేసిన వ్యక్తికి మాత్రం కరోనా నెగిటివ్ అని తేలింది.

కేంద్రమార్గదర్శకాలు..

కేంద్రమార్గదర్శకాలు..

దీన్ని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెలూన్ వర్కర్ల నుండి కరోనా సోకే అవకాశం ఉండటంతో మన దేశంలో కూడా కటింగుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. వాటిని పాటిస్తూ కటింగ్ చేయించుకోవాలని సూచించింది.

English summary

Hairstylist with coronavirus potentially exposed 91 people to disease, say health officials

Here we talking about hairstylist with coronavirus potentially exposed 91 people to disease, say health officials. Read on
Desktop Bottom Promotion