For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శునకాన్నే అడవి పులిగా మార్చిన అన్నదాత... ఎందుకంటే...

అది పులి రూపంలో ఉన్న కుక్క అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు.

|

అది భారతదేశంలోని కర్నాటక రాష్ట్రం. అందులో షిమోగా అనే జిల్లా. ఆ జిల్లాలోని ఓ రైతు ఇంట్లో పులిని పెంచుకుంటున్నాడు. ఇది విన్న స్థానికులు అంతా షాకయ్యారు. పులిని ఆమడ దూరం నుండి చూస్తేనే అందరూ హడలెత్తిపోతారు. అంతవరకు ఎందుకు అడవిలోనూ లేదా జూ లోనూ కనీసం రెండు కిలోమీటర్ల దూరం నుండి పులి చేసే గాండ్రింపు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి.

Paints His Dog To Resemble A Tiger

అలాంటిది ఆ రైతు పులిని ఎలా పెంచుతున్నాడు అని అందరికీ అనుమానం వచ్చింది. అయితే అది పులి రూపంలో ఉన్న కుక్క అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ కుక్క పులి ఎలా మారింది.. దాని వల్ల ఎవరికి ఉపయోగం అనే విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని చూడాల్సిందే...

పంటను పసిబిడ్డలా..

ఒక రైతు తన పంటను పండించేందుకు పడే కష్టమేంటో చాలా మందికి తెలీదు. భూమి చదును చేసుకుని విత్తనం నాటిన దగ్గర నుండి పంట పెరుగుదల మరియు దిగుబడి వచ్చే వరకు తన పంటను పసిబిడ్డలాగా జాగ్రత్తగా పెంచుతాడు.

కష్టపడి పండించిన పంటను..

కష్టపడి పండించిన పంటను..

అయితే అలాంటి సమయంలో వరదలు, వర్షాలు, కరువు వంటివి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. కానీ వీటిని అన్నింటిని అధిగమించి ప్రతి ఏటా ఎంతో కొంత దిగుబడి అయితే సాధిస్తాడు. అయితే ఇలా కష్టపడి పండించిన పంటను కోతులు, పందులు, జింకలతో పాటు ఇతర జంతువులు కూడా నాశనం చేస్తుంటాయి. లేదా ఆ పంటలో పండిన కూరగాయలు, పండ్లు ఇతరత్రా వాటిని తిని వేస్తుంటాయి.

షిమోగా జిల్లా తీర్థహల్లిలో..

షిమోగా జిల్లా తీర్థహల్లిలో..

దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా రైతులు పంటల్లో అప్రమత్తంగా ఉంటారు. వీరు ఎంత అప్రమత్తంగా ఉన్నా అడవి జంతువులు పంటలను నాశనం చేసేందుకు కాచుకుని కూర్చుంటాయి. కొన్నిసార్లు రైతు ఒంటరిగా అవి గుంపుగా వచ్చి వారిపైనే దాడి చేస్తాయి. ఇక షిమోగా జిల్లా తీర్థహల్లిలో శ్రీకాంత గౌడకు చెందిన పొలంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది.

కుక్క చర్మానికి హెయిర్ డై..

కుక్క చర్మానికి హెయిర్ డై..

వీటిని అరికట్టేందుకు ఎన్నోరోజులుగా దిగులు చెందుతున్ననల్లూరు రైతు శ్రీకాంత గౌడ అనే రైతుకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ముందుగా పులి బొమ్మను తన పొలంలో పెట్టాడు. అయినా కోతులు అస్సలు భయపడలేదు. అయితే నిజమైన పులికి అవి భయపడతాయి కాబట్టి తను పెంచుకున్న కుక్కకు పులి చర్మానికి ఎలాంటి చారలు ఉంటాయో ఆ కలర్ వేసేశాడు. కుక్క చర్మానికి హెయిర్ డై వేసినట్టు స్థానికులకు చెప్పాడు. ఆ కుక్కనే పులిగా మార్చేశాడు.

పులి కుక్కను సోషల్ మీడియాలో..

పులి కుక్కను సోషల్ మీడియాలో..

దాంతో ఆ పులికుక్కను చూసిన ఇతర జంతువులు భయపడిపోయాయి. దీని వల్ల ఇతర జంతువులకు కూడా ఎలాంటి హాని కలగదని చెప్పాడు. ఇలా శ్రీకాంత గౌడ ఐడియా అద్భుతంగా పని చేయడంతో అందరూ అతన్ని అభినందించారు. మిగిలిన వారు కూడా దీన్నే ఫాలో అవ్వడం మొదలెట్టారు. దీన్ని గమనించిన కొందరు ఈ పులి కుక్కను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో శ్రీకాంత గౌడకు అనేక మంది నుండి ప్రశంసలు, అభినందలు వెల్లువెత్తాయి.

English summary

In An Attempt To Save Crops, Karnataka Farmer Paints His Dog To Resemble A Tiger

A farmer from Karnataka tries to save his crops from monkeys by painting his dog like a tiger. Read this interesting story
Desktop Bottom Promotion