Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...
ఇండియన్ అమెరికన్ శిరీష బండ్ల విజయవంతంగా రోదసి ప్రయాణం చేసేసింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి.
తను చిన్నప్పటి నుండే చంద్రుడిని, చుక్కలను చూస్తూ.. ఎప్పటికైనా వాటిని అందుకోవాలని కలలు గనేది. అందుకోసం తాను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంది. అయితే తన లక్ష్యానికి కంటి చూపు సమస్యగా మారింది.

కానీ ఏ మాత్రం అధైర్యపడలేదు. మరో దారిలో ప్రయత్నించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా అంతరిక్షంలో అడుగుపెట్టాలనే తన కోరిక నెరవేర్చుకుంది. ఆకాశం అంచులను విజయవంతంగా తాకేసింది.

మన తెలుగింటి ఆడపడుచు బండ్ల శిరీష. ఇండియన్ అమెరికన్ అది కూడా మన ఆంధప్రదేశ్ మూలాలున్న ఆమె అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్ ఫ్లైట్ సంస్థ 'వర్జిన్ గెలాక్టిక్' అంతరిక్ష నౌకలో రోదసీ యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా తన అంతరిక్ష ప్రయాణ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తొలి తెలుగమ్మాయి..
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష రోదసీలోకి విజయవంతంగా ప్రయాణం చేసిన తొలి తెలుగమ్మాయిగా ఖ్యాతిగా గడించింది. ఇప్పటివరకు భారతదేశం నుండి ఆరుగురు మహిళలు సక్సెస్ ఫుల్ గా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. అందులో తెలుగమ్మాయి శిరీష ఒక్కరే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్సన్ తర్వాత శిరీష పేరు చరిత్రలో నిలిచిపోనుంది.

అంతరిక్ష పర్యటన..
అంతరిక్షంలో ప్రయాణాన్ని ప్రోత్సాహించాలని ఉద్దేశంతో అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ తమ అంతరిక్ష నౌకను ఆదివారం రాత్రి ఆకాశంలోకి పంపింది. ఇప్పటికే మూడు స్పేస్ ఫ్లైట్లను విజయవంతంగా నింగిలోకి పంపిన ఈ సంస్థ నాలుగో ప్రయోగంలో భాగంగా తొలిసారి మానవుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ‘యూనిట్ 22' అంతరిక్ష నౌక ప్రయాణం నిర్ణీత సమయానికి 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

సక్సెస్ ఫుల్ జర్నీ..
న్యూ మెక్సికో నుండి బయలుదేరిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మొత్తం ఆరుగురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లారు. వీరిలో ఇద్దరు పైలట్లు. ఆ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు అదే సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు. అందులో శిరీష్ కూడా ఒకరు. ఈమె వర్జిన్ గెలాక్టిక్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఈ అంతరిక్ష యానం పూర్తి చేశారు.

గుంటూరులో సంబరాలు..
బండ్ల శిరీష రోదసీ ప్రయాణం సక్సెస్ ఫుల్ గా చేసుకుని రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖులందరూ ఆమెకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ కూడా ట్విట్టర్లో తనకు అభినందనలు తెలిపారు. శిరీష తన కెరీర్లో అందుకున్న విజయాల్లో తానా యూత్ స్టార్ అవార్డు కూడా ఉంది.

ఆకాశాన్ని అందుకునేందుకు..
అందుకే తను ఎయిర్ ఫోర్స్ కోర్సులు చదివింది. ఈ కోర్సులు చదివితే పైలట్ అయిన తర్వాత నాసాలో ఛాన్స్ కొట్టొచ్చని ప్లాన్ వేసుకుంది. కానీ తనకు హైస్కూల్ చదివే సమయంలో కంటి సమస్య వచ్చి.. తన కలలకు అడ్డుకట్ట వేసింది. ఎందుకంటే పైలట్ లేదా అస్ట్రోనాట్ అవ్వడానికి కావాల్సిన కనీస అర్హత మంచి కంటిచూపు. దీంతో తాను చాలా నిరుత్సాహ పడింది.

‘జిరో గ్రావిటీ’లో..
ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే ‘జిరో గ్రావిటీ'లో ప్రయాణించే ఛాన్స్ కొట్టేసింది. ఇక పర్ డ్యూ యూనివర్సిటీ నుండి డిగ్రీ అర్హత సాధించగానే ఉద్యోగంలో చేరిపోయింది. అప్పుడే తనకు టెక్నికల్ తప్ప వ్యాపార పరంగా ఎలాంటి అవగాహన లేదని తెలుసుకుంది. దీంతో జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి స్పేస్ ఇండస్ట్రీలో ఎంబిఏ చేసింది. తన ఆసక్తి తెలిసిన ప్రొఫెసర్ కమర్షియల్ స్పేస్ ఫెడరేషన్(CSF)అనే సంస్థ నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అక్కడ ఇంటర్వ్యూకు హాజరై సెలెక్ట్ అయ్యింది. అలా 2012 సంవత్సరంలో తన కలల రంగంలోని కాలు పెట్టేసింది. 2015 సంవత్సరంలో వర్జిన్ గాలక్టిక్ కి మారిపోయింది. ఇది కూడా ఒక స్పేస్ టూరిజం సంస్థే. ఇక్కడ బిజినెస్ డెవలప్ మెంట్ అడర్ గవర్నమెంట్ అఫైర్స్ మేనేజర్ గా చేరి, ఏకంగా వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ లాంచర్ వన్, స్పేస్ షిప్-2 ప్రోగ్రామ్స్ విజయం సాధించడంలోనూ శిరీష కీ రోల్ ప్లే చేసింది.



Click it and Unblock the Notifications