Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అన్నదాతలకు ఆయన టార్చ్ బేరర్... అందుకే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ను అంతలా ఆరాధిస్తారు...!
సర్వోన్నత అధికారుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
అది కరోనా మహమ్మారి విలయతాండం వేస్తున్న కష్టకాలం... ప్రపంచాన్ని తన చర్యలతో కకావికాలం చేస్తున్న సందర్భం.. అదే సమయంలో మన దేశంలో దాని ప్రభావం బాగా పడింది. అకస్మాత్తుగా నెలరోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. అప్పటికే కేసులు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి తన పంజా విసిరింది. అంతేకాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భావించే వైజాగ్ సిటీలో పరిస్థితి చాలా భయానకంగా ఉండేది.

అలాంటి సమయంలో అప్రమత్తంగా బాధ్యత వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. అందులోనూ సర్వోన్నతాధికారుల చేతుల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఓ లేడీ ఆఫీసర్ ఎంతో నిబద్ధతతో వ్యవహరించింది. చేతిలో చంటిబిడ్డను ఎత్తుకునే విధులకు హాజరైంది. తనకు ప్రసవ సెలవులు మంజూరు అయినప్పటికీ, తాను వాటిని పక్కనబెట్టి మరీ.. విధుల్లో చేరింది.

కరోనాపై పోరులో తాను కూడా ముందుండి పోరాడతానని కమిషనర్ గా పనిచేస్తున్న స్రుజన, క్లిష్టపరిస్థితుల్లో అందరం కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే తాను డ్యూటీ నిమిత్తం కార్యాలయానికి చంటి బిడ్డతోనే హాజరయ్యారు. ఒకవైపు కన్నతల్లిగా తన బిడ్డకు పాలిస్తూ... మరోవైపు తన డ్యూటీని నిబద్ధతగా నిర్వర్తించారు. ఇలా రెండు రకాల పనులను ఒకే సమయంలో చేసి అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. అది కాస్త కేంద్ర మంత్రికి తెలియడంతో ఆయన ట్విట్టర్లో ఆమె ఫొటో షేర్ చేసి మరీ అభినందించారు. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆమెను మీరు గ్రేట్ మేడమ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. ఇంకో అధికారి చాలా విభిన్నమైన పని చేసి అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఇంతకీ ఆ అధికారి ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భూపేష్ చౌదరి..
మన దేశంలో అత్యంత సున్నితమైన సరిహద్దు ప్రాంతం మయన్మార్. అది మన దేశంలోని మారుమూల జిల్లా.. మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది అత్యంత వెనుకబడిన మారుమూల జిల్లా సియాహా. అక్కడ సుమారు లక్ష మంది వరకు మాత్రమే జనాభా ఉంటారు. అక్కడికి భూపేష్ చౌదరి ఐఏఎస్ పోస్టింగ్ నిమిత్తం తొలిసారి వెళ్లాడు.

పూర్తిగా కొండ ప్రాంతం..
అక్కడ పూర్తిగా కొండ ప్రాంతం. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఆ జిల్లా అటానమస్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది. అంటే అక్కడ గవర్నర్ ఆదేశానుసారం పని చేయాల్సి ఉంటుంది. అక్కడికి అనుగుణంగా చట్టాలను, నియమాలను ఆ రాష్ట్ర అసెంబ్లీనే రూపొందించుకునే జిల్లా అది. వ్యవసాయాధారమే అక్కడ అందరికీ జీవనాధారం. అక్కడ బర్డ్ ఐ పేరుతో పండించే మిర్చి చాలా పాపులర్. వీటిని అస్సాంలోని సిల్చార్ వరకూ తీసుకెళ్లి వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మటం.. కనీసం తాము పండించిన మిర్చిని నిల్వ చేసే సౌకర్యం రైతులు కలిగి ఉండకపోవటాన్ని వారి బలహీనతలుగా మార్చుకుని వ్యాపారులు అక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న పరిస్థితులు తయారయ్యాయి. ఇది డిప్యూటీ కమిషనర్ గా ఉన్న భూపేష్ చౌదరికి తెలిసింది.

స్వయం సహాయక సంఘాలు..
అత్యంత పాపులర్ అయిన ఆ మిర్చిని పండించే రైతుల పరిస్థితుల్లో మార్పు తేవాలనుకున్నాడు. సియాహా జిల్లాలోని సియాట్లై, జైహ్నుతో పాటు మరో 3 గ్రామాలకు చెందిన రైతులతో కలిసి మాట్లాడారు. 281 మంది రైతులతో 25 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. మిరపకాయ పండించడం నుండి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఇలా వివిధ దశల్లో వారికి కావాల్సిన వసతులపై ఎక్కువ శ్రద్ధ చూపారు. అంతేకాదు ఇతర ప్రాంతంలోని పసుపు రైతుల కోసం ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి.. అక్కడి రైతులను లాభాల పట్టించిన అనుభవం కూడా అప్పటికే ఉంది.

భూపేష్ మాట..
మిరప రైతుల విషయంలో తాను చూపించిన చొరవతో అక్కడి రైతులకు ప్రయోజనం చేకూరడంతో.. అది తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని.. అయితే అందుకు తన చొరవతో పాటే.. అక్కడి పరిపాలనా యంత్రాంగం, స్థానిక ఎన్జీఓల సహకారం కూడా ఉందని చెప్పారు. ఇలా రైతుల కోసం ఓ ఐఏఎస్ అధికారి మారుమూల పల్లెల్లోని తమ పంట పరిస్థితుల గురించి పట్టించుకోవడమే కాదు. ఏకంగా వారి తలరాతను మార్చిన తనకు జన్మజన్మల రుణపడి ఉంటామని అక్కడి రైతులు చెబుతున్నారు.

భూపేష్ ఆలోచనతో..
ఆ ఐఏఎస్ అధికారి ఆలోచన.. ఆచరణ వల్ల అక్కడి రైతులు ఇప్పుడు మిరప పొడిని కిలోకు 700 నుండి రూ.800 వరకు అమ్మకుంటున్నారు. గతంలో 50 నుండి 100 రూపాయల వరకే అమ్ముకునే వారు. అలాంటిది ఇప్పుడు వారి ఆదాయం అనూహ్యంగా పెరిగింది. దీంతో వారు చాలా సంతషంగా ఉన్నారు.

నీటి ట్యాంకుల నిర్మాణం..
అంతేకాదు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద మిరపకాయను కడగడానికి 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి ట్యాంకులను నిర్మించేందుకు సహాయపడ్డారు. వాటికి తోడు కడిగిన మిరపకాయలను ఆరబెట్టడానికి.. అన్ని కాలాల్లో అనువుగా ఉండే సోలార్ టన్నెట్స్ ను కూడా నిర్మించారు. అంతేకాదు దీనికి దేశీయ మార్కెట్లో కూడా ఆమోదయోగ్యత లభించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(fssai) రిజిస్ట్రేషన్ కోసం కేంద్రానికి దరఖాస్తు చేయించారు. ఇలా వారికి చేసిన సహాయంతో రైతులు ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
All Images : Curtosty



Click it and Unblock the Notifications











