For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్యాన్స్ డే 2020 : మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది అభిమానులు దాని వల్లే పెరిగారట...

అలాంటి డ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టిందట.

|

మీరు ఎప్పుడైనా డల్ గా ఉంటే డ్యాన్స్ చేయాలట.. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఒత్తిడిని అధిగమించేందుకు డ్యాన్స్ చేసేవాడట. ఎందుకంటే డ్యాన్స్ చేయడం వల్ల శరీరం, మనసు కూడా ఎంతో రిలాక్స్ అవుతుంది.

Interesting Facts about International Dance Day

ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అలాంటి వారంతా నాట్యం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.

Interesting Facts about International Dance Day

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా తనకు నాట్యంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఆయన ఏమేమీ మాట్లాడారు.. డ్యాన్స్ గురించి ఏయే విషయాలు చెప్పారో మీరే చూడండి...

డ్యాన్స్ అంటే..

డ్యాన్స్ అంటే చాలా మంది సినిమాలకు సంబంధించిన విషయమని భావిస్తుంటారు. కానీ అది కరెక్టు కాదు. అది ఒక కళ. అంతకుమించిన వ్యాయామం. మన బాడీ ఫిట్ గా ఉంచుకునేందుకు నాట్యం ఎంతగానో దోహదం చేస్తుంది.

ఉత్సాహంగా ఉన్న సమయంలో..

ఉత్సాహంగా ఉన్న సమయంలో..

చాలా మంది ఏదో ఒక పండగకో లేదా పెళ్లి వేడుక ఇతర శుభకార్యాల సమయంలో ఎక్కువ డ్యాన్స్ చేస్తుంటారు. కానీ నిజానికి ఉత్సాహంగా ఉన్న సమయంలో డ్యాన్స్ చేయడం కాదు.. అసలు డ్యాన్స్ చేస్తేనే ఆనందంగా ఉంటారనేది నిజం.

డ్యాన్స్ చేయడం వల్ల..

డ్యాన్స్ చేయడం వల్ల..

డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలోని ప్రతి అవయవం, కండరాలు కదులుతాయి. వ్యాయామానికి బద్ధకించే బాడీ కాస్తా.. కొత్త ఉత్సాహంతో గంతులేస్తుంది. దీని వల్ల శరీరంలో ఎన్నో కేలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గడం.. బిగుసుకున్న కండరాలన్నీ రిలాక్స్ అవ్వడం.. మనసు ప్రశాంతంగా మారడం జరుగుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు గుండె, ఊపిరితిత్తుల సమస్యలను అదుపు చేయడంలో డ్యాన్స్ ఎల్లప్పుడూ ముందువరుసలోనే ఉంటుంది.

మ్యూజిక్ తగ్గట్టు బాడీని..

మ్యూజిక్ తగ్గట్టు బాడీని..

ప్రతి రోజూ ఏదో వ్యాయామం చేయాలనుకున్న వారిలో చాలా మంది డ్యాన్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అనేక పరిశోధనల్లో కూడా తేలిందట. ఎందుకంటే ఏవేవో వర్కవుట్లు చేసినట్లు కాకుండా.. డ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ చేయొచ్చట. జుంబా, ఏరోబిక్స్ ఇలా ఏదైనా సరే డ్యాన్స్ తోనే ముడిపడి ఉంటాయి. సంగీతాన్ని వినడం.. దానికి తగ్గట్టు బాడీని కదిలించడం..అన్నికూడా రిలాక్స్ అయ్యే పనులే. ఇలా చేస్తే కూడా చక్కని ఎక్సర్ సైజ్ చేసినట్లే.

డ్యాన్స్ తో ఆరోగ్యం..

డ్యాన్స్ తో ఆరోగ్యం..

దీని వల్ల మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మీ కండరాలు, ఎముకలను బలంగా ఉంచి, బాడీని ఫిట్ గా ఉంచి, శారీరకంగా, మానసికంగా మీరు చాలా బలంగా ఉండేటట్లు చేసేదే డ్యాన్స్.

వీటిని నిర్లక్ష్యం చేయొద్దు..

వీటిని నిర్లక్ష్యం చేయొద్దు..

అందుకే డ్యాన్స్ అంటే మనకి సంబంధించినది కాదనుకోకుండా.. ఎక్సర్ సైజ్ అంటే ఇష్టపడని వారంతా చక్కగా డ్యాన్స్ చేసేయండి. అయితే ఇది చేయడానికి ముందు మంచి ఆహారాన్ని తీసుకోవడం.. వార్మప్ వంటివి చేయడం అస్సలు మరచిపోవద్దు.

English summary

Interesting Facts about International Dance Day

Here we talking about intersting facts about international dance day. Read on,
Desktop Bottom Promotion