For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఈ ఆసక్తికరమైన నిజాలు మీకు తెలుసా..

చిరుప్రాయంలోనే క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అదే అలవాటు ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ కొనసాగిస్తున్నాడు.

|

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 69 ఏళ్ల వయసులోనూ అంత హుషారుగా, ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నాడు.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి మన దేశంలోని అత్యున్నత పదవిని ఎలా అలంకరించాడు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా హ్యట్రిక్ ఎలా సాధించాడు.. తన లక్ష్యాలను ఎలా సాధించాడు.. ఈ స్టోరీలో తెలుసుకుందాం. అంతకంటే సెప్టెంబర్ 17న పుట్టినరోజు జరుపుకుంటున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం..

Happy Birthday Narendra Modi

1950 సెప్టెంబర్ 17వ తేదీన గుజరాత్ లోని వాడ్నగర్ ప్రాంతంలోని ఓ నిరుపేద కుటుంబంలో దామోదర్ దాస్ మూల్ చంద్ మోడీ, హీరా బెన్ దంపతులకు నరేంద్ర మోడీ జన్మించారు. మోడీ తల్లి ఇతర ఇళ్లలో పని చేసి సంపాదించే వారు. మోడీ తండ్రి రైల్వేస్టేషనులో ఓ చిన్న ఛాయ్ (టీ) దుకాణాన్ని నడిపేవారు.

Happy Birthday Narendra Modi

మోడీ కుటుంబంలో ఆరుగురు సంతానం కాగా నరేంద్ర మోడీ మూడో వాడు. వారిది పెద్ద కుటుంబం, వారికి చాలీచాలని ఆదాయం కారణంగా అతి కష్టం మీద వారి బతుకుబండి లాక్కుని వచ్చేవారు.

తండ్రి కష్టాన్ని చూడలేక నరేంద్ర మోడీ చిన్ననాటి నుండే తన తండ్రి ఛాయ్ దుకాణంలో పనిచేయడం మొదలుపెట్టాడు. తర్వాత 8 ఏళ్ల వయసులో 1958లో గుజరాత్ లోని వాడ్నగర్ లో బాల స్వయం సేవకులను ఆర్ ఎస్ ఎస్ లోకి ఆహ్వానించే కార్యక్రమం చేపట్టారు. వందలాది మంది బాలలు ప్రమాణం చేస్తుండగా అందులో నుండి ఒక కంఠం ఢిల్లీ సింహాసనం అదిరిపడేలా ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు ఎవరిదో కాదు ప్రస్తుత మన ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీది. అప్పుడే మోడీని గుర్తించి లక్ష్మణరావు ఇనామ్ దారు ఆ పిల్లాడిని గుర్తించి ఈ అబ్బాయి ఎప్పటికైనా ఢిల్లీలో చక్రం తిప్పుతారని భవిష్యత్తు చెప్పేశారు. అతని ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణను ఇప్పించారు.

1) మోడీ ప్రథమ రాజకీయ గురువు..

1) మోడీ ప్రథమ రాజకీయ గురువు..

మోడీకి ఆర్ ఎస్ ఎస్ లో ఉన్నప్పుడు ప్రత్యేక శిక్షణ ఇప్పించిన లక్ష్మణరావు ఆయన తొలి రాజకీయ గురువు. 8 సంవత్సరాల వయసులో ఉదయం, సాయంత్రం ఛాయ్ అమ్మి, మధ్యాహ్నం సమయంలో భాగవతాచర్య, నారాయణచార్య పాఠశాలలకు వెళ్లేవాడు. సెలవు రోజుల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో శిక్షణ తీసుకునేవాడు.

2) క్షణం తీరిక లేకుండా..

2) క్షణం తీరిక లేకుండా..

చిరుప్రాయంలోనే క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అదే అలవాటు ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనూ కొనసాగిస్తున్నాడు. నిత్యం ఏదో ఒక పనిచేస్తూ బిజీబిజీగా గడుపుతాడు. అందరూ మామూలుగా 8 లేదా 12 గంటలు పనిచేస్తే మన ప్రధాని మోడీ మాత్రం 18 గంటలు పనిచేస్తారు.

3) నాటక రంగంలోనూ ప్రావీణ్యం..

3) నాటక రంగంలోనూ ప్రావీణ్యం..

మోడీ నిజానికి పాఠశాలలో ఒక సాధారణ విద్యార్థి మాత్రమే. కానీ నాటక రంగం అంటే ఆయన అమితంగా ఇష్టపడేవారు. నాటక రంగంలో నాటకాలు వేసేవారు. నాటకాల్లో అద్భుత ప్రతిభ కనబరిచేవారు. అనర్గళంగా ప్రసంగాలు చేసే వారు అని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

4) పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం..

4) పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం..

ప్రధాని మోడీకి పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. కానీ స్కూలులో ఉండే పుస్తకాలు కాదు. గ్రంథాలయంలో ఉండే పుస్తకాలంటే చాలా ఇష్టమట. రోజువారీ దినచర్యలో ఆయనకు ఏ కాస్త సమయం దొరికినా లైబ్రరీలోనే ఎక్కువగా గడిపేవాడినని మోడీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

5) ఇంటర్ తర్వాత పెళ్లి..

5) ఇంటర్ తర్వాత పెళ్లి..

1967లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మోడీకి వారి తల్లిదండ్రులు వెంటనే జెశోదా బెన్ తో వివాహం చేశారు. వివేకానందస్వామిని ఆదర్శంగా తీసుకున్న ఆయనకు ఆ పెళ్లి అంటే ఏ మాత్రం ఇష్టం లేదు. కుటుంబానికి, బంధాలకు, ప్రేమానురాగాలకు తాను బంధి అయితే దేశానికి తాను పూర్తి స్థాయిలో సేవ చేయలేనని భావించారు. అందుకే కొన్ని రోజులు హిమాలయాలకు వెళ్లిపోయారు. సన్యాసిగా సాధారణ జీవితాన్ని గడిపారు.

6) అహ్మదాబాద్ లో మలుపు..

6) అహ్మదాబాద్ లో మలుపు..

మళ్లీ తిరిగి అహ్మదాబాద్ లో తన బాబాయ్ దగ్గర టీ అమ్ముతుండగా ఆర్ ఎస్ ఎస్ లోని తన గురువు ఇనామ్ దారు కనిపించారు. వెంటనే నన్ను గుర్తుపట్టారా అని ఆయన్ని అడిగి అతని పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మోడీని చూసి సంతోషించిన ఆయన అప్పటి నుండి ఆర్ ఎస్ ఎస్ భవన్ కు సంబంధించిన అన్ని పనులు చూసుకోవాలని చెప్పారు. దీంతో అక్కడికి మకాం మార్చేశారు.

7) ఎబివిపి నాయకుడిగా..

7) ఎబివిపి నాయకుడిగా..

ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఎంపికయ్యాడు. ఓ వైపు ఆర్ ఎస్ ఎస్, మరోవైపు ఎబివిపి లీడర్ గా తన విధులను సక్రమంగా నిర్వర్తించేవాడు. విద్యార్థుల తరపున ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేవాడు. ఎమర్జెన్సీ సమయంలో పలు వేషాలు మార్చి పోలీసులకు దొరకకుండా తన పనిని విజయవంతంగా ముగించేవారు. ఎమర్జెన్సీ దారుణాలను విమర్శిస్తూ ‘సంఘర్ష్‘ మా అనే పుస్తకాన్ని కూడా రచించాడు.

8) తిరుగులేని రాజకీయ నాయకుడిగా..

8) తిరుగులేని రాజకీయ నాయకుడిగా..

అనంతరం ఆర్ ఎస్ ఎస్ లో రీజనల్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత వాజ్ పేయి ఆదేశాలతో గుజరాత్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యాడు. అంతే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఒంటిచేత్తో విజయం సాధించేవారు. అలా నాలుగుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి అఖండ విజయం సాధించి దేశ ప్రధానిగా ఇప్పటికీ అలుపెరగని సేవలు అందిస్తున్నారు.

English summary

Happy Birthday Narendra Modi : Interesting Facts About Him

Narendra Modi was born to Damodar Das Mool Chand Modi and Hira Ben on September 17, 1950 in a poor family in Vadnagar, Gujarat. Modi's mother worked in other houses. Modi's father runs a small tea shop on the railway station. Narendra Modi is the third child of Modi's family. They have a large family, and they have to keep their money on the hardwood due to their income.
Desktop Bottom Promotion