Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
వీకెండ్ లో ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే చికెన్ కూర కాకుండా కాస్త వెరైటీగా, మరింత రుచిగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ట్రై చేయాల్సిందే. పుట్టగొడుగులు (మష్రూమ్స్), చికెన్ కలయిక ఆహా అనిపిస్తుంది.
పుట్టగొడుగుల్లో మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. చికెన్ ద్వారా ప్రొటీన్లు, ఇతర పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. ఈ రెండు కలగలిపిన ఈ అద్భుతమైన కాంబో కర్రీ ఒక్కసారి వండితే ఇంట్లో వాళ్లు మళ్లీ మళ్లీ అడిగి మరీ వండించుకుంటారు.

మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్: అర కిలో
పుట్టగొడుగులు: 250 గ్రాములు
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 5
ఎండుమిర్చి: 5
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: అర టీ స్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
తాలింపు గింజలు: 1 టీ స్పూన్
పసుపు: అర టీ స్పూన్
కారం: 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా: అర టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కూరకు సరిపడా
కొత్తిమీర: అర కట్ట

మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ తయారీ విధానం
-ముందుగా అరకిలో చికెన్ ను రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చికెన్ ముక్కలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి సగం ఉడికే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-మష్రూమ్స్ ను కూడా మట్టి లేకుండా గోరువెచ్చని నీటితో కడిగి, మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకుని, వాటిని కూడా వేరే గిన్నెలో వేసి కాస్త ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి,అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. సరిపడా నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేసి దోరగా వేయించాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఆ సువాసన వస్తున్న సమయంలో.. ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్, మష్రూమ్ ముక్కలను పాన్ లో వేసి అన్నీ కలిసేలా బాగా గరిటెతో తిప్పాలి.
-ఇప్పుడు అందులో అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మగ్గాక, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కూరను బాగా కలుపుకోవాలి.
-చికెన్, మష్రూమ్స్ బాగా ఉడికిన తర్వాత కూరకు ప్రాణం పోసే ధనియాల పొడి, ఇతర మసాలా పొడులు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చిక్కటి గ్రేవీ కోసం ఒక గ్లాస్ నీళ్లు పోసి, మంటను సిమ్ లో పెట్టి 10 నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించాలి.
-కూర దగ్గరపడి, గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలుతున్నప్పుడు.. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ రెడీ. వేడి వేడి అన్నం, బగారా రైస్, బిర్యానీ లేదా చపాతీ, పూరీలతో ఈ కర్రీని తింటుంటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications