For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహాభారతంలో మరచిపోలేని మజిలీలెన్నో...!

మహా భారతంలో ఆసక్తికరమైన ప్రేమ కథల గురించి తెలుసుకుందామా

|

మహాభారతం అనగానే మనలో చాలా మందికి క్రిష్ణుడు, అర్జునుడు, పాండవులు, కౌరవులు, ద్రౌపది, శకుని, కురుక్షేత్ర యుద్ధం, పాండవుల వనవాసం వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి.

Interesting mahabharata love stories in Telugu

అయితే మహాభారతమంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా ఎన్నో మరపురాని, మధురానుభూతి కలిగించే ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ కథలు మాత్రమే బంధాలు, అనుబంధాలు మరపురాని మజిలీలెన్నో కూడా ఉన్నాయి.

Interesting mahabharata love stories in Telugu

పురాణాల ప్రకారం మంచి, చెడుల గురించి వివరించే మహాభారతంలో మనల్ని ఆకర్షించే ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆసక్తికరమైన ప్రేమ కథలేవో ఇప్పుడు తెలుసుకుందాం...

శ్రీ క్రిష్ణుడికి దేవకి, యశోదతో పాటు ఎంతమంది తల్లులు ఉన్నారో తెలుసా...!శ్రీ క్రిష్ణుడికి దేవకి, యశోదతో పాటు ఎంతమంది తల్లులు ఉన్నారో తెలుసా...!

కన్నయ్య, రుక్మిణి..

కన్నయ్య, రుక్మిణి..

పురాణాల ప్రకారం, మహాభారతంలో శ్రీక్రిష్ణ లీలల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వేణు మాధవుడు, రుక్మిణిదేవి ఒకరినొకరు బాగా ఇష్టపడతారు. వీరిద్దరూ వివాహం చేసుకునేందుకు సిద్ధపడతారు. అయితే ఇది రుక్మిణి కుటుంబసభ్యులకు ఏ మాత్రం ఇష్టముండదు. ఎందుకంటే కంసుడిని క్రిష్ణుడు హతమార్చడం వల్ల రుక్మిణి సోదరుడు వీరి ప్రేమ వివాహానికి అడ్డుగా నిలిచాడు. దీంతో శ్రీక్రిష్ణుడు రుక్మిణి కుటుంబానికి ఇష్టం లేకున్నా.. తను ప్రేమించిన రుక్మిణి దేవిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుంటాడు. దీంతో రుక్మిణి సోదరుడికి, క్రిష్ణుడి మధ్య వైరం ఏర్పడుతుంది.

అర్జునుడు, చిత్రాంగద..

అర్జునుడు, చిత్రాంగద..

చిత్రాంగద, మణిపూర్ యువరాణి. ఓ రోజు కావేరీ నదీ ఒడ్డున మణిపూర్ ను అర్జునుడు సందర్శించాడు. అక్కడే అందమైన చిత్రాంగదను చూసి ప్రేమలో పడ్డాడు. అయితే వెంటనే ఆమెకు ప్రేమ ప్రతిపాదనతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఈ విషయం తెలిసిన చిత్రాంగద తండ్రి వీరి వివాహం జరగాలంటే కొన్ని షరతులను విధించాడు. చిత్రాంగద పిల్లలు మణిపూర్ లోనే పెరగాలని మరియు వారే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. ఇందుకు అర్జునుడు కూడా ఒప్పుకుంటాడు. వీరికి బబ్రువాహనుడు జన్మించిన తర్వాత అర్జునుడు భార్య, కుమారులను వదిలి సోదరులతో కలిసి ఉన్నాడు. చిత్రవాహనుడు(చిత్రాంగద తండ్రి) మరణం తర్వాత బబ్రు వాహనుడు ఆ రాజ్యానికి రాజయ్యడు. అంతేకాదు, మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు తన కొడుకు చేతిలో ఓడిపోయాడు.

మరో ప్రేమ కథ..

మరో ప్రేమ కథ..

మరో కథనం ప్రకారం.. అర్జనుడు, సుభద్ర సోదరుడు గద, ద్రోణచార్యుల వద్ద శిక్షణ తీసుకున్నారు. అజ్ణాతవాసం తర్వాత, అర్జునుడు సుభద్ర మందిరానికి చేరుకున్నాడు. అక్కడే సుభద్ర, అర్జునుడి మధ్య ప్రేమ పుట్టింది. అప్పుడు శ్రీక్రిష్ణుడే సుభద్రను అపహరించమని సలహా ఇచ్చి.. వారి వివాహానికి కారకుడయ్యాడు. అయితే సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు ఆమె అర్జునుడితో తన వివాహం గురించి వెంటనే చెప్పలేదు. వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉండేవారు. అయితే ఓ రోజు సుభద్ర తమ వివాహ విషయం గురించి ద్రౌపదికి చెప్పగా.. తను కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఏదో తెలుసా... ఆ గుడిలో ఆరో గదిని ఎందుకు తీయలేదంటే...ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం ఏదో తెలుసా... ఆ గుడిలో ఆరో గదిని ఎందుకు తీయలేదంటే...

భీముని ప్రేమ..

భీముని ప్రేమ..

మహాభారతంలో భీముని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో బలవంతుడైన భీముడు నరభక్షకురాలు హిడింబితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత హిడింబిలో మార్పు వచ్చింది. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలం మాత్రమే కలిసి ఉన్నారు. అయితే అనంతరం భీముడు తనని వదిలి వెళ్లాడు. ఆ తర్వాతే హిడింబి ఘటోత్గటుడికి జన్మనిచ్చింది. తను ఒంటరిగానే తనని పెంచి పెద్ద చేసింది.

దుర్యోదనుడి ప్రేమ..

దుర్యోదనుడి ప్రేమ..

మహాభారతంలో కౌరవులలో ఒకరైన దుర్యోదనుడు ప్రేమ కథ ప్రత్యేకమైనది. దుర్యోదనుడు ప్రేమించిన భానుమతి కాంబోజ రాజు చంద్రవర్మ కుమార్తె. తను అచ్చం అప్సరసలా ఉంటుంది. అంతేకాదు ఎంతో తెలివైంది కూడా. ఓ రోజు భానుమతి స్వయంవరానికి వెళ్తాడు దుర్యోదనుడు. అక్కడ జరాసంధుడు, శిశుపాలు, రుక్మీలు హాజరవుతారు. అక్కడ భానుమతి జయమాలను ఎవరి మెడలో వేస్తే.. వారే తన భర్తగా మారతారు. ఈ నేపథ్యంలో తను జయమాలతో ముందుకు నడుస్తుండగా.. దుర్యోదనుడు తనను అడ్డుకొని బలవంతంగా తన మెడలో జయమాల వేసేలా ప్రేరేపిస్తాడు. అలా భానుమతిని దుర్యోదనుడు సొంతం చేసుకుంటాడు.

శంతనుడి ప్రేమ..

శంతనుడి ప్రేమ..

సత్యవతి పరిమళం శంతనుడిని బాగా ఆకర్షించింది. తన నుండి వచ్చే ఆ సువాసనకు శంతనుడు ఫిదా అయిపోయాడు. ఓ రోజు నదిలోని పడవలో ప్రయాణిస్తుండగా.. తీరం చేరాక తనను నదిని దాటించమని సత్యవతిని కోరాడు. ఇందుకు ఒప్పుకున్న ఆమె శంతనుడిని నది దాటిస్తుంది. అయితే అనంతరం మళ్లీ పడవలో చేర్చమని చెప్పగా.. అందుకూ ఆమె అంగీకారం తెలుపుతుంది. ఈ విధంగా ఆరోజు సంధ్యా సమయం దాకా ఇదే తంతు కొనసాగింది. చివర్లో శంతనుడు సత్యవతికి వివాహ ప్రతిపాదన చేయగా.. తను కూడా అంగీకరించింది. కానీ, తాను తన తండ్రి చెబితేనే.. తను పెట్టిన షరతులకు ఒప్పుకుంటేనే శంతనుడిని వివాహం చేసుకుంటానని చెప్పింది.

English summary

Interesting mahabharata love stories in Telugu

Here we are talking about the interesting mahabharata love stories in Telugu. Read on
Story first published:Monday, March 29, 2021, 11:22 [IST]
Desktop Bottom Promotion