Just In
- 3 hrs ago ఏప్రిల్ 24న మేష రాశిలో శుక్ర గురు గ్రహ సంయోగం, 3 అదృష్ట రాశులు శుక్రదశతో ఐశ్వర్యం పొందుతారు
- 6 hrs ago ఈ రోజు రాశి ఫలాలు: దశమి గురువారం బాబా అనుగ్రహంతో ఈ రాశుల వారికి లాభదాయకం..ఆదాయం పెరుగుతుంది
- 12 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 13 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
జూన్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...
జూన్ 2020 రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..! ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల ఫలితాలు జూన్ నెలలో ఈ విధంగా ఉన్నాయి. ఈ నెలలో ఓ రాశి వారికి ఆదాయ పరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఆదాయ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి వివాహ జీవితంలో గొడవలు పెరగొచ్చు.
కొన్ని రాశుల విద్యార్థులకు ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని రాశుల ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓ రాశి ఉద్యోగులకు ఈ నెలలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకోండి. మరి ఆలస్యం చేయకుండా జూన్ మాసంలో ఏయే రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం..
ఈ
వారం
కుంభరాశి
వ్యాపారులకు
మెరుగైన
లాభాలు
రావొచ్చు...
మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్
ఈ రాశి వారికి ఈనెల పని విషయంలో చాలా ముఖ్యమైనది. మీరు ముందుకు సాగడానికి బంగారం లాంటి అవకాశాలు లభిస్తాయి. ఒకవైపు మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. మరోవైపు, ఈ కాలంలో మీరు తీసుకున్న సరైన నిర్ణయాల యొక్క మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు. మీ ప్రమోషన్ కు బలమైన అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారులతో మీ సంబంధం మెరుగ్గా ఉంటుంది. అవసరమైతే, మీకు సహోద్యోగుల పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. అయితే, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఈ నెలలో మీకు మంచి లాభాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈ నెలలో మీరు సులభంగా సంపదను కూడబెట్టుకోగలుగుతారు. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది.
రాశిచక్ర మూలకం : అగ్ని
రాశి చక్ర గ్రహం : మార్స్
లక్కీ నంబర్లు : 11, 25, 39, 45, 50
లక్కీ డేస్ : గురువారం, ఆదివారం, మంగళవారం, బుధవారం
లక్కీ కలర్స్ : నీలం, ముదురు ఎరుపు, గోధుమ, తెలుపు
వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా తోబుట్టువులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. నెల మధ్యలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా పవిత్రమైన పని చేయవచ్చు. మీరు వివాహం చేసుకుంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా బాగుంటుంది. వారు మీకు అంకితభావంతో ఉంటారు. మీరు కూడా వారి భావాలను గౌరవిస్తే మంచిది. పని విషయంలో ఈ నెలలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ పనిపై పూర్తి సానుకూలతతో దృష్టి పెట్టగలుగుతారు. ఈ సమయంలో తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.
రాశిచక్ర మూలకం: భూమి
రాశి చక్ర గ్రహం: శుక్రుడు
లక్కీ నంబర్లు : 4, 18, 29, 32, 49, 57
లక్కీ డేస్ : ఆదివారం, గురువారం, బుధవారం, శుక్రవారం
లక్కీ కలర్స్ : ఆకుపచ్చ, మెరూన్, ఆకాశం, గులాబీ, తెలుపు
మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు పెద్ద ప్రయోజనం పొందలేకపోతున్నప్పటికీ, మీ ప్రణాళికలు ముందుకు సాగవచ్చు. నెమ్మదిగా కానీ మీ ప్రయత్నాలు ఫలించినట్లు కనిపిస్తాయి. ఆర్థిక పరంగా మీకు ఈ నెలలో కచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే మీరు కష్టపడి పని చేయాలి. మీ కృషి కూడా ప్రశంసించబడుతుంది. మరోవైపు, మీ సహోద్యోగులలో కొందరు మిమ్మల్ని కలవరపెట్టడానికి కూడా ప్రయత్నించవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ నెల, కుటుంబంలో పెద్ద సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెల మంచిగా ఉంటుంది.
రాశిచక్ర మూలకం : గాలి
రాశి చక్ర గ్రహం : మెర్క్యూరీ
లక్కీ నంబర్లు : 2, 18, 26, 31, 44, 57
లక్కీ డేస్ : బుధవారం, మంగళవారం, ఆదివారం, సోమవారం
లక్కీ కలర్స్ :ముదురు నీలం, ఎరుపు, గోధుమ, తెలుపు
ఈ 4 రాశుల వారు ప్రేమలో పడటం కష్టమే. అందులో మీ రాశి కూడా ఉందేమో చూసేయ్యండి...
కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, మీకు మంచి అవకాశాలు రావచ్చు. దీంతో మీ కెరీర్ కొత్త దిశలో పయనిస్తుంది. వ్యాపారులు ఈ నెల ప్రారంభంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. త్వరలో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది. జూన్ నెలలో వ్యాపారులకు చాలా పవిత్రంగా ఉంటుంది. ప్రత్యేకించి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, ఈ సమయంలో మీకు లాభం పొందడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈ నెలలో చాలా మంచిగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఈ నెలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామితో. ఆరోగ్య పరంగా మీకు సాధారణంగా ఉంటుంది.
రాశిచక్ర మూలకం : నీరు
రాశి చక్ర గ్రహం : చంద్రుడు
లక్కీ నంబర్లు : 5, 17, 24, 30, 45, 54
లక్కీ డేస్ : బుధవారం, గురువారం, ఆదివారం, శుక్రవారం
లక్కీ కలర్స్ : ఆకాశం, ఎరుపు, పసుపు, క్రీమ్
సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈనెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా ఈ నెల మీకు మంచిది. మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహిస్తే, మీ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో, ఉన్నతాధికారుల కళ్ళు మీ పని మీద ఉంటాయి. ఎలాంటి నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది. వ్యాపారులకు ఈ నెలలో మీరు తక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మీ ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరమైన విషయాల్లో ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంబంధం క్షీణిస్తుంది.
రాశిచక్ర మూలకం : అగ్ని
రాశి చక్ర గ్రహం : సూర్యుడు
లక్కీ నంబర్లు : 7, 10, 19, 21, 33, 40, 55
లక్కీ డేస్ : గురువారం, శుక్రవారం, సోమవారం, బుధవారం
లక్కీ కలర్స్ :ఎరుపు, ముదురు ఆకుపచ్చ, నీలం, కుంకుమ
కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ నెలలో చాలా పవిత్రంగా ఉంటుంది. మీరు మీ పరీక్ష ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ నెలలో మీరు మీ కృషి యొక్క ఫలాలను పొందే అవకాశం ఉంది. మీకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీరు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు. మీరు చట్టం, మీడియా లేదా నిర్వహణ చదువుతుంటే, ఈ సమయం మీకు చాలా మంచిది. విదేశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా శుభవార్త వినొచ్చు. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త సభ్యుడు కూడా ఇంట్లోకి రావచ్చు. వ్యాపారులు కూడా ఈ కాలంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీకు కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ నెల బాగానే ఉంటుంది.
రాశిచక్ర మూలకం: భూమి
రాశి చక్ర గ్రహం: మెర్క్యూరీ
లక్కీ నంబర్లు : 1, 15, 22, 35, 40, 57
లక్కీ డేస్ : మంగళవారం, గురువారం, సోమవారం, బుధవారం
లక్కీ కలర్స్ : పసుపు, ఎరుపు, మెరూన్, తెలుపు
రోహిణి
కార్తెలో
భానుడు
ఎందుకు
అంతలా
రెచ్చిపోతాడో
చూడండి...
తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీకు పురోగతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి కోరుకున్న చోటుకు బదిలీ కావచ్చు. అయితే నెల మధ్య పనిభారం కొద్దిగా పెరుగుతుంది. మీరు మీ పనిని పూర్తి విశ్వాసంతో మరియు నిజాయితీతో పూర్తి చేస్తారు. ఈ సమయంలో అధికారులతో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపారులకు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోవచ్చు. సొంత ఇల్లు కొనాలనుకునే వారు కూడా ఈ కలను నెరవేర్చవచ్చు. కుటుంబ జీవితం ఆనందం మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి.
రాశిచక్ర మూలకం : గాలి
రాశి చక్ర గ్రహం: శుక్రుడు
లక్కీ నంబర్లు : 6, 14, 29, 33, 40, 56
లక్కీ డేస్ : ఆదివారం, మంగళవారం, గురువారం, సోమవారం
లక్కీ కలర్స్ : తెలుపు, గోధుమ, పసుపు, క్రీమ్
వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు ఈ నెలలో వ్యక్తిగత జీవితంలో అయినా, మీరు చేసే పనిలో అయినా మిశ్రమ ఫలితాలను పొందుతారు. అయితే మీరు ఈ నెలలో కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఉద్యోగులు ఈ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపార విషయాలలో మీరు తొందరపడకండి. మీరు కష్టపడి పని చేయాలి. అయితే ఈ నెలలో ఆర్థిక పరంగా మంచిగానే ఉంటుంది. మీకు అదనపు ఆదాయం కూడా లభించవచ్చు. మీరు పాత అప్పులను కూడా ఈ నెలలో చెల్లించే అవకాశం ఉంది. కానీ ఈ నెలాఖరులో మాత్రం కొంత డబ్బు కొరత ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి.
రాశిచక్ర మూలకం: నీరు
రాశి చక్ర గ్రహం: మార్స్ మరియు ఫ్లూటో
లక్కీ నంబర్లు : 5, 19, 20, 31, 40, 56
లక్కీ డేస్ : గురువారం, సోమవారం, శనివారం, బుధవారం
లక్కీ కలర్స్ : మెరూన్, ఎరుపు, గులాబీ, ఆకాశం
ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారు ఈనెలలో ఆర్థిక పరమైన విషయాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు పొదుపు చేయడంలో ఈ నెలలో విఫలమయ్యే అవకాశం ఉంది. ఈ నెలలో మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెలలో పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మీకు ప్రతికూల ఫలితాలే ఎదురుకావచ్చు. మీరు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, మీరు ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో నిరుద్యోగులు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ సమయంలో ఎలాంటి మార్పులను చేయకూడదు. మీకు మానసిక ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.
రాశిచక్ర మూలకం : అగ్ని
రాశి చక్ర గ్రహం: గురుడు
లక్కీ నంబర్లు : 1, 7, 14, 21, 38, 49
లక్కీ డేస్ : ఆదివారం, శనివారం, సోమవారం, బుధవారం
లక్కీ కలర్స్ : డార్క్ రెడ్, గ్రీన్, రోజ్, పర్పుల్
మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19
ఈ రాశి వారి జీవితంలో ఈ నెలలో స్థిరత్వం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ నెలలో చాలా కష్టపడి పని చేస్తారు. అయితే మీరు ఊహించిన ఫలితాలను ప్రారంభంలో పొందలేరు. అయితే క్రమంగా మీకు విశ్వాసం పెరుగుతుంది. మీరు పూర్తి సానుకూలతతో మీ లక్ష్యం వైపు ముందుకు వెళతారు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీ ఉండొచ్చు. బహుశా ఈ మార్పు మీ కోసం కూడా కొన్ని సవాళ్లను తెస్తుంది. కానీ మీరు ధైర్యంగా పనిచేయాలి. వ్యాపారులు ఈ నెలలో మంచి విజయాన్ని పొందవచ్చు. ఈ నెలలో పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో ఎలాంటి సమస్య ఉండదు.
రాశిచక్ర మూలకం : భూమి
రాశి చక్ర గ్రహం: శని
లక్కీ నంబర్లు : 4, 11, 26, 35, 44, 54
లక్కీ డేస్ : బుధవారం, ఆదివారం, గురువారం, మంగళవారం
లక్కీ కలర్స్ :పసుపు, గులాబీ, పర్పుల్, ఆరెంజ్, వైట్
కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సంపదను కూడబెట్టుకోగలుగుతారు. మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తారు. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ చూపగలరు. ఈ కాలంలో మీరు మంచి పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు కొంతమంది పేదవారికి ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉంది. ఈ నెల విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. సుదీర్ఘ కాలం తర్వాత మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యేకించి మీ పూర్తి శ్రద్ధ మీ అధ్యయనాలలోనే ఉంటుంది. గురువులతో పాటు ఇంటి పెద్దల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారులకు ఈ నెలలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల వల్ల మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ఈ సమయంలో, మీ ప్రత్యర్థులు గెలుస్తారు మరియు మీ విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
రాశిచక్ర మూలకం : గాలి
రాశి చక్ర గ్రహం : యురేనస్, శని
లక్కీ నంబర్లు : 3, 6, 16, 20, 34, 45, 56
లక్కీ డేస్ : ఆదివారం, మంగళవారం, సోమవారం, శనివారం
లక్కీ కలర్స్ : ముదురు ఆకుపచ్చ, గులాబీ, తెలుపు, పసుపు, ఎరుపు
మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల చూస్తారు. తద్వారా మీరు మీ ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టగలుగుతారు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ నెలలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే, ఈ కాలంలో మీరు మంచి ఉద్యోగం పొందవచ్చు. వ్యాపారులు ఈ నెలలో వ్యాపారం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీకు ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
రాశిచక్ర మూలకం : నీరు
రాశి చక్ర గ్రహం : నెఫ్ట్యూన్, గురుడు
లక్కీ నంబర్లు : 2, 10, 20, 36, 45, 51
లక్కీ డేస్ : మంగళవారం, సోమవారం, బుధవారం, ఆదివారం
లక్కీ కలర్స్ : ఎరుపు, పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...