For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వండర్స్ క్రియేట్ చేసిన వంట మనిషి.. రూ.1500 నుండి ఏకంగా రూ.కోటి బంపరాఫర్ కొట్టేసింది..

మహారాష్ట్రకు చెందిన బబితా ఓ స్కూల్ వంటమనిషిగా పనిచేసేవారు. నెలకు కేవలం రూ.1500 మాత్రమే సంపాదించేవారు.

|

ఆమె పేరు ప్రస్తుతం మన దేశంలో మారు మ్రోగుతోంది. వంట మనిషిగా పనిచేస్తూ ప్రతి నెలా కేవలం రూ.1500 సంపాదించే ఆమె ఒక్కసారిగా కోటీశ్వరురాలిగా మారిపోయింది. ఇదంతా ఆమె సంపాదించిన జ్ఞానంతోనే సాధ్యమయ్యింది. వచ్చిన ఒక్క అవకాశాన్ని అత్యంత చాకచక్యంగా వినియోగించుకుంది. దీంతో ఆమె ఎందరికో ప్రేరణగా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె కోటి రూపాయలు ఎలా సాధించింది. ఇందుకు ఆమె పడ్డ కష్టాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

KBC 11

photo curtosy

బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ యాంకర్ గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికే తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు ఇదొక కల్పవృక్షంగా మారిపోయింది. ఈ సీజన్ లో ఇప్పటికే ఓ వ్యక్తి కోటి రూపాయలను అవలీలగా సంపాదించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ రెండోసారి మాత్రం ఆ వంట మనిషి ఆ బంపరాఫర్ ను కొట్టేసింది. సరస్వతీ దేవీ కటాక్షం ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించింది.

మహారాష్ట్రకు చెందిన బబితా ఓ స్కూల్ వంటమనిషిగా పనిచేసేవారు. నెలకు కేవలం రూ.1500 మాత్రమే సంపాదించేవారు. తమ కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడేవారు. ఉన్నదానితో సర్దుకునిపోవాలనే మంచి మనస్తత్వం ఆమెది. అదే ఆమెను ఈరోజు హాట్ సీటులో కూర్చోబెట్టింది. అంతేకాదండోయ్ ఏకంగా ఆమెను కోటీశ్వరురాలను చేసింది.మహారాష్ట్రకు చెందిన బబితా ఓ స్కూల్ వంటమనిషిగా పనిచేసేవారు. నెలకు కేవలం రూ.1500 మాత్రమే సంపాదించేవారు. తమ కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడేవారు. ఉన్నదానితో సర్దుకునిపోవాలనే మంచి మనస్తత్వం ఆమెది. అదే ఆమెను ఈరోజు హాట్ సీటులో కూర్చోబెట్టింది. అంతేకాదండోయ్ ఏకంగా ఆమెను కోటీశ్వరురాలను చేసింది.

ఇక పాఠశాలలో ప్రతిరోజూ సుమారు నాలుగొందల మందికి పైగా విద్యార్థులకు వండి పెట్టేది. ఆమె కిచిడీ వంటను బాగా చేసేదట. ఆ కిడీని పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినేవారట. అలా ప్రతిరోజూ సాధారణంగా గడిచిపోవడం ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే అందరిలా కాకుండా తాను కూడా ఏదైనా ప్రత్యేకంగా చేయాలని కలలు గన్నారు. అందుకోసం నిరంతరం కష్టపడ్డారు. ఇంతలోనే కౌన్ బనేగా కరోడ్ పతి నుండి ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ బి దగ్గరికి చేరుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమెకు హాట్ సీటులో కూర్చున్న తర్వాత ఆమెకు చాలా కఠినమైన ప్రశ్నలే ఎదురయ్యాయి. కానీ ఎంతో ఓపిక, సహనం ఉండే బబితకు అవేవీ పెద్ద సవాలుగా మారలేదు. ఏ మాత్రం ఆత్రుత పడకుండా ప్రతి ప్రశ్నకు ప్రశాంతంగా సమాధానమిచ్చారు. అలా ఒక్కో రౌండ్ దాటుతూ వచ్చిన ఆమెకు ఆఖర్లో అసలైన.. ఆమెను కోటీశ్వరురాలు చేసే ప్రశ్న వచ్చేసింది. అందుకు కూడా ఆమె సమాధానం చెప్పేసింది. ఆ క్షణంలో ఆమె హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎందుకంటే బిగ్ బీ ఆమెను మరోసారి ఆలోచించుకోమని సూచించాడు. ఆ సమయంలో అందరిలోనూ నరాలు తెగ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సరిగ్గా అదే క్షణంలో బిగ్ బీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు బబితా భావోద్వేగానికి గురయ్యారు. అలా నెలకు రూ.1500 సంపాదించే బబితా ఆ క్షణం నుంచి కోటీశ్వరురాలిగా మారిపోయారు. కృషి ఉంటే మనిషి సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించారు.

ఇదంతా టీవీల్లో ఇంకా ప్రారంభం కాకముందే బబితా పేరు వైరల్ అయిపోయ్యింది. ఎందుకంటే ఇదంతా కేవలం ఆ ఛానెల్ ప్రోమోలో మాత్రమే వచ్చింది. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో 'ఆమె విజయం అద్భుతం', 'ఆమె అందరికీ స్ఫూర్తి' అని తెగ పొగిడేస్తున్నారు.

English summary

KBC 11: Lady Cook Babita Tade, Who Earns Rs 1,500 Per Month, Becomes The Second karodpati

About four hundred students cook for school every day. She's doing well at cooking kitchidi. The children are very fond of the kitchidi. She does not like going to bed everyday. That is why, like everyone else, she dreams of doing something special. Continually working hard for it. Meanwhile Kaun Banega has hit the door of her fortune from Karod Pati.
Desktop Bottom Promotion