Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్కార్న్తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
Womens Day 2023: మహిళల నిజాయితీపై షాకింగ్ రిపోర్టు, ఏం చెప్పిందంటే..
అప్పు ఇస్తే తిరిగి చెల్లించడంలో మగవారి కంటే ఆడవారే నిజాయితీగా ఉంటారని ఓ నివేదిక పేర్కొంది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగింది తెలిపింది.
అప్పు ఇచ్చే వాళ్లు మొదట ఏం చూస్తారు. వాడు తిరిగిస్తాడా లేదా అనేది ముఖ్యంగా చూసేది. తిరిగి ఇచ్చేవారికే, ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవారికే ఎవరైనా అప్పు ఇస్తారు. ఏమాత్రం అనుమానం ఉన్నా రుణం ఇవ్వడానికి వెనకాడతారు. ఇదే విషయంపై క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ తాజాగా ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో మగవారికి, ఆడవారికి మధ్య వ్యత్యాసం గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం మగవారి కంటే ఆడవారికి అప్పు ఇవ్వడాన్ని బ్యాంకులు, ఫిన్ కంపెనీలు తక్కువ రిస్క్ గా భావిస్తున్నాయని, అప్పు ఇస్తే తిరిగి చెల్లించడంలో మగవారి కంటే ఆడవారే నిజాయితీగా ఉంటారని పేర్కొంది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగింది తెలిపింది. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటించింది.

మగవారి కంటే ఆడవారే బెటర్:
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్ కంపెనీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి కట్టే విషయంలో భారత్ లో పురుషుల కంటే మహిళలే నిజాయితీగా ఉంటారని, మనస్సాక్షిగా ఉంటారని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక వెల్లడించింది. మహిళలు తిరిగి చెల్లిస్తారు, చెల్లిస్తున్నారు కాబట్టే గత ఐదేళ్లలో వారికిచ్చే రుణాల మొత్తం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది.
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో మహిళలకు ఇచ్చే రుణాల రేటు 15 శాతం పెరిగింది. పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని ఈ గణాంకాలే చెబుతున్నాయని పేర్కొంది.
ప్రస్తుతం, దేశీయ అంచనా జనాబా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉండగా.. వారిలో 2022 నాటికి 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉండగా.. అది 2022 నాటికి 14 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా చాలా పురోగతి సాధించాల్సి ఉందని తెలిపింది.

మహిళా రుణాలు పెరగడం సానుకూల సంకేతం:
మహిళలు రుణాలు తీసుకోవడం పెరగడం ప్రభత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్ యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అన్నారు. వివిధ సామాజిక, ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు, భౌగోళిక ప్రాంతాల్లో మహిళలకు రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో ససహాయపడుతుందన్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనకబడిన రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఐదేళ్లలో 3 రెట్లు పెరిగిన మహిళా వ్యాపార రుణాలు:
2017 నుండి 2022 మధ్య వ్యాపార రుణాలు కోరుతున్న మహిళల సంఖ్య 3 రెట్లు పెరిగింది. పెరుగుతున్న రుణాల సంఖ్య దేశంలో మహిళల నేతృత్వంలోని స్టార్టప్ ల వృద్ధికి ప్రతిబింబమని నివేదిక పేర్కొంది. దీంతో పాటు గృహ రుణ విభాగంలో కూడా మహిళల సంఖ్య పెరిగింది. గృహ రుణ విభాగంలో గత ఐదేళ్లలో మహిళల భాగస్వామ్యం 6 శాతం పెరిగింది.
మహిళలు వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు, బంగారు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications