Just In
Don't Miss
- News
ప్రచారాల్లో మంత్రుల ఫోటోలు కట్... సీఎం ఫోటో మాత్రమే ఉండాలి... సీఎంవో ఆదేశాలు
- Movies
చారిత్రక సినిమాకు షాక్: బూతు సినిమాకు భారీ రెస్పాన్స్.. రికార్డులు బద్దలైపోతున్నాయి
- Sports
నోట్బుక్ సెలబ్రేషన్.. ఎందుకు చేసాడో చెప్పిన కోహ్లీ!!
- Finance
ఆటో ఊరట: 9 నెలల తర్వాత మారుతీ సుజుకీ ఉత్పత్తి పెరిగింది, ఎంతంటే?
- Technology
ఆపిల్ వాచీల కోసం కొత్త ఫీచర్, చిర్ప్ 2.0
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మహాభారతం నుండి నేర్చుకోదగిన పాఠాలు: ఈ 6 లక్షణాలను కలిగి ఉండని కుటుంబం ఎన్నటికీ సంతోషంగా ఉండలేదు!
సంతోషకరమైన కుటుంబానికి వెనుకగల రహస్యాలు ..
విదురుడు, పాండు రాజు మరియు ధృతరాష్ట్ర త్రయంలో పెద్దగా విదురుడు భావించబడుతాడు. అతని తల్లిదండ్రులలో ఎవరిదీ రాజ రక్తం కానందున, రాజ బంధువుగా ఎన్నడూ గుర్తించబడలేదు. కానీ, అతను పాండురాజు మరియు ధృతరాష్ట్రుల వలెనే ఒకే విధమైన విధానం ద్వారా జన్మించినందున, అతను వారి అన్నయ్యగా గుర్తించబడ్డాడు. విదురుని పుట్టుక గురించిన సమగ్ర వివరాలకై, మహాభారతం ప్రధమ భాగాన్ని గమనించవలసి ఉంటుంది.
విదుర నీతి నుండి సంగ్రహించిన కొన్ని రత్నాల వంటి సూచనలు :
తన వయోజన జీవితాన్నంతా హస్తినాపుర ప్రధాన మంత్రిగా, మరియు ధృతరాష్ట్ర రాజుకు ప్రధాన సలహాదారునిగా పనిచేశారు. అంతకన్నా ఎక్కువగా, అంధుడైన ధృతరాష్ట్రునకు కళ్ళు, చెవులుగా తన సహాయ సహకారాలను అందించాడు. అతని జీవితంలో అడుగడుగునా అతనికి సమాచారం మరియు సలహా ఇవ్వడం అతని ప్రధాన కర్తవ్యంగా భావించేవాడు. మరియు అదే విశ్వాసాన్ని కొనసాగించి, అందరికీ ఆదర్శప్రాయునిగా నిలిచాడు. క్రమంగా తాను చేయగలిగినంత వరకు, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచేలా పాటు పడ్డాడు. అప్పటికీ దుర్యోధనుని గురించిన సూచనలను దృతరాష్ట్రునికి తెలియజేస్తూనే వచ్చాడు. కానీ మొక్కగా అణచలేని దృతరాష్ట్రుడు, మానుగా మారాక అచేతన స్థితిలో తన వంశ నాశనాన్ని చూడక తప్పలేదు. ఇదే ఉదాహరణగా సూచిస్తూ, విదురుడు కొన్ని సూచనలను రచనల ద్వారా తర్వాతి తరానికి అందేలా ప్రయత్నించాడు. అందులో కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం నుండి పరిపాలనా విధానాల వరకు ధర్మబద్దంగా నడుచుకొనుటకుగల అన్ని మార్గాలనూ పొందుపరిచాడు.

విదుర నీతి :
ధృతరాష్ట్రునితో ఆయన చేసిన సంభాషణలు, వ్యూహాలు, యుద్ధ వ్యూహాలు, కుటుంబ సమస్యలకు పరిష్కారాలు మొదలైనవి విదుర నీతికి జ్ఞానంగా సంకలనం చేయబడ్డాయి. అనేక సంభాషణలలో, చాలా ముఖ్యమైనదిగా, ధృతరాష్ట్రుని ప్రధమ కుమారుడైన దుర్యోధనుడి జన్మ ఉంటుంది. ఎందుకంటే, అతని జీవితాన్ని పరిపూర్ణంగా అద్యయనం చేసిన వ్యక్తులలో విదురుడు కూడా ఒకడు కాబట్టి. ఒక ఇంటి పెద్ద అసహాయంగా, అచేతన స్థితిలో ఉన్నప్పుడు, ఇంటి పెద్ద బాధ్యతలు తీసుకున్న వ్యక్తి అనుసరించే మార్గాల మీదనే కుటుంబ గౌరవం, మరియు ఉనికి ఉంటాయని దుర్యోధనుని ఉదాహరణగా తీసుకుని చెప్పాడు విదురుడు.

ఒక కుటుంబంలో ఉండాల్సిన సుగుణాలు :
వంశం మరియు రాజ్యం నాశనం కావడానికి ఎవరైతే కారణంగా మారుతారో, అటువంటి పిల్లవానిని వీలైనంత దూరంగా రాజ పదవికి, అధికారానికి, ఇంటి పెద్ద బాధ్యతలకు దూరంగా ఉంచమని, లేదంటే పూర్తిస్థాయిలో విడిచి పెట్టమని సూచిస్తాడు. కానీ, దృతరాష్ట్రుడు అందుకు నిరాకరించడంతో, విదురుడు సంతోషకరమైన కుటుంబాన్ని నిర్వహించగలిగే జ్ఞానాన్ని మరియు కీలకమైన సమయాల్లో వారిని ఏవిధంగా రక్షించుకోవచ్చునన్న అంశాల గురించిన వివరాలను అతనితో పంచుకున్నాడు.

కుటుంబం యొక్క ప్రాముఖ్యత :
విదుర దేవుని ప్రకారం, ఈ క్రింద పొందుపరచిన లక్షణాలను కలిగి ఉన్న కుటుంబం, ఆనందాన్ని ఎన్నటికీ చూడలేదు మరియు త్వరలోనే నాశనమవుతుంది. "భవిష్యత్తులో నష్టాన్ని కలిగించే లాభానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు" అని విదురుడు సూచించాడు.

# 1. కుటుంబాన్ని నియంత్రించడంలో పెద్దవారికి …
కుటుంబ పెద్దగా బాధ్యతను కలిగి ఉన్న వారు, వారి నియంత్రణలోనే కుటుంబం ఉండేలా బంధాలను కలిగి ఉండాలి. అతను / ఆమె వారి కుటుంబాన్ని నిర్వహించడానికి మరియు బంధాలను పటిష్టం చేయడానికి బాధ్యత వహిస్తారు. వారు అలా చేయడానికి నిరాకరించినా, అటువంటి బంధాన్ని కలిగి లేకపోయినా, ఆ కుటుంబం శిథిలావస్థకు చేరుకొనక తప్పదని విదురుడు వివరించాడు. అదేవిధంగా, ఇంటి పెద్ద మరణం తరువాత, వారి తర్వాతి స్థానంలో ఉన్నవారు కుటుంబ బాధ్యతలను తీసుకొనుటకు నిరాకరించిన ఎడల, ఆ కుటుంబాన్ని దేవుడు కూడా కాపాడలేడని చెప్పబడుతుంది.

# 2. తగాదాలను పరిష్కరించుకోగలగడం :
ఒక కుటుంబం మరియు వంశం యొక్క శ్రేయస్సు కోసం కృషి చేయకుండా, కుటుంబంలోని ఇతర సభ్యులతో ఎల్లప్పుడూ గొడవలు పడుతూ, శాంతికి విఘాతం కలిగించే వ్యక్తిని పక్కకు తప్పించాలి లేదా వదిలివేయాలి. అటువంటి వ్యక్తులు కుటుంబానికి ప్రతికూల ఫలితాలను తీసుకుని వస్తారు. దుర్యోధనుని విషయంలో కూడా పలుమార్లు దృతరాష్ట్రునకు విదురుడు సూచించాడు. కుమారుడన్న మమకారంతో చూసీ చూడనట్లు వ్యవహరించిన నేపధ్యంలో వంశ నాశనానికి కారకుడయ్యాడు.

# 3. యుక్త వయసు పిల్లలపై ప్రేమ మరియు సంరక్షణ ...
యుక్త వయసులో ఉన్న వారి పట్ల ప్రేమ మరియు శ్రద్ధ వహించడమనేది కుటుంబంలోని పెద్దల ప్రధాన బాధ్యతగా ఉంటుందని విదురుడు సూచిస్తాడు. కానీ ఇవన్నీ నిస్వార్థంగా ఉండాలి. ఇది కుటుంబంలోని పురుష సభ్యుల విధిగా ఉంటుంది, అతని వంశంలోని యుక్త వయసు పిల్లలతో కలిసి తినడం, చర్చించడం మరియు వారిని ప్రేమించడం, వివాదాలు రాకుండా చూసుకోవడం అతని ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది.

# 4. అవినీతి స్వభావాన్ని కలిగి ఉన్న వ్యక్తులతో పోరాడేలా ..
ఒక కుటుంబం లేదా వంశంలో ఇతరుల చర్యలను ఖండించడంలోనే నిమగ్నమై, ఇతరులను కించపరిచే అవకాశాల కోసం ఎదురుచూసే వ్యక్తి ఒకరైనా ఉంటారు. అటువంటి వ్యక్తులు అవినీతిపరులుగా ఉంటూ, కుటుంబ శ్రేయస్సు గురించి ఎటువంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. సమస్యను మొక్కగా ఉన్నప్పుడే గుర్తించి, మానుగా పెరిగి కుటుంబాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించే లోపునే ఆపడం తెలివైన పనిగా ఉంటుందని సూచించబడుతుంది.

# 5. తప్పులు మరియు పాపం మధ్య తేడాను గుర్తించడం..
ఒక కుటుంబంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి, కాని పాపం నుండి తప్పులను వేరు చేయడం దృష్ట్యా, ఏ సమయంలోనైననూ గుడ్డిగా ఉండకూడదు. కుటుంబ సభ్యుల ఇటువంటి చర్యలను ఒకరినొకరు లేదా సమాజం నుండి దాచడంలో అంగీకరించడం మరియు సహాయం చేయడం వంటివి కుటుంబం యొక్క ప్రధాన సారాన్ని నాశనం చేస్తుంది మరియు కుటుంబ నాశనానికి దారితీస్తుంది.

# 6. దుష్టత్వానికి పరాకాష్ఠ..
ప్రయోజనాలు కొనసాగే వరకు మాత్రమే ఒక దుష్ట వ్యక్తి యొక్క ప్రేమ మరియు మంచి ఉద్దేశాలు ఉంటాయని విదురుడు హెచ్చరించాడు; మరియు ఎటువంటి ప్రయోజనం ఉన్నా/లేకపోయినా, ఇటువంటి వ్యక్తి కుటుంబం యొక్క శ్రేయస్సు లేదా ఆనందం కోసం ఆందోళన చెందడు, మరియు కుటుంబం యొక్క శాంతి మరియు ఆనందాల గురించిన ఆలోచన చేయడు.

#7 కుటుంబ పరీక్ష..
విదురుడు ఒక కుటుంబం యొక్క ఆనందం స్థాయిలని అంచనా వేయడానికి ఒక సాధారణ పరీక్షను వివరిస్తాడు; ఇది కుటుంబంలోని తల్లి ఉనికి, వారు నివసించే ఇల్లు, వారు తమ అతిథులను పలకరించడం మరియు స్వాగతించడం, వారి ఆహారపు అలవాట్లు మరియు వారు ధరించే బట్టలు వంటి అనేకరకాల విలాసాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, మాతృత్వ, శిశు సంక్షేమ, జీవన శైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.