Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
ఈ రాశుల వారికి ఈనెల ప్రేమలో అనుకూలమా.. ప్రతికూలమా..
16 ఏళ్ల వయసులోనే తమ సహచరులను కలుసుకుంటారు. ఐదేళ్ల తర్వాత వివాహం చేసుకునే అవకాశం ఉంది.
2019 సంవత్సరం మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. స్థిరమైన మార్పు మరియు గ్రహాల కదలిక గ్రహాల మీద తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నవంబర్ నెలలో మీ ప్రేమకు సంబంధించిన జీవిత జాతక చక్రం గురించి తెలుసుకోండి.

హిందూ క్యాలెండర్ ప్రకారం, నవంబర్ నెలలో మూడు రాశి చక్రాలకు గ్రహాల కదలిక లేదా మార్పు కారణంగా ప్రేమ విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఇంకోవైపు మరో మూడు రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావం కనబడుతోంది. ప్రేమకు సంబంధించిన వివరాలన్నింటినీ పూర్తిగా తెలుసుకునేందుకు ఈ రాశి చక్రాల కథనాన్ని చూడండి.

మేషరాశి..
16 ఏళ్ల వయసులోనే తమ సహచరులను కలుసుకుంటారు. ఐదేళ్ల తర్వాత వివాహం చేసుకునే అవకాశం ఉంది. వీరు ఎప్పటికైనా సంతోషంగా జీవించడానికి సిద్ధంగా ఉంటారు. మీరు కొన్నిసార్లు మీ భాగస్వామి హార్ట్ బ్రేక్ చేస్తారు. కానీ మీరు జీవిత పాఠాలు నేర్చుకోవడానికి సహాయపడ్డారని మాత్రం గుర్తంచుకోండి. మీరు మంచి వ్యక్తిగా మారడానికి కూడా వారు సహాయం చేస్తారు. అపరాధం వల్ల ఇదంతా జరుగుతుంది. ఈ రాశిలోని కొందరు ప్రేమ కోసం అన్వేషణ మొదలు పెడతారు. రోజులు గడిచేకొద్దీ మెరుగవుతారు.

వృషభరాశి..
ఈ రాశి వారికి ఈనెలలో ప్రేమ అంత సులభం కాదు. మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. మిమ్మల్ని అనేక విధాలుగా బాధపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారిలో కొందరు కలిసి ఉండటానికి కష్టమని, విడిపోవడానికి సిద్ధం కావచ్చు. కానీ విడిపోయే అవకాశాలు సులభం కాదు.

మిధున రాశి..
ఈ రాశి వారు గతంలో చేసిన పొరపాట్లను మరియు పాత గాయాల వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే క్షమాపణ అనేది చాలా మంచి పదం. ఇది జంటలను కలపడానికి సులభంగా వీలు కల్పిస్తుంది. మనకు విముక్తి కలిగించే దారులు ఎన్నో ఉన్నాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఈ నెలలో గతాన్ని తలచుకుని బాధపడతారు. మీరు కోరుకున్న విధంగా జరగకపోవడానికి ఇది ఒక కారణం అవుతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా మీరు కవిత్వం మరియు గద్యం వైపు తిరగండి. మీ మార్గంలో మంచి విషయాలు వస్తాయని నమ్మండి.

సింహా రాశి
ఈ నెలలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీరు ఊహించని విధంగా మీ ఉద్దేశ్యం సాధ్యమైనంత ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రేమ బలం మరింతగా పెరుగుతుంది. మీరు మీ భాగస్వామి మనసును కదిలించడం అనేది మీకు చాలా సాధారణ విషయం. ఈ రాశి వారిలో కొందరు మూడు ముళ్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు.

కన్యా రాశి
మీ ప్రేమ జీవితంలో ఈనెలలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, మీరు మీ భాగస్వామిని వదులుకునే మానసిక స్థితిలో లేరు. మీలో కలిగే మార్పులను స్వీకరించడం కొనసాగించండి. మీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని అర్థం చేసుకోండి. శృంగారభరితంగా ఉండటానికి మీకు అవకాశం రావచ్చు. కానీ మీరు వర్తమానంలో ఉన్నామని గుర్తించాలి.

తులా రాశి
మీరు ఈ నెలలో మీరు ఇష్టపడుతున్న వారిని ధైర్యం చేసి ప్రేమ విషయం గురించి అడుగుతారు. మీకు అనుకూల సమాధానం రావచ్చు. మీ కలల జీవితాన్ని నిజం చేసుకునేందుకు దగ్గర్లో ఉన్నారు. మీ సంకల్పం పరీక్షింపబడుతుంది.

వృశ్చిక రాశి..
ఈ నెలలో ప్రేమ విషయంలో మీరు పురోగతి సాధించడానికి సమీపంలో ఉన్నారు. ఈ రాశి వారిలో కొందరు కొత్త సంబంధం లేదా మీ ప్రస్తుత సంబంధం యొక్క కొత్త దశలో ప్రవేశించవచ్చు.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి ప్రేమ విషయంలో మంచి జరిగేందుకు కొంత సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఆనందం, ప్రేమ, మరియు సమైక్యత యొక్క అద్భుతమైన ప్రదేశం వైపు వెళ్లడం ప్రారంభిస్తారని నమ్మండి.

మకర రాశి
ఈ రాశి వారిలో కొందరు ఈ నెలలో చాలా విషయాలలో ఘర్షణ పడొచ్చు. అంత మాత్రాన ప్రేమ మరియు రిలేషన్ షిప్ పట్ల నిబద్ధత బలంగా లేదని దీని అర్థం కాదు. ఇది టీ కప్పులో తుఫానులా మాయమవుతుంది. వీటి కోసం పరిష్కార మార్గాలను కనుగొనండి. పరస్పర అవగాహనతో మీ ప్రేమ మరింత బలోపేతమవుతుంది.

కుంభ రాశి
ఈ రాశి వారు ఈనెలలో ఏదైనా అవాస్తవ అంచనాలను వేస్తుంటే వదిలేయండి. మీరు సొంతంగా పైకి రావడంపై దృష్టి పెట్టండి. అది ప్రేమ విషయం అయినా సరే లేదా ఇతర ఏ విషయంలో అయినా సరే.

మీన రాశి
ఈ రాశి వారు ఈ నెలలో ప్రేమ విషయానికి సంబంధించి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అంతమాత్రాన భావోద్వేగాలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్నదానికి మీ భాగస్వామితో జత చేయండి. మీరు కూడా సంబంధానికి కట్టుబడి ఉంటే ఒంటరితనం నుండి బయటపడతారు.



Click it and Unblock the Notifications