Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
చంద్ర గ్రహణం 2020 : ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయట...!
చంద్ర గ్రహణం సమయంలో మిధున రాశి వారికి ఒక విశేషం ఉండబోతోంది. ఎందుకంటే చంద్రుడు మిధునంలో ఉండబోతున్నాడు. ఈ గ్రహణం యొక్క ప్రభావాలు ఈ రాశి చక్రం వారిపై ఎక్కువగా ఉంటాయి.
ఆంగ్ల నూతన సంవత్సరంలోని తొలి నెలలో భారతదేశంతో పాటు యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలో కూడా చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపించనుంది. 2020 సంవత్సరంలోని తొలి నెల అయిన జనవరి 10వ తేదీన ఈ చంద్ర గ్రహణం ప్రారంభమవ్వనుంది.

ఈ గ్రహణం సుమారు నాలుగు గంటలకు పైగా ఉంటుంది. ఇది జనవరి 10వ తేదీ రాత్రి 10:37 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు అర్ధరాత్రి ఇంగ్లీష్ కాలమానం ప్రకారం జనవరి 11వ తేదీ 2:42 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్ర గ్రహణం ఈసారి తొలిసారిగా మన దేశంలో ముందుగా కనిపించనుంది.

ఈ గ్రహణం పూర్తయ్యాక జూన్ 5, జులై 5వ తేదీ మరియు నవంబర్ 30వ తేదీన జరుగుతుంది. చంద్ర గ్రహణం మీ రాశి చక్రంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరియు అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

మేష రాశి...
చంద్ర గ్రహణం మేష రాశి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల వారి శక్తి పెరుగుతుంది. కానీ ఈ చంద్ర గ్రహణం సమయంలో కుటుంబంలోని ఎవరో ఒకరు ఇబ్బంది పడే అవకాశం ఉంది.

వృషభ రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరితో అయినా చర్చలో పాల్గొంటే ఆచితూచి మాట్లాడాలి.

మిధున రాశి..
చంద్ర గ్రహణం సమయంలో మిధున రాశి వారికి ఒక విశేషం ఉండబోతోంది. ఎందుకంటే చంద్రుడు మిధునంలో ఉండబోతున్నాడు. ఈ గ్రహణం యొక్క ప్రభావాలు ఈ రాశి చక్రం వారిపై ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మిధున రాశి వారికి చంద్ర గ్రహణం మంచిది కాదు. వారు మానసిక ఒత్తిడి లేదా కుటుంబ కలహాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి..
చంద్ర గ్రహణం కర్కాటక రాశి వారిని కూడా బాగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఎలాంటి కారణం లేకుండా ప్రయాణించాల్సి ఉంటుంది.

సింహ రాశి..
చంద్ర గ్రహణం సింహ రాశి చక్రాల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంతే కాకుండా, నిధులు పొందడానికి అనేక కొత్త వనరులు కూడా వస్తాయి.

కన్య రాశి..
ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్ర గ్రహణం వల్ల కన్య రాశి వారికి మిశ్రమ ప్రభావాలను చూపుతుంది. ఈ కాలంలో వారి ఆరోగ్యాన్ని చూసుకోవాలని మరియు ఎలాంటి నిర్లక్ష్యాన్ని అయినా నివారించాలని వారికి సూచించారు.

తుల రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల ఎలాంటి ప్రత్యేకత ఉండదు. పైగా మీ పనిని కూడా చెడగొడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు మీ ఇంటి సభ్యుడితో వివాదం పెంచుకోవచ్చు.

వృశ్చిక రాశి..
చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్రయాణించే సమయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి..
ఈ ఏడాదిలో వచ్చే తొలి చంద్ర గ్రహణం ధనస్సు రాశి వారి రిలేషన్ షిప్ పై ప్రభావం చూపవచ్చు. మీ కుటుంబం లేదా మీ వ్యాపార భాగస్వామితో గొడవ జరగొచ్చు.

మకర రాశి..
ఈ చంద్ర గ్రహణం మకర రాశి వారికి చాలా మంచిది. వీరు శత్రువును సులువుగా ఓడిస్తారు. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం చాలా పవిత్రంగా ఉంటుంది. సంబంధం విషయంలో సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో, కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా గందరగోళంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం నుండి మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ మీరు వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. అయితే భూమి లేదా ఆస్తికి సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications
