Latest Updates
-
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
Makara Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత'ఏడాదిలో మకర రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా మకర రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని గంటల్లో వీడ్కోలు పలకబోతున్నాం. అదే సమయంలో తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-9, వ్యయం-2
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం ఎక్కువగా లభిస్తుంది. మరోవైపు మీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. కొత్త ఏడాదిలో చాలా డబ్బును ఆదా చేస్తారు. ఉత్తరాషాడ నక్షత్రం 2,3,4 మూడు పాదాలు, శ్రవణ నక్షత్రం 1,2,3,4 నాలుగు పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 రెండు పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలుంటాయి.

రాజపూజ్యం-2, అవమానం-4
ఈ ‘శుభకృత్' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి
సమాజంలో గౌరవం కంటే కొంత ఎక్కువ అవమానాలే ఎదురవుతాయి. గురు గ్రహం అనుగ్రహంతో ఆదాయం మంచిగా లభించినప్పటికీ.. జీవితంలో సుఖంగా ఉండకపోవచ్చు. మీ జీవిత భాగస్వామి తరపున వారి కోసం ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అలాగే వారి నుండే అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సానుకూల విషయమేటంటే.. ఎన్ని ఖర్చులు పెరిగినా.. అవసరానికి తగిన డబ్బు సమకూరుతుంది.

శని ప్రభావంతో..
ఈ రాశి వారిలో శని గ్రహం ప్రభావం వల్ల చిన్నారులకు తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో కష్టాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా ఈ ఏడాది ప్రతికూల ఫలితాలొస్తాయి. ఈ ఏడాదిలో మిత్ర విరోధాల వల్ల మీరు ఒంటరిగా మిగిలిపోవచ్చు. నల్లని రంగు వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ తెలుగు నూతన సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శని దశ ఉంటుంది. ఈ కాలంలో భారీ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.

రాహువు ప్రభావం వల్ల..
ఈ సంవత్సరం రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ స్థానాలను మారడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావొచ్చు. పెద్ద వయసు వారికి మతిమరుపు వంటి సమస్యలు పెరుగుతాయి. వివాహితులకు సంతానం గురించి కొంత ఆందోళన పెరుగుతుంది. మీ బంధువులతో కొన్ని విషయాల్లో విభేదాలు రావొచ్చు.

కేతు ప్రభావం వల్ల..
ఈ రాశి వారికి ఈ ఏడాది కేతు ప్రభావం వల్ల శుభ ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యాపారులకు ఊహించిన మేరకు ఫలితాలొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. మొత్తం మీద ఈ ఏడాది గురువు, కేతువు గ్రహాల వల్ల మీకు శుభ ఫలితాలు రానున్నాయి.

పరిహారాలివే..
మకర రాశి వారికి ఈ ఏడాది ఏలి నాటి శని దశ కొనసాగుతోంది కాబట్టి.. పరిహారం కోసం తమిళనాడులోని తిరునల్వార్ వెళ్లి శనీశ్వరుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి లేదా మహారాష్ట్రలోని శనిసింగ్నాపురానికి వెళ్లి అభిషేకం నిర్వహించాలి. అదే విధంగా శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు జరిపించాలి. అలా వెళ్లడానికి కుదరని వారు నిత్యం గణపతిని ఆరాధన చేస్తూ.. కనకదుర్గ ఆలయానికి వెళ్లి మంగళవారం, శనివారం రోజున కుంకుమ పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభప్రదమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications
