Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Mars Combust 2021:కుజుడు కనుమరుగు కావడంతో ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!
అంగారకుడు ఆగస్టు 17 నుండి 29 నవంబర్ వరకు అస్తమయం కావడం వల్ల రాశిచక్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో అంగారకుడి(కుజుడు)కి ఎంతో ప్రత్యేకత ఉంది. కుజుడిని క్రూరమైన గ్రహంగా, మరోవైపు ధైర్యానికి, శక్తికి కారణమైన గ్రహంగానూ పరిగణిస్తారు. అంగారకుడిని గ్రహాల కమాండర్ గా కూడా భావిస్తారు.

ఈ కుజుడు ఆగస్టు 17వ తేదీ అంటే మంగళవారం నుండి నవంబరు 29వ తేదీ వరకు కనుమరుగు కానున్నాడు. ఈ సమయంలో అంగారకుడు సింహ రాశిలో సెప్టెంబరు ఆరో తేదీన నిష్క్రమించనున్నాడు. అనంతరం కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఆ తర్వాత అక్టోబరు మాసంలో తులరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశి చక్రాలకు ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. కుజుడు కనుమరుగు కావడం వల్ల చాలా మంది వ్యక్తుల లీడర్ షిప్ లక్షణాలపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో అలాంటి వ్యక్తులు కొన్ని పరిహారాలు పాటించాలి. ఈ సందర్భంగా అంగారకుడి అస్తమయం వల్ల ఏయే రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడు కనుమరుగు కావడం వల్ల ఈ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా ముందుకు సాగదు. పైగా ఫలితం ప్రతికూలంగా వస్తుంది. దీంతో మీరు చాలా నిరుత్సాహం చెందుతారు. పెద్ద పదవుల్లో ఉండే వారికి వారి శక్తి, సామర్థ్యాలపై కొంత సందేహం కలుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. అలాగే కుజుడు కనుమరుగయ్యే సమయంలో మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. దీని వల్ల మీకు జీవితంలో మంచి ఫలితాలొస్తాయి.

సింహ రాశి..
ఇప్పటివరకు కుజుడు సింహ రాశిలోనే నివాసం ఉంటున్నాడు. ఆగస్టు 17వ తేదీ నుండి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు కూడా ఇదే రాశిలో ఉంటాడు. ఈ కారణంగా మీకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే కష్టమైన పరిస్థితుల నుండి మీరు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు రాగి గ్లాసులో నీరు తాగితే అంగారకుడు బలహీన స్థితిలో ఉన్నప్పటికీ మీరు జీవితంలో మంచి ఫలితాలను పొందొచ్చు.

కన్య రాశి..
ఆగస్టు 17వ తేదీ నుండి అంగారకుడు అస్తమయం కానున్నాడు. ఈ సమయంలో ఈ రాశి నుండి 12వ స్థానంలో ఉంటాడు. మళ్లీ తిరిగి సెప్టెంబరు మాసంలో వస్తాడు. ఈ కారణంగా మీకు ధైర్యం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రమాదకర పనులు చేయకుండా ఉండాలి. వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలతో సంబంధం ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీకు శుభ ఫలితాలు రావడానికి మీ కుడి చేతికి రెడ్ కలర్ దారం కట్టుకోండి.

తుల రాశి..
ఈ రాశి వారికి అంగారకుడి అస్తమయం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో గొడవలు మరింత పెద్దగయ్యే ప్రమాదం ఉంది. మీ తోబుట్టువుల ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు జర్నీ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. మీ వాహనాన్ని నెమ్మదిగా నడపాలి. ఈ కాలంలో మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. అలాగే ‘ఓం క్రాం క్రీం క్రౌ సఃభౌమాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

వృశ్చిక రాశి..
కుజుడు కనుమరుగు కావడం వల్ల ఈ రాశి వారు వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు ముఖ్యమైన చర్చలకు దూరంగా ఉండాలి. లేదంటే సమాజంలో మీ గౌరవం దెబ్బ తింటుతుంది. మీ పరువుకు భంగం కలుగుతుంది. అంతేకాదు ఈ రాశి ఉద్యోగులు ఈ కాలంలో కార్యాలయంలో సైతం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసు పాలిటిక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో మీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది. మీ జీవితంలో శుభ ఫలితాల కోసం మంగళవారం రోజున ‘హనుమాన్ చాలీసా'ను పఠించండి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి కుజుడు కనుమరుగు కావడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో గొడవలు పెట్టుకోవద్దు. చాలా ప్రశాంతంగా ఉండండి. వీలైనంత మేరకు కోపం తగ్గించుకోండి. భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్న వారు కూడా తమ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఈ కాలంలో మంచి ఫలితాల కోసం రెండు అరచేతులతో ఇంటి పెద్దల పాదాలను తాకడం వల్ల మీకు కుటుంబ జీవితంలో శుభఫలితాలొస్తాయి.



Click it and Unblock the Notifications