For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mangal Gochar 2022:మేషంలోకి కుజుడి రవాణాతో ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే..!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రతి నెలలో నవ గ్రహాలలో ఏదో ఒక గ్రహం తమ స్థానాన్ని మారుతూ ఉంటాయి. ఇలా తమ రాశిని మారిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ప్రతి ఒక్క గ్రహం దాని స్వభావాన్ని బట్టి శుభ ఫలితాలను మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది. అయితే అన్ని గ్రహాలలో అంగారకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు.

ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో జూన్ 27వ తేదీన అంటే సోమవారం రోజున ఉదయం 5:39 గంటలకు కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారిలో ఏ రాశుల వారిపై సానుకూల ప్రభావం ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మేష రాశిలో రాహువు కూడా సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావం మేషరాశిపై ఎక్కువగా ఉంటుంది. దీన్నే అంగారక యోగం అని కూడా అంటారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం సమయంలో ఖర్చులు పెరగొచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈ కాలంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు మీపై కుట్ర పన్నినా మీరు విజయం సాధిస్తారు. తోబుట్టువులతో మాట్లాడుతున్నప్పుడు వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో గొడవలకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి హనుమంతుడిని ఆరాధించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవెరే బలమైన అవకాశం ఉంది. మీరు ఏదైనా పనిలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంటే కచ్చితంగా గెలుస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి అంగారకుడి సంచారం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీరు ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనేక రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందొచ్చు. చాలా కాలంగా పెండింగులో ఉన్న భూ వివాదం ముగిసే అవకాశం ఉంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు అనేక లాభాలు రావొచ్చు. మీరు వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టుబడి నుండి లాభం పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులకు ఈ సమయం మంచిగా ఉంటుంది.ఎలాంటి క్లిష్టమైన పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైన వారికి మంచి ఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి అంగారకుడి సంచారం సమయంలో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు పొదుపుగా మరియు తెలివిగా తినాలి. మసాలా మరియు జంక్ ఫుడ్ ఇతర జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఈ సమయంలో కెరీర్ మరియు కుటుంబ జీవితం కూడా అస్థిరంగా ఉంటుంది. మీ సోదరులు మరియు సోదరీమణుల మద్దతును పొందుతారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మీరు శక్తివంతంగా ఉంటారు. కానీ మీ ప్రయత్నాలు ఫలించవు. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా రాకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో కలహాలు మరియు వాదనలకు కారణం కావొచ్చు. కెరీర్ పరంగా మంచి సమయం ఉంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి అంగారక సంచారం సమయంలో ప్రతికూల సమస్యలు రానున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు పెరగొచ్చు. ఈ కాలంలో మీ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు ఖర్చులపై శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

కుజుడు మేషంలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మరోవైపు మీకు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో పురోగతి సాధించగలుగుతారు. ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఉత్తమ ఫలితాలను పొందుతారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి అంగారకుడి సంచారం వల్ల సంతోషం పెరుగుతుంది. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో ఆస్తిలో లాభం ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఈ సమయంలో కొత్త ఇంటిని కొనుగోలు చేయొచ్చు. అయితే మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల అన్ని రకాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ కారణంగా మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కెరీర్లో గొప్ప ఫలితాలను చూస్తారు. మీరు అనేక ఆహ్లాదకరమైన ప్రయాణాలకు అవకాశం పొందుతారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీరు కొత్త వాటిలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి అంగారకుడి సంచారం సమయంలో ఆదాయ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీరు ఈ కాలంలో ప్రయాణం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. ఈ టైమ్ లో ప్రారంభించిన పనిలో మీరు విజయం సాధిస్తారు. అయితే, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

English summary

Mars Transit in Aries on 27 June 2022 Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

Here we are talking about the Mars Transit in Aries on 27 June 2022, These zodiac signs get benefits in Telugu. Have a look
Story first published: Friday, June 24, 2022, 10:02 [IST]
Desktop Bottom Promotion