Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Martyrs' Day 2023: అమరవీరుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దాని వెనక చరిత్ర ఏంటో తెలుసా?
ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన అమరవీరుల దినోత్సవం(షహీద్ దివస్) జరుపుకుంటాం. ముగ్గురు యోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను లాహోర్ జైలులు ఇదే రోజున ఉరితీశారు.
ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన అమరవీరుల దినోత్సవం(షహీద్ దివస్) జరుపుకుంటాం. ఈ రోజున దేశంలోని స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటీషన్ నియంత్రణ నుండి దేశాన్ని విడిపించేందుకు వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటాం. ముగ్గురు యోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను లాహోర్ జైలులు ఇదే రోజున ఉరితీశారు. జె.పి. శాండర్స్ హత్య, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై దాడి కేసులో ఆ ముగ్గురిని ఉరితీశారు.

స్వాతంత్ర కాంక్షను రగిలించిన భగత్ సింగ్:
భరతమాతను బ్రిటిషర్ల చెర నుండి విడిపించడానికి, దేశ స్వాతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారుల్లో భగత్ సింగ్ ఒకరు. అందుకే ఆయనను షహీద్ భగత్ సింగ్‌గా కూడా పిలుస్తారు. 1907 సెప్టెంబరు 28వ తేదీన ప్రస్తుతం పాకిస్థాన్ లోని లాహోర్ లో భగత్ సింగ్ జన్మించారు.
చిన్న వయస్సు నుండే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. నౌ జవాన్ భారత సభ ద్వారా యువతను ఆకర్షించడమే కాకుండా వారిలో స్వాతంత్ర కాంక్షను రగిలించారు.
చిన్నతనంలోనే ఐరోపా విప్లవ ఉద్యమాల గురించి చదివారు. ఈ స్ఫూర్తితో హిందూస్థాన్ గణతంత్ర సంఘంలో ముఖ్య నాయకుల్లో ఒకడిగా ఎదిగారు.
ఆ తర్వాత ఈ సంస్థను హిందూస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంలా మార్చారు. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు. దీంతో భగత్ సింగ్ దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆయనకు విపరీతంగా అభిమానులు పెరిగారు.
షహీద్ దివస్ చరిత్ర:
పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి స్కాట్స్ ను హత్య చేయాలని భగత్ సింగ్ పథకం వేశారు. కానీ స్కాట్స్ అనుకుని మరో ఎస్ఐ శాండర్స్ ను హత్య చేశారు. 1929 ఏప్రిల్ 8వ తేదీన పార్లమెంట్ హాలులో బాంబు విసరడంతో భగత్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే తాము ఎవరినీ చంపడానికి బాంబు వేయలేదని, తమ స్వాతంత్ర్య కాంక్షను తెలియజెప్పడానికి మాత్రమే ఎవరూ లేని చోట, అత్యంత సాధారణ బాంబును విసిరేసినట్లు భగత్ సింగ్ న్యాయస్థానంలో చెప్పారు. ఈ బాంబు విసిరిన కేసులో భగత్ సింగ్ తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులు కూడా ఉన్నారు.
అయితే ఈ బాంబు దాడిని బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విచారణ తర్వాత వారికి ఉరిశిక్ష విధించింది. భగత్ సింగ్ ను కాపాడటానికి ఆయన తండ్రి చాలా కష్టపడ్డారు. కానీ ఆయన ప్రయత్నాలను భగత్ సింగ్ వద్దని చెప్పారు. మమ్మల్ని విడిచిపెట్టే ఉద్దేశం బ్రిటీష్ ప్రభుత్వానికి లేదని, అందుకే దొంగ సాక్ష్యాలు సృష్టించి విచారణను అత్యంత వేగంగా పూర్తి చేస్తోందని భగత్ సింగ్ ఆయన తండ్రికి చెప్పారు.
భగత్ సింగ్ ముందే ఊహించినట్లుగానే బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్ తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను మార్చి 23వ తేదీన ఉరితీసింది. సట్లెజ్ నది ఒడ్డున ముగ్గురి అంత్యక్రియలు జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మార్చి 23వ తేదీన షహీద్ దివస్ లేదా అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.



Click it and Unblock the Notifications