For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృశ్చికరాశిలోకి బుధుడి సంచారం... ఈ రాశుల వారికి సానుకూలం...!

వృశ్చికరాశిలోకి బుధుడి సంచారంతో ఏ రాశుల వారికి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవంబర్ 28వ తేదీ బుధుడు, తుల రాశి నుండి వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. అలా ప్రవేశించిన ఈ గ్రహం సుమారు డిసెంబర్ 17వ తేదీ వరకు అక్కడే సంచరించనున్నాడు.

Mercury Transit in Scorpio on 28 November 2020 Effects on Zodiac Signs in Telugu

బుధ గ్రహం తుల నుండి వృశ్చికంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం, విద్య, ఉద్యోగం వంటి రంగాల్లో చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

Mercury Transit in Scorpio on 28 November 2020 Effects on Zodiac Signs in Telugu

అయితే కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుధుడి సంచారం ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది... ఎవరెవరికి ప్రతికూలంగా ఉంటుంది.. ఎవరెవరు ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేషరాశి..

మేషరాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు మాత్రం కార్యాలయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ ఇంటి వాతావరణం చెదిరిపోతుంది. మరోవైపు శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : పేదపిల్లలకు అవసరమైన స్టేషనరీ వస్తువులను దానం చేయాలి.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానంలో కదలనున్నాడు. ఈ సమయంలో వృషభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. బుధ గ్రహ అనుగ్రహం వల్ల మీ పిల్లలతో మీరు ఆనందంగా గడుపుతారు. వారితో మీ బంధం బలంగా మారుతుంది. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే, లాభాలను పొందే అవకాశం ఉంది. మీ సంస్థ మరియు పరిపాలనా సామర్థ్యాలు పెరుగుతాయి మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. అయితే బయటి ఆహారం తీసుకోకుండా ఉండాలి.

పరిహారం : మీ కుడి చేతికి వేలికి ఉంగరం ధరించాలి. దీని వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం నుండి సంచరించనున్నాడు. ఈ సమయంలో మిధునరాశి వారికి శత్రువులు ఆటంకాలను ఏర్పరచే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదు. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

పరిహారం : సూర్యోదయం సమయంలో ప్రతిరోజూ శ్రీమహావిష్ణువుకు ప్రార్థనలు చేయండి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి విద్యార్థులలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కలలు నెరవేరొచ్చు. మరోవైపు తల్లిదండ్రులకు పిల్లల విషయంలో సంతోషంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధం బలోపేతం కావాలంటే మీరే చొరవ తీసుకోవాలి.

పరిహారం : సరస్వతి దేవికి ప్రార్థనలు చేయండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో స్థానం గుండా సంచరించనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన వాతావరణం ఉంటుంది. మీరు కొత్త పాత్రలు మరియు బాధ్యతలను నెరవేర్చుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు మరింత నమ్మకంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీలోని నాయకత్వ లక్షణాలు అందరికీ తెలుస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడం మంచిది. ఈ కాలంలో మీరు వాహనాలు మరియు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పరిహారం : మీరు బుధుడి యొక్క బీజ్ మంత్రాన్ని పఠించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం గుండా ప్రయాణించనున్నాడు. బుధుడి యొక్క ఈ స్థానం వల్ల కన్య రాశి వారికి ఏదైనా విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మీ జీవితంలోని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో విజయాన్ని తెస్తుంది. వ్యాపారులు కూడా ఈ సమయంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ వాతావరణంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున బంగారం ఉంగరం ధరిస్త శుభఫలితాలొస్తాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం గుండా సంచరించనున్నాడు. ఈ సమయంలో తులరాశి వారికి శుభఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదేస్థాయిలో పెరుగుతాయి. వ్యక్తిగతంగా, మీ కుటుంబసభ్యులతో ఎక్కువ గడిపేందుకు మీకు సమయం లభిస్తుంది. మీరు మీ కుటుంబంతో తీర్థయాత్ర లేదా ఏదైనా విహారయాత్రకు వెళ్లొచ్చు. వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం : తులసి మొక్కకు ప్రతిరోజూ నీరు పోసి పూజలు చేస్తే శుభఫలితాలొస్తాయి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

బుధుడు తుల రాశి నుండి వృశ్చికరాశిలోకి తొలి స్థానంలో ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిపరంగా మాత్రం మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మరోవైపు ఆరోగ్య పరంగా ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు యోగా, ధ్యానం వంటివి చేయాలి. దీని వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

పరిహారం : ఉద్యోగులు ప్రతిరోజూ కర్పూరం వెలిగిస్తే, ఆఫీసులో సానుకూల ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరగొచ్చు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ, బహుళజాతి కంపెనీలలో పని చేసేవారికి కొంత మంచి ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ వద్ద ఉన్న వనరుల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. మీ ముఖ్యమైన విషయాలకు ఎల్లప్పుడూ తగినంత ఆదాయం ఉండేలా చూసుకోవాలి.

పరిహారం : బుధవారం రోజున మీ సమీప ఆలయంలో తాజా కూరగాయలను దానం చేయండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి బుధుడు 11వ స్థానంలో నుండి ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారికి శుభప్రదమైన ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీ ఇంట్లో తోబుట్టువులు మరియు స్నేహితులకు చాలా ముఖ్యమైనది. ఉద్యోగులకు కొన్ని మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే మీరు ప్రయాణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల విషయంలో. చాలా కాలంగా పెండింగులో ఉన్న చట్టపరమైన విషయాలు కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మీరు గణేశుడిని స్తుతిస్తూ, గణేశ స్తోత్రాలను పఠిస్తే శుభఫలితాలొస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదో స్థానంలో కదలనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మీ ఆలోచనలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో శుభప్రదంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వారి ప్రయత్నాలలో విజయం సాధించే అవకాశం ఉంది.

పరిహారం : సూర్యోదయం సమయంలో ప్రతిరోజూ దుర్గాదేవిని ఆరాధించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు తోమ్మిదో స్థానం గుండా వృశ్చికంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీన రాశి విద్యార్థులకు మంచి ఫలితాలొస్తాయి. మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే, వారి కలలు నెరవేరొచ్చు. ఈ సమయంలో మీరు అధిక జ్ణానం పొందొచ్చు. వృత్తిపరంగా, మీరు కొన్ని కొత్త ఆదాయం వనరలు పొందుతారు. ఇవి మీకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు సహాయపడుతుంది. ఈ సమయంలో మీ శక్తి సానుకూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

పరిహారం : ప్రతి బుధవారం ఆవులకు పచ్చనిగడ్డి తినిపించాలి.

English summary

Mercury Transit in Scorpio on 28 November 2020 Effects on Zodiac Signs in Telugu

Mercury Transit in Scorpio Effects on Zodiac Signs in Telugu: The Mercury Transit in Scorpio will take place on 28 November 2020. Learn about remedies to perform in Telugu.
Desktop Bottom Promotion