Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
ఈ 4 రాశుల వారు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరట... మీ రాశి కూడా ఉందేమో చూడండి...
ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారు మొదటిచూపులోనే ప్రేమలో పడతారంట. అయితే అందులో వారు సక్సెస్ అవుతారా?
ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి యవ్వనంలో ప్రేమ పట్ల ఆకర్షణం కలగడం అనేది అత్యంత సహజమైన విషయం. అయితే ప్రస్తుత మారిన కాలం కారణంగా.. పరిస్థితుల ప్రభావం వల్ల తొలి ప్రేమ అనేది చాలా మందిలో చిన్న నాటి నుండే పుడుతోంది.

ఈ మధ్యన చాలా మంది అతి చిన్న వయసులోనే.. అది కూడా పాఠశాలకు వెళ్లే సమయంలోనే తమ ప్రేమ ప్రయాణాన్ని మొదలుపెడుతున్నారు. అయితే చాలా మందికి కళాశాలలో కొత్తగా తొలిసారిగా ప్రేమలో పడటం వంటివి జరుగుతూ ఉంటాయి.

అయితే ఇలా తొలిసారిగా ప్రేమలో పడిన వారంతా విజయవంతం అవుతారని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇందుకు ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన సమస్యలతో పాటు ఇంకా అనేక కారణాలు ఉన్నాయి.

అయితే అలా మొదలైన తొలి ప్రేమ ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా మరియు ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభవాలను ఇప్పటికే ఎంతో మంది అనుభవించి ఉంటారు. ఇలాంటి క్షణాలు మరచిపోలేనివి.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రేమ విషయానికొస్తే ద్వాదశ రాశులలో ప్రతి రాశి చక్రం వారి లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు తొలి ప్రేమను అస్సలు మరచిపోలేరు. వీరు జీవితాంతం తమ మొదటి ప్రేమను గుర్తుంచుకుంటారు. ఇంతకీ ఆ రాశి చక్రాలేవో మీరే చూడండి...

వృశ్చికరాశి..
ఈ రాశి వారికి ఉద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవ్వరినీ ఎక్కువగా నమ్మరు. ఇదే వీరికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అయితే వీరు ప్రేమ విషయానికొచ్చేసరికి, తొలి చూపులోనే వీరి మనసులో ప్రేమ వికసిస్తుంది. మొదటి ప్రేమను చాలా బాగా గడపాలని కలలు కంటారు. అయితే పొరపాటున ఆ ప్రేమ విఫలమైతే మాత్రం వీరి జీవితంలో తమ మనసులో మరొకరికి చోటు కల్పించడం అనేది దాదాపు కష్టమే. దీని వల్ల ఈ రాశి వారు తొలి ప్రేమను తమ జీవితాంతం గుర్తుంచుకుంటారట.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి భావోద్వేగం చాలా ఎక్కువ. ఈ రాశి చక్రం వారు తమ ప్రియమైన వారితో చాలా గాఢమైన సంబంధంలో ఉంటారు. అలా తొలి ప్రేమ అనుభవం వీరి జీవితంలో తీవ్ర భావోద్వేగ విలువను కలిగి ఉంటుందట. సాధారణంగా వీరు ఎవ్వరినీ ప్రేమించరు. కానీ ఒక వేళ ఎవరినైనా తొలిసారి ప్రేమిస్తే వారిని అస్సలు వదులుకోలేరు. ఎందుకంటే వీరు ప్రేమకు, బంధాలకు, అనుబంధాలకు, సంప్రదాయాలకు చాలా ఎక్కువ విలువ ఇస్తారట. అయినా కూడా ఒకవేళ వీరి ప్రేమ విఫలమైతే, వీరు అదే పాత విషయాలతోనే గడుపుతారు కానీ ఇంకొకరిని అస్సలు ఊహించుకోలేరు. అలాగే కొత్త వ్యక్తులను కూడా వీరు సులభంగా నమ్మరు. కొత్త వ్యక్తులతో కనీసం కలవడానికి కూడా అంతగా ఇష్టపడరు.

మీన రాశి..
ఈ రాశి వారికి సహజంగా శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయట. ఈ రాశి చక్రం ప్రేమ మరియు ప్రతి ఒక్క విషయంలో ఒక ఫాంటసీ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తుంటారట. వీరు ఎవరితో అయినా తొలి చూపులోనే ప్రేమలో పడినప్పుడు వీరు తమ ప్రియుడు/ప్రియురాలితో కలిసి తొలిరోజు రీలిజ్ అయ్యే సినిమాలకు, ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఏకాంతంగా గడిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారట. ఎందుకంటే ఒకవేళ వారి ప్రేమ విఫలమైతే, వీరు జీవితాంతం ఆ తీపి జ్ణాపకాలతో గడిపేస్తారట. వీరికి అవి జీవితాంతం గుర్తుండిపోతాయట.

వృషభ రాశి..
ఈ రాశి వారికి మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ లక్షణాల వల్లే వీరు ఎవరితో అయినా ప్రేమలో పడితే ఆ ప్రేమను మరచిపోయేందుకు వీరికి చాలా కష్టంగా ఉంటుందట. వీరు తొలి ప్రేమను ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే వీరు తొలి ప్రేమతో చాలా అంకితమైపోతారంట. వీరి ప్రేమను బలంగా మార్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నింటినీ చేస్తారట. అయితే ఈ రాశి వారు వీరి జీవితకాంలో ఎక్కువగా మొదటి చూపులోనే ప్రేమలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications
