Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఏప్రిల్ మాసంలో ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!
2021 ఏప్రిల్ లో ఈ రాశిచక్రాల వారికి ప్రతికూలంగా ఉంటుంది.
ఏప్రిల్ మాసం అంటేనే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఏప్రిల్స్ ఫూల్స్ డే. ఈరోజున ప్రతి ఒక్కరూ తమ టాలెంట్ తో.. తమకు తోచిన విధంగా అందరినీ ఫూల్ చేయాలని చూస్తుంటారు..

ఇదిలా ఉండగా ఈ ఏడాది 2021 ఏప్రిల్ మాసంలో బ్యాంకులకు ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం.. ఉద్యోగులకు వేతనం పెరుగుదల, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలవెన్సులు, కొత్త ప్రయోజనాలు, విద్యార్థులకు సెలవులతో పాటు మరెన్నో ప్రత్యేకతమైన విషయాలు ఏప్రిల్ మాసంలోనే ప్రారంభమవుతాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ మాసంలో పెద్ద మార్పులు జరగనున్నాయి. తొలి వారంలో బుధుడు తన దిశను మార్చుకోనున్నాడు. అనంతరం సూర్యుడు, అంగారకుడు, శుక్రుడు, గురుడు కూడా తన దిశలను మార్చుకోనున్నారు.

వీటి ప్రభావం చాలా రాశులపై నేరుగా పడనుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ మాసం చాలా ప్రతికూలంగా ఉంటుందట. ఆ రాశులేవో.. అందులో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు చూసెయ్యండి...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారు ఈ మాసంలో చాలా బిజీగా గడుపుతారు. ముఖ్యంగా మార్కెట్ ఫీల్డ్ లో ఉన్న వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా మీకు ఫలితం తక్కువగానే ఉంటుంది. మరోవైపు మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఏప్రిల్ మాసంలో మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు.. ఈ నెలాఖరులో మీ సమస్యలు మరింత పెరుగుతాయి. అయితే సూర్యుడి గ్రహంలోని మార్పు వల్ల ఈ రాశి వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఉత్సాహంతో.. ఆత్మవిశ్వాసంతో.. సంయమనంతో పని చేయడమే.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ శారీరక సమస్యలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్య పరంగా మీరు అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు తినే ఫుడ్ పై చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సాధారణంగా ఉంటుంది. మీ ఖర్చులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం కష్టంగా మారుతుంది. మీ తల్లిదండ్రులు, పిల్లల అధ్యయనంతో పాటు చాలా విషయాల్లో ఆందోళన చెందుతారు.

సింహ రాశి..
ఈ రాశి వారికి గ్రహాల పరివర్తనం వల్ల ఏ మాత్రం అనుకూలంగా ఉండదు. ఈ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకుంటే మీ కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. మరోవైపు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకోవైపు మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

కన్య రాశి..
ఏప్రిల్ తొలి వారంలో బుధుడు స్థాన దిశ మార్పు కారణంగా.. ఈ రాశి వారిపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు ఆర్థిక పరమైన విషయాల గురించి చాలా ఆందోళన చెందుతారు. మీ ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. విద్యార్థులు మీ అధ్యయనం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడినా మీకు ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది.

మకర రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి గ్రహాల పరివర్తనం కారణంగా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. గురుడు ఈ గ్రహం నుండి ఇతర రాశిలోకి ఆగమనం చేయడం వల్ల ఈ రాశి ఎక్కువ సమస్యలు ఉండకపోవచ్చు. కానీ మీ ఖర్చులు ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు బడ్జెట్ ను మించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలి. అదే విధంగా మీరు ఒక పద్ధతి ప్రకారం పని చేయాలి. లేకపోతే మీరు ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఏర్పడతాయి. మీరు మీ పిల్లల ఆరోగ్యంపై కూడా ఆందోళన చెందుతారు.



Click it and Unblock the Notifications