For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశ్వవిజేతగా రికార్డు సృష్టించిన తెలుగు తేజం పివి సింధు..

|

పసిడి కోసం పోరాడింది..

కానీ వెండితో వెలిగింది..

అంతకుముందు కాంస్యంతో కవర్ చేసుకుంది..

అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడింది..

చివరికి అనుకున్నది సాధించింది.

"సింధూ"రాన్ని స్వర్ణంగా మార్చేసింది..

PV Sindhu
 

ఎన్నోఏళ్లుగా స్వర్ణ పతకం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. ఇప్పటికే ఐదుసార్లు ప్రయత్నించింది. వరుసగా రెండుసార్లు కాంస్యాలతోనే కన్విన్స్ అయ్యింది. అంతకుముందు త్రుటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుంది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించింది. చివరికి పసిడి పతక లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది పివి సింధు.

అమ్మకు బర్త్ డే గిఫ్ట్..

ఫైనల్ లో విజయం అనంతరం ఉద్వేగంగా మాట్లాడింది. "ఎంత హాయిగా ఉందో చెప్పలేను. ఈ గెలుపు కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. గత ఏడాది రజత పతకంతో సరిపెట్టుకున్నా.. అంతకుముందు సంవత్సరం రజతమే వచ్చింది. ఎట్టకేలకు ఈసారి టైటిల్ సాధించా. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్వర్ణం లక్ష్యాన్ని సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాలను మాటల్లో చెప్పలేను. ఈ క్షణాలను బాగా ఎంజాయ్ చేస్తా" అని సింధు చెప్పింది.

ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికలపై తెలుగమ్మాయి తెగువను చూపింది. క్రికెట్ క్రీడనే ఎక్కువగా ఆరాధించే మన భారతదేశంలో ఏ ఒక్క క్రీడాకారిణికి ఇంతటి ఆదరణ, అభిమానం, అభినందనలు ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు కాలం మారింది. ట్రెండ్ సెట్ చేస్తున్న సింధుకు పిఎం మోడీ మొదలుకొని ప్రతి ఒక్కరు ప్రశంసల జల్లులతో ముంచెత్తుతున్నారు.

ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సాధించాలన్న సత్యాన్ని మన తెలుగమ్మాయి పివి సింధు అక్షరాల నిజం చేసింది. రెండేళ్ల క్రితం తన పసిడి లక్ష్యానికి అడ్డుపడిన ఒకుహరనే ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో చిత్తు చిత్తుగా ఓడించింది. తొలి రౌండ్ నుండే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ లో 21-7, 21-7 వరుస సెట్లలో సింధు రాకెట్ వేగంతో ఆడింది. దీంతో ఒకుహర నిస్సహాయురాలిగా మారిపోయింది. సింధు అసాధారణ నైపుణ్యానికి, తిరుగులేని అధిపత్యానికి ఇదే గొప్ప నిదర్శనం.

 

స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు..

విశ్వవిజేతగా నిలవడమే కాకుండా భారతదేశం తరపున రికార్డు సాధించిన తొలి మహిళగా పివి సింధు చరిత్ర సృష్టించింది. తన కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా అందుకోలేని అరుదైన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో తొలిసారి స్వర్ణం సాధించి మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది.

English summary

PV Sindhu Wins Gold Medal in Badminton World Championship 2019

Wherever we are lost, we know the truth of PV Indus letters. Okuharane defeated her toddler goal two years ago in a recent World Championship final. Playing aggressively from the first round, he hit his opponent irreparably. In the unilateral match, Sindhu played rocket speeds in straight sets of 21-7 and 21-7. This caused Okuhara to become helpless.
Story first published: Monday, August 26, 2019, 13:12 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more