Just In
Don't Miss
- News
హైదరాబాద్తోపాటు జిల్లాల్లో భారీ వర్షాలు: చల్లబడ్డ వాతావరణం, పిడుగుపాటుకు ముగ్గురు మృతి
- Sports
RR vs PBKS: సంజూ శాంసన్ సెంచరీ పోరాటం వృథా.. పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ.!
- Finance
Gold prices today: తగ్గిన బంగారం, వెండి ధరలు: ఐనా ఆ మార్కుకు పైనే
- Movies
ఉప్పెన తరువాత మొదటిసారి సరికొత్తగా దర్శనమిచ్చిన వైష్ణవ్ తేజ్.. న్యూ స్టైలిష్ లుక్!
- Automobiles
నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రక్షా బంధన్ స్పెషల్ : మీ రాశిని బట్టి మీ సోదరుడికి ఏ రంగు రాఖీని కట్టాలో తెలుసా...
మన దేశంలో హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఈ ఏడాది 2020లో ఆగస్టు 3వ తేదీన సోమవారం నాడు ఈ పండుగ వచ్చింది. రాఖీ అంటే 'రక్షణ' అని అర్థం. 'రక్ష' అంటే రక్షించడం, 'బంధన్' సూత్రం కట్టడం అని అర్థం. సోదరీమణులందరూ తమ సోదరలు ఏ పని చేసినా అందులో విజయం దక్కాలని, తమ సోదరుడు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ సన్నటి దారాన్ని ఎర్రటి తోరణానికి చుట్టి రాఖీని తయారు చేసి, వారి చేతులకు కడతారు.
అయితే ఇదంతా ఒకప్పుడు. మరిప్పుడు చాలా మంది మహిళలు తమ అన్నదమ్ములకు రంగు రంగుల కడుతున్నారు. ఈ ఏడాది కరోనా సమయంలోనూ కలర్ ఫుల్ రాఖీలు కట్టాలని తహతహలాడుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఏ కలర్ రాఖీ మీ సోదరుడికి సూట్ అవుతుందో తేల్చుకోలేకపోతున్నారా? అయితే అందుకు జ్యోతిష్యశాస్త్రం సహాయపడుతుంది. మీ రాశి చక్రం ఆధారంగా మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కట్టాలో తెలియజేస్తోంది. దీని వల్ల మీకు, మీ సోదరులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ రాశిని బట్టి ఏ కలర్ రాఖీ కట్టాలో ఇప్పుడే తెలుసుకోండి...
Raksha Bandhan 2020 : రాఖీ పౌర్ణమి వెనుక అన్ని కథలు ఉన్నాయా?

మేష రాశి..
ఈ రాశి వారు మీ సోదరులకు ఎరుపు, ఆరెంజ్ లేదా బంగారు రంగులతో కూడిన రాఖీని కట్టాలి. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

వృషభ రాశి..
ఈ రాశి వారు తమ సోదరులకు వెండి, నీలం లేదా బాదామి రంగులో ఉండే రాఖీని కడితే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. మీరు కూడా వెండి రాఖీని ధరించవచ్చు.

మిధున రాశి..
ఈ రాశి వారు తమ సోదరులకు ఆకుపచ్చ రంగులో ఉండే రాఖీని కడితే మంచిగా ఉంటుంది.
ఏఏ రాశి చక్రాలవారు ఏవిధంగా రహస్యాలను కాపాడుకుంటారో చూడండి...

కర్కాటక రాశి..
ఈ రాశి వారు తమ అన్నదమ్ములకు ముత్యాల రాఖీని కడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ప్రకాశవంతమైన మరియు తేలికపాటి రంగులో ఉండే రాఖీలను కడితే శుభప్రదంగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి వారు తమ సోదరులకు ఆరెంజ్, బంగారు లేదా పసుపు రంగులో ఉండే రాఖీలను కడితే మీకు అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు వారి సోదరులకు ఆకుపచ్చ లేదా రమా ఆకుపచ్చ రంగులో ఉండే రాఖీలను కట్టాలి.

తుల రాశి..
ఈ రాశి వారు తమ అన్నదమ్ములకు డైమండ్ రంగు ఉండే రాఖీని కడితే మంచి ప్రయోజనం ఉంటుంది.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు రక్షా బంధన్ సందర్భంగా తమ సోదరులకు మెజెంటా, పింక్ లేదా ఆరెంజ్ రంగుంలో ఉండే రాఖీలను కట్టొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు తమ అన్నదమ్ములకు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండే రాఖీని కడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.

మకర రాశి..
ఈ రాశి వారు రక్షా బంధన్ రోజున తమ సోదరులకు పర్పుల్, ముదురు గులాబీ లేదా ముదురు నీలం రంగుంలో ఉండే రాఖీని కట్టాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు రాఖీ పౌర్ణమి రోజున తమ సోదరులకు నీలి రుంగులో ఉండే రాఖీని కడితే ప్రయోజనాలు లభిస్తాయి.

మీన రాశి..
ఈ రాశి వారు శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి పండుగ రోజున తమ సోదరులకు కుంకుమ, పసుపు లేదా ఎరుపు రంగులో రాఖీ కడితే మీకు, మీ సోదరులకు శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి.