Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
Ramzan 2023: రంజాన్ ఉపవాసం ఉన్నా ఫుల్ ఎనర్జీతో ఉండాలంటే ఇలా చేయండి
రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. ముస్లింలకు ఇది అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసంలో ముస్లింలు ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం పాటిస్తారు. ఈ సమయంలో మంచి నీళ్లు కూడా తీసుకోరు.

రంజాన్ వేళ పాటించే ఉపవాసాలను మూడు అష్రాలుగా విభజిస్తారు. తొలి 10 రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, తదుపరి 10 రోజుల ఉపవాస కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల ఉపవాస కాలాన్ని మగ్ఫిరత్ అని పిలుస్తుంటారు. ఉపవాసానికి ముందు అంటే ఉపవాసం ప్రారంభించే ఉదయం వేళను సెహ్రీ అని విరమించే సమయాన్ని అంటే సాయంత్రాన్ని ఇఫ్తార్ అని అంటారు.
రంజాన్ మాసంలో పాటించే ఉపవాసాన్ని అరబిక్ లో సౌమ్ అంటారు. ఫార్సీలో రోజా అని పిలుస్తారు.
సెహ్రీ అంటే..
ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం.. సూర్యోదయానికి ముందు ఆహారం తీసుకుని ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం ఉదయం వేళ ఫజ్ర్ ఆజాన్‌తో మొదలవుతుంది. దీనినే సెహ్రీగా పిలుస్తారు.
ఇఫ్తార్ అంటే..
ఉదయం మొదలైన ఉపవాసం సాయంత్రం వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం పూట ఎలాంటి పదార్థాలు తినరు. ఏమీ తాగరు. సాయంత్రం వేళ నమాజ్ చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన సమయాన్ని మగ్రిబ్ అంటారు. దీనినే ఇఫ్తార్ అంటారు.
రంజాన్ ఉపవాస నిబంధనల ప్రకారం ఉదయం సెహ్రీకి ముందు ఏదైనా, ఎంతైనా తినవచ్చు, తాగవచ్చు. అలాగే సాయంత్రం ఇఫ్తార్ తర్వాత ఏదైనా, ఎంతైనా తినొచ్చు, తాగొచ్చు.
ఉపవాసం వేళ పాటించాల్సిన చిట్కాలు:
చేయాల్సినవి:
- ఇఫ్తార్ తర్వాత సెహ్రీకి ముందు పుష్కలంగా నీరు తాగాలి.
- సెహ్రీలో సమతుల్య భోజనం తినాలి
- ఇఫ్తార్ లో వెచ్చని పానీయాలు తాగాలి
- ఓట్స్, తృణధాన్యాలు తినాలి.
- తేనే, ఖర్జురాలు తీసుకోవాలి
- బాదం, వాల్‌నట్‌లు, ఆలివ్ లు, అవకాడోలు వంటివి తీసుకోవాలి.
- పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, గింజలు తీసుకోవాలి.
- ఖర్జూరాలు, బెల్లం, పండ్లు, కూరగాయలు తినాలి.
చేయకూడనివి:
- రంజాన్ మాసంలో డైటింగ్ చేయవద్దు. కొవ్వును ఎక్కువగా తీసుకోవాలి.
- సింథటిక్, కృత్రిమ శీతల పానీయాలు తీసుకోవద్దు.
- ఉపవాసం తర్వాత వెంటనే శీతల పానీయాలు, వేడి పానీయాలు, వేడి వేడి పదార్థాలు తినొద్దు.
- ఇఫ్తార్ సమయంలో నూనె, వేయించిన ఆహారాలను దూరంగా ఉండాలి.
- అధిక కొవ్వు, అధిక కేలరీల ఆహారాలకు దూరంగా ఉండాలి.
- శుద్ధి చేసిన, ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications
