For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిసెంబర్ నెలలోనే ఎక్కువ పార్టీలు.. ప్రయాణాలు.. ఇంకా మరెన్నో..

|

ప్రతి సంవత్సరం మనకు 12 నెలలు ఉంటాయి. ఏ నెలకు అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఒక్క డిసెంబర్ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నెలలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ గాల్లో తేలిపోవాలని అనిపిస్తుంది. ఈ నెలలో వచ్చే శీతాకాలం, చలిని తట్టుకోలేక దుప్పట్లో దూరి కోరుకునే వెచ్చదనం మరియు క్రిస్మస్ పండుగ వంటి వేడుకలు చాలా ఉన్నాయి.

అంతేకాదు సంవత్సరానికి ముగింపు పలికే నెలనే కాకుండా పాత సంవత్సరంలో చేసిన పనులన్నింటినీ ఒక్క డిసెంబర్ లోనే రివైండ్ చేసుకుంటారు. ఇలాంటి విషయాలతో మరెన్నో అంశాలు డిసెంబర్ నెలను సంవత్సరంలో ఉత్తమ నెలగా చేస్తున్నాయి. వాటికి గల కారణాలేంటో ఈ స్టోరీలో మీరే తెలుసుకోండి...

చల్లని వాతావరణం..

చల్లని వాతావరణం..

ఈ నెలలో వాతావరణం పూర్తిగా చల్లగా మారుతుంది. దేశంలోని ప్రజలందరూ స్వెట్టర్లతో సంతోషంగా సూర్యుడికి స్వాగతం పలుకుతారు. ఈ శీతాకాలంలో చెమట మరియు వాసన గురించి ఎలాంటి చింత ఉండదు. ఈ కాలంలో అందరికీ ఇష్టమైన స్వెటర్లు, అందమైన మఫ్లర్లు మరియు సాక్సులను ఏ క్షణమైనా వేసుకుని ఆనందించవచ్చు.

క్రిస్మస్ వేడుకలు..

క్రిస్మస్ వేడుకలు..

డిసెంబర్ నెలలో ఉత్తమమైన వేడుకలలో క్రిస్మస్ ఒకటి. ఈ నెలలో క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి పిల్లలు తెగ ఆరాటపడతారు. అంతేకాదు వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి మరియు వారి స్నేహితులు మరియు కుటుంబసభ్యుల నుండి బహుమతులు స్వీకరించడానికి పరిమితులు లేని కోరికలు ఉన్నట్లుగా అనిపిస్తుంది.

బహుమతులు, కేకులు..

బహుమతులు, కేకులు..

డిసెంబర్ నెలను క్రిస్మస్ మాసం అని కూడా అంటారు. ఈ నెలలో కుకీలు, కేకులు తయారు చేయడం ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేయడం వంటివి జరుగుతుంది. క్రిస్టియన్ సోదరులందరూ వివిధ రకాల బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ వెచ్చని శుభాకాంక్షలు చెబుతూ మంచి అనుభూతి చెందే మాసం . బహుమతులను ఎవరూ ద్వేషించరు కాబట్టి, రుచికరమైన కుకీలను తయారు చేయడం ద్వారా మీరు మీ ప్రత్యేకమైన మరియు ప్రియమైన వారికి కచ్చితంగా ఆకర్షించవచ్చు.

దుప్పట్లోకి దూరడం..

దుప్పట్లోకి దూరడం..

డిసెంబర్ నెల అంటేనే చలికి అందరూ గజ గజ వణుకుతారు. అయినా కూడా శీతాకాలం చల్లటి వాతావరణాన్ని ఆనందిస్తారు. కానీ ఎక్కువ చలి వేస్తే మాత్రం దుప్పట్లో దూరేస్తారు. చలికాలపు గాలుల నుండి తమను తాము వెచ్చగా ఉంచుకునేందుకు దుప్పటి మంచి సౌకర్యవంతంగా ఉంటుంది.

 కొత్త సంవత్సరం కోసం..

కొత్త సంవత్సరం కోసం..

డిసెంబర్ నెల సంవత్సర ముగింపు నెల అయినప్పటికీ, ఇది కొత్త సంవత్సరం రాక కూడా. త్వరలో ప్రారంభమయ్యే 2020 ఆంగ్ల నూతన సంవత్సరం కోసం వేచి ఉంటారు. అలాగే కొత్త సంవత్సరంలో ఏదైనా సాధించడానికి కొన్ని తీర్మానాలు కూడా చేయవచ్చు. సరికొత్త ప్రారంభాన్ని పొందడానికి మీరుఏడాది పొడవునా పడిన కష్టాన్ని వదిలివేయవచ్చు.

సెలవులు.. పర్యాటక ప్రదేశాలు

సెలవులు.. పర్యాటక ప్రదేశాలు

డిసెంబర్ నెలలో కచ్చితంగా సెలవులు వస్తాయి. అందుకే చాలా మంది సంతోషంగా సెలవులను ఎంజాయ్ చేసేందుకు పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే శీతాకాలం సెలవుల్లో యాత్రలకు ప్లాన్ చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎండాకాలం ఎండ కారణంగా, వర్షకాలం వాన కారణంగా ప్రయాణాలు చేయలేకపోవచ్చు. మీరు ఏడాది పొడవునా కష్టపడి సంపాదించిన డబ్బును డిసెంబర్ నెలలో ఆనందం కోసం ఖర్చు చేయవచ్చు.

వేడి పదార్థాలు

వేడి పదార్థాలు

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా అనేక మంది వేడి పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. సాధారణంగా చాలా మంది ఏడాది అంతా కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడవచ్చు. అయితే శీతాకాలంలో మాత్రం మీరు వేడి పదార్థాల తినడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. దాని వల్ల అవి మంచి రుచిని మాత్రమే ఇవ్వకుండా, మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి. మీరు వేడి చాక్లెట్లను కూడా తయారు చేసుకోవచ్చు.

కుటుంబాలు కలుస్తాయి..

కుటుంబాలు కలుస్తాయి..

మీ కుటుంబ సభ్యులు కలిసే కాలం ఏదైనా ఉందంటే అది శీతాకాలమే. శీతాకాల సెలవుల్లో అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ల ఇంటిని సందర్శించడానికి కచ్చితంగా ప్లాన్ చేయవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులను కలవడంలో మీకు సహాయపడటమే కాకుండా, మీ సెలవులను తెలివిగా గడిపేందుకు మీకు ఆనందం కలిగిస్తుంది.

పొగ మంచు..

పొగ మంచు..

శీతాకాలం అంటేనే పొగమంచుతో కూడుకుని ఉంటుంది. అది కూడా డిసెంబర్ నెలలో పరిపూర్ణంగా పొగ మంచు కురుస్తుంది. దీని వల్ల ప్రజలంతా గజ గజ వణకడం అనేది గ్యారంటీ. అయినా దీన్ని కూడా ఎంతోమంది ఎంజాయ్ చేస్తారు.

 పార్టీ టైమ్...

పార్టీ టైమ్...

అందరూ కలిసి పార్టీలను జరుపుకోవడానికి ఈ డిసెంబర్ నెల ఉత్తమమైనది. ఈ నెలలో ఒకేసారి రెండు వేడుకలను జరుపుకోవచ్చు. ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి మరియు ఆంగ్ల నూతన సంవత్సర నెలకు స్వాగతం పలకడానికి అనే రెండు వేడుకలు ఉన్నాయి. ఈ సమయంలో అనేక మంది తమ బంధు మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు.

English summary

Reasons Why December Is The Best Month Of The Year

December is the last month of the year. Yet it is the best month of the year and is full of celebration and enthusiasm. It is the month where you can enjoy hot drinks, the warmth of the blanket along with the snow
Story first published: Friday, November 29, 2019, 17:20 [IST]