Republic Day 2024:గణతంత్ర వేడుకలను ఎందుకు జరుపుకుంటారు... జనవరి 26నే ఎందుకో తెలుసా..

బ్రిటీష్ వారి పాలన నుండి భారతీయులకు 1947 సంవత్సరంలో ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి విముక్తి లభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీష్ పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత విముక్తి లభించింది.

Republic Day 2022 Date, History, importance, significance and why is it celebrated in Telugu

మన దేశానికి స్వాతంత్య్రం రావడం కోసం ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు ధన, మాన, ప్రాణ త్యాగాలు చేశారు. అయితే మహాత్మ గాంధీజీ మాత్రం అహింస అనే ఆయుధంతో అందరినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

Republic Day 2022 Date, History, importance, significance and why is it celebrated in Telugu

అలా మనకు 1947 సంవత్సరంలో ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అయితే మనకు సంపూర్ణ స్వాతంత్య్రం మాత్రం రాలేదు. అందుకోసం సుమారు మూడేళ్ల సమయం పట్టింది. అంటే 1950 సంవత్సరంలో మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది. అప్పుడే స్వాతంత్య్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26వ తేదీన భారత్ సరికొత్తగా అవతరించింది.

Republic Day 2022 Date, History, importance, significance and why is it celebrated in Telugu

అప్పటినుంచే ప్రతి ఏటా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే చాలా మంది రిపబ్లిక్ డేను సెలవు దినంగా భావిస్తారు.. ఈరోజున ఇంట్లో ఉంటూ కొత్త కొత్త సినిమాలు, షికార్లు, షాపింగులు ఇతర కార్యకలాపాల్లో మునిగిపోయి ఎంజాయ్ చేస్తుంటారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను అర్పించిన వారిని ఎంతమంది వ్యక్తులు గుర్తు చేసుకుంటున్నారంటే.. మాత్రం ఫలితం శూన్యమేనని చెప్పొచ్చు. అంతేకాదు దేశ స్వాతంత్య్రం మీద నేటి యువతకు ఏ మేరకు అవగాహన ఉందో అన్న అంశంపైనా సందేహాలు కలుగుతున్నాయి. ఈ సందర్భంగా రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు.. తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎక్కడ జరుపుకున్నారనే విషయాలతో పాటు అనేక వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నవంబర్ 26నే ఆమోదం..

నవంబర్ 26నే ఆమోదం..

సాధారణంగా 1950 సంవత్సరంలో జనవరి 26వ తేదీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయం చాలా మందికి తెలుసు. అయితే అంతకంటే ముందే రాజ్యాంగానికి ఆమోదం లభించింది. 1949 నవంబర్ 26వ తేదీన మనకు సంపూర్ణ స్వరాజ్యం వచ్చింది. అయితే దీన్ని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశ్యంతో రెండు నెలలు ఆగారు.

నెహ్రూ సారథ్యంలో..

నెహ్రూ సారథ్యంలో..

అంతకుముందు 1930 సంవత్సరంలో జనవరి 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో మొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున మువ్వన్నెల జెండాను ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని ఆంగ్లేయులకు గట్టిగా వినిపించారు. అప్పటివరకు కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం వస్తే చాలు, సంపూర్ణ అధికారం ఆంగ్లేయుల చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదనుకునేవారు మన రాజకీయ నేతలు.

జలియన్ వాలా బాగ్ ఉదంతం..

జలియన్ వాలా బాగ్ ఉదంతం..

అయితే జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దీంతో ఆనాడు సుభాష్ చంద్రబోస్, జవహార్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆరోజే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవంగా పిలుపు కూడా ఇచ్చింది.

ఎంతో అధ్యయనం చేసి..

ఎంతో అధ్యయనం చేసి..

రాజ్యాంగ రచన ముసాయిదా నిర్మాతగా డాక్టర్ అంబేద్కర్ ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో, అనేక సవరణల అనంతరం మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించారు.

ఎంత సమయం.. ఎంత ఖర్చంటే..

ఎంత సమయం.. ఎంత ఖర్చంటే..

మన దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల 11 నెలల 17 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తి పొందిన మన భారతదేశంలో భారత పౌరులందరినీ ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు.

అందరికీ సమాన హక్కులు..

అందరికీ సమాన హక్కులు..

రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వంతో పాటు హక్కులు, బాధ్యతలకు కూడా చోటు కల్పించారు. కుల, మత, లింగ, వర్ణ వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రతి పౌరుడికీ అన్ని సేవలు అందాలని, ప్రతి ఒక్కరు ప్రాథమిక హక్కులను కలిగి ఉండాలని, మన దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలని వీటన్నింటినికీ రాజ్యాంగంలో చోటు కల్పించారు. వీటన్నింటినీ గుర్తు చేస్తుకుంటూ మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం.

తొలి గణతంత్ర వేడుకలు..

తొలి గణతంత్ర వేడుకలు..

మనలో చాలా మందికి మొదటి గణతంత్ర దినోత్సవం ఎక్కడ జరిగిందనే విషయం తెలియదు. అందరూ అనుకున్నట్టు తొలి గణతంత్ర దినోత్సవం రాజ్ పథ్ లో కాకుండా ఇర్విన్ స్టేడియంలో అంటే ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుపుకున్నారట.అప్పటికి సరిహద్దు గోడ నిర్మించబడలేదట. పాత కోట మాత్రమే కనిపించింది. ఇది మాత్రమే కాదు. మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం సమయంలో కాకుండా మధ్యాహ్న సమయంలో జరుపుకున్నారట.

ప్రతి ఏటా తుపాకులతో..

ప్రతి ఏటా తుపాకులతో..

ఆ సమయంలో మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి భవన్ ను ఆరు గుర్రాల బగ్గీలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వేదిక వద్దకు బయలుదేరారు. అక్కడ దేశ తొలి అధ్యక్షుడు చేరుకున్న వెంటనే అతని రైడ్ క్వార్టర్ నుండి నాలుగు గంటల వరకు సెల్యూట్ దశకు చేరుకుంది. అప్పుడు మన దేశ అధ్యక్షుడికి 31 ఫిరంగులతో వందనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఇది 21 తుపాకులకు తగ్గించబడింది.

ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బోల్డ్ స్కై తెలుగు తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

FAQs
మన దేశంలో రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలను జరుపుకుంటారు. 1950వ సంవత్సరంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించిన భారత్ గా అవతరించిందని.. ఈ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకుంటారు.

మన దేశంలో తొలి రిపబ్లిక్ డే వేడుకలను ఎక్కడ జరుపుకున్నారు?

1950వ సంవత్సరం జనవరి 26వ తేదీన మన దేశానికి సంపూర్ణ స్వరాజ్యం రావడంతో.. స్వాతంత్య్రం తర్వాత మనం గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరంగా ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇర్విన్ స్టేడియంలో ధ్యాన్ చంద్ స్టేడియంలో జరుపుకున్నారు.

రిపబ్లిక్ డే వేడుకల్లో దేశ అధ్యక్షుడికి ఎలాంటి వందనం ఇస్తారు?

మన దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి భవన్ ను ఆరు గుర్రాల బగ్గీలో బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు వేదిక వద్దకు బయలుదేరారు. అక్కడ దేశ తొలి అధ్యక్షుడు చేరుకున్న వెంటనే అతని రైడ్ క్వార్టర్ నుండి నాలుగు గంటల వరకు సెల్యూట్ దశకు చేరుకుంది. అప్పుడు మన దేశ అధ్యక్షుడికి 31 ఫిరంగులతో వందనం ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఇది 21 తుపాకులకు తగ్గించబడింది.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion