For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సద్భావన దివాస్ 2019 : రాజీవ్ గాంధీ 75వ జయంతి వార్షికోత్సవాలు..

1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ సమయంలో తన తల్లిని అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితుల్లో రాజీవ్ రాజకీయాల్లో చేరాల్సిందిగా ఒత్తిడి బాగా పెరిగింది.

|

ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా.. అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రాజీవ్ గాంధీ. అంతేకాదు తన నిర్ణయాలను నిర్భయంగా వెల్లడించేవారు. తన ప్రధాన ఆశయాలలో భారతదేశంలో ఐక్యతను కాపాడుకుంటూనే మన దేశ ఐక్యతను 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడమే తన ధ్యేయమని చాలా సార్లు చెప్పారు.

Rajiv Gandhi

మన దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో 40 సంవత్సరాలకే ప్రధాని పీఠాన్ని అధిష్టించి రికార్డు నెలకొల్పారు. అందుకే ఆగస్టు 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా భారత సద్భావాన దివాస్ గా వార్షికోత్సవాలను జరుపుకుంటారు. ఆయన గురించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాజీవ్ గాంధీ బాల్యం..

రాజీవ్ గాంధీ బాల్యం..

కీర్తిశేషులు రాజీవ్ 1944 ఆగస్టు 20వ తేదీన బాంబేలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి రాజీవ్ తాత ప్రధానమంత్రి అయ్యే నాటికి ఆయన వయసు మూడే సంవత్సరాలు. ఆ తర్వాత రాజీవ్ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు మకాం మార్చారు. అనంతరం లక్నో నుండి ఢిల్లీకి వెళ్లారు. అప్పటికే ఆయన తండ్రి ఫిరోజ్ గాంధీ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాదు కష్టపడి పనిచేసి ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. రాజీవ్ తన బాల్యాన్ని తీన్ మూర్తి భవనంలో తాతతో కలిసి గడిపారు.

విద్యాభ్యాసం..

విద్యాభ్యాసం..

రాజీవ్ డెహ్రూడూన్ లోని వెల్హామ్ ప్రైమరీ స్కూల్ కు కొన్నిరోజులు వెళ్లాడు. తర్వాత రెసిడెన్షియల్ డూన్ స్కూల్ కు మారిపోయాడు. అక్కడే ఆయన అనేకమందితో స్నేహపరిచయాలను పెంచుకున్నారు. అప్పుడే చిన్నతమ్ముడు సంజయ్ గాంధీ కూడా ఆయనతో కలిశారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలో చేరారు. అయితే రాజీవ్ లండన్ లోని చాలా త్వరగా ఇంపీరియల్ కళాశాలకు మారిపోయారు. అక్కడే మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు.

అభిరుచులు..

అభిరుచులు..

సైన్సు, ఇంజినీరింగ్ విద్యార్థి అయిన రాజీవ్ కు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదని ఆయన తోటి విద్యార్థులు చెప్తుండేవారు. ఫిలాసఫీ, రాజకీయాలు లేదా చరిత్ర గురించి ఆయన పెద్దగా పట్టించుకునే వారు కాదని చెబుతారు. ఆయన బీరువాల నిండా సైన్సు, ఇంజినీరింగ్ కు సంబంధించిన పుస్తకాలే ఉండేవని చెబుతారు. అంతేకాదు ఆయన సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడేవారట. పాశ్చాత్య, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఆయన అమితంగా ఇష్టపడేవారట. ఫొటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో వంటి వాటిపైనా ఆసక్తి కనబరిచేవారట.

పైలెట్ గా జీవితం ప్రారంభం..

పైలెట్ గా జీవితం ప్రారంభం..

అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ కు గాల్లో ప్రయాణించేందుకు అమితమైన ఆసక్తి కనబరిచేవారట. ఇంగ్లండ్ నుండి ఇండియాకు తిరిగి వచ్చాక ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ ఎంట్రన్స్ పరీక్ష రాశారు. అందులో పాసై కమర్షియల్ పైలెట్ లైసెన్సు తీసుకునేందుకు వెళ్లారు. అనతికాలంలోనే దేశీయ విమాన సంస్థ ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పైలెట్ జీవితం ప్రారంభించారు.

రాజీవ్ వివాహం..

రాజీవ్ వివాహం..

రాజీవ్ ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ లో ఉన్న సమయంలోనే ఇంగ్లీష్ చదివే ఇటాలియన్ లేడీ సోనియాతో ఆయనకు పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో 1968లో వారు అక్కడే వివాహం సైతం చేసుకున్నారు. తర్వాత ఇద్దరు పిల్లలు రాహుల్, ప్రియాంకతో కలిసి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంట్లో నివాసం ఉండేవారు. వారి చుట్టూ రాజకీయ కోలాహలం ఉన్నా వారిది మాత్రం పూర్తిగా వ్యక్తిగత జీవితం అని పలువురు చెబుతుండేవారు.

రాజీవ్ రాజకీయ ప్రస్థానం..

రాజీవ్ రాజకీయ ప్రస్థానం..

1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ సమయంలో తన తల్లిని అనేక సవాళ్లు చుట్టుముట్టిన పరిస్థితుల్లో రాజీవ్ రాజకీయాల్లో చేరాల్సిందిగా ఒత్తిడి బాగా పెరిగింది. మొదట్లో ఇందుకు ఒప్పుకోని రాజీవ్ తర్వాత బలవంతంగానే ఉత్తరప్రదేశ్ లోని అమెథీ స్థానానికి పోటీ చేసేందుకు ఒప్పుకున్నారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఘన విజయం సాధించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా..

కాంగ్రెస్ అధ్యక్షుడిగా..

1984లో అక్టోబర్ 31వ తేదీన అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైంది. దీంతో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతులు నిర్వర్తించాల్సి వచ్చింది. తన తల్లి మరణం తనను ఎంతగానో బాధపెడుతున్నా.. విచారాన్ని అణచుకొని ఎంతో హూందాగా, ఓర్పుగా బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకున్నారు. మరో విశేషమిటంటే ఆయన ప్రధాని అయ్యే సమయానికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లే.. అప్పటిదాకా అంత తక్కువ వయస్సులో ఎవ్వరూ ప్రధాని పీఠాన్ని అధిష్టించలేదు.

రాజీవ్ విజయబావుట..

రాజీవ్ విజయబావుట..

రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాక దేశ చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పారు. తన తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్ సభ ఎన్నికలకు ఆదేశించారు. అనంతరం వచ్చిన ఫలితాల్లో అత్యంత ఘన విజయం సాధించారు. అంతకుముందు ఏడు సార్లు జరిగిన ఎన్నకల్లో కంటే రాజీవ్ హయాంలో ఎక్కువ సీట్లను సాధించారు.508 లోక్ సభ సీట్లకు గాను 401 సీట్లు గెలుచుకున్నారు. అంతకుముందే ఆయన హయాంలో భారత్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమాలన్నింటిని రాజీవ్ విజయవంతంగా పూర్తి చేశారు. తన సామర్థ్యం, సమన్వయస్ఫూర్తిని చాటుకున్నారు. అనంతరం ఎన్నికల కోసం నెలరోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అలసట అనేది లేకుండా ప్రయాణించారు. అనేకచోట్ల 250 సభల్లో మాట్లాడారు. అనంతరం 1991 మే 21వ తేదీన తమిళనాడులో హత్య గావింపబడ్డారు.

English summary

Sadhbavana Diwas 2019:75th Birth Anniversary of Rajiv Gandhi

On October 31, 1984, the then Prime Minister Indira Gandhi was brutally murdered. This has forced Rajiv Gandhi to take over as prime minister and Congress president. The death of his mother, no matter how much he hurt her .. The sadness of the saddens, and the responsibility of patience to his shoulders. He was only 40 years old at the time of his becoming Prime Minister.
Story first published:Tuesday, August 20, 2019, 14:14 [IST]
Desktop Bottom Promotion