Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Shani Gochar 2022:శని రవాణా వల్ల ఏ రాశి వారికి శుభం.. ఎవరికి అశుభమో చూసెయ్యండి...
2022లో శని గ్రహం ఏప్రిల్ 29వ తేదీన కుంభంలో రవాణా చేయనున్నాడు.
Shani Gochar 2022 Predictions in Telugu :జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శని గ్రహం అన్ని గ్రహాల కన్నా చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది.

అందుకే దీన్ని స్లో మూనింగ్ అని అంటారు. ఇది ఒక రాశి నుండి మరో రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. దీంతో ప్రతి ఒక్క రాశిపై శని ప్రభావం అనేది కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ శని మకర రాశిలో నివాసం ఉంటున్నాడు.

2022 కొత్త సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో 29వ తేదీన కుంభ రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇదే రాశిలో 2022 సంవత్సరం జులై 11వ తేదీ వరకు సంచారం చేసి.. తిరిగి మకర రాశిలోకి తిరోగమనం చెందన్నాడు. ఆ తర్వాత 2023 జనవరి 18వ తేదీన మళ్లీ కుంభ రాశిలోకి వెళ్లనున్నాడు.

దీంతో ఆరు నెలల పాటు శని ప్రభావం అనేది ఉంటుంది. ఈ సందర్భంగా శని గ్రహం రవాణా వల్ల ఏ రాశి వారిపై ఎలాంటి ఫలితం ఉంటుంది.. శని దేవుడిని ఎలా ఆరాధిస్తే.. శని దోషం నుండి తప్పించుకోవచ్చు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి 11వ స్థానం గుండా తిరోగమనంలో పదో స్థానం నుండి శని రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. మీ ప్రయత్నాలన్నింటికీ తగిన అనేక అవకాశాలు లభిస్తాయి. మీ వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ఆనందం ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి నుండి 10వ పాదం నుండి.. తిరోగమనంలో జులైలో 9వ స్థానం నుండి శని సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా మీరు భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టులో మంచి ఫలితాన్ని రాబట్టొచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు భౌతికంగా ఆనందంగా ఉండొచ్చు. విద్యార్థులకు కొన్ని ఆటంకాలు కూడా ఎదురుకావొచ్చు.

మిధున రాశి..
2022లో ఈ రాశి నుండి శని గ్రహం 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీలో కోపం పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుదల కూడా పెరగొచ్చు. మీ ప్రతికూల ఆలోచనల వల్ల సంబంధాల్లో చీలికలు రావొచ్చు. మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. మీ అనారోగ్యంపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి శని గ్రహం 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు సవాళ్లు ఎదురవుతాయి. మీ జీవితంలో ఎన్నో మార్పులు రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు. మీ వ్యాపారంలో నష్టం జరగొచ్చు. ఈ కారణాలన్నింటి వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా శ్రద్ధ వహించాలి.

సింహ రాశి..
ఈ రాశి నుండి శని గ్రహం 7వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవ్వొచ్చు. మీరు కొంతకాలం పాటు వేరే చోట నివసించాలి. మీ భార్య సహకారంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి. మీ ప్రయత్నంలో విజయం దక్కుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం మీ ఆందోళనను పెంచుతుంది.

కన్య రాశి..
ఈ రాశి నుండి శని గ్రహం 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవ్వనున్నాయి. అయితే మీరు ఈ కాలంలో శత్రువులను ఓడించగలరు. విదేశాలకు వెళ్లే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

తుల రాశి..
ఈ రాశి నుండి శని ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ భాగస్వామిని నమ్మొద్దు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా శ్రద్ధ వహించడం మంచిది.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి శని నాలుగో స్థానం రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణలో విజయం సాధించొచ్చు. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి శని మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు మీ పనిని ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. మీరు ఇల్లు మారే అవకాశం కూడా ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు.

మకర రాశి..
ఈ రాశి నుండి శని రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ వ్యాపారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అంతా మంచిగా ఉంటుంది.

కుంభ రాశి..
మకరం నుండి శని ఈ రాశిలోకి ప్రవేశించనున్నాడు. జులై 11న మళ్లీ తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉండదు. మీకు శారీరక నొప్పులు రావొచ్చు. ఇది మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టదు. మీ కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తొచ్చు. మీ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీన రాశి..
ఈ రాశి నుండి శని 12వ స్థానం నుండి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలతో బాధపడొచ్చు. ఈ సమయంలో మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఈ సమయం పనిభారం పెరుగుతుంది. మీరు చాలా ఓపికగా ఉండాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2022 సంవత్సరంలో శని గ్రహం మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2022 సంవత్సరంలో శని గ్రహం మకర రాశి నుండి కుంభ రాశిలోకి ఏప్రిల్ 29వ తేదీన రవాణా చేయనున్నాడు.
శని గ్రహం అన్ని గ్రహాల కన్నా చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. అందుకే దీన్ని స్లో మూనింగ్ అని అంటారు. ఇది ఒక రాశి నుండి మరో రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది.



Click it and Unblock the Notifications











