Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
అక్కడ శివునికి పాలాభిషేకం చేస్తే.. మజ్జీగ లభిస్తుందట...!
బెంగళూరులోని ఆ శివాలయంలో పాలు ఇస్తే, దానికి బదులుగా మజ్జీగ లభిస్తుందట.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

అంతేకాదు మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని స్మరించుకుంటే, ఆ దేవుడు తప్పకుండా అనుగ్రహం ఇస్తారని చాలా మంది నమ్ముతూరు. అంతేకాదు శివ లింగానికి అభిషేకం చేయించడం ద్వారా సంపూర్ణ జ్ణానాన్ని, దేవుని ఆశీస్సులు పొందొచ్చని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఎందుకంటే అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయని, అభిషేకం అంటేనే దేవుళ్లకు ఎంతో ప్రీతికరమని పండితులు చెబుతారు. అందులోనూ శివుడు అభిషేక ప్రియుడని.. పరమేశ్వరునికి అభిషేకం చేయించడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందొచ్చు. మహా శివరాత్రి రోజున ఆ భోళాశంకరుడికి కొన్ని ముఖ్యమైన పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్మకం.

పసుపుతో పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ పనులకు సంబంధించి శుభ ఫలితాలొస్తాయట. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయట. తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే గ్రహా దోషాల నుండి విముక్తి లభించి, దేవుని అనుగ్రహం లభిస్తుందట. ఇదిలా ఉండగా.. ఓ శివాలయంలో శివ లింగానికి పాలతో అభిషేకం చేయిస్తే.. మజ్జీగ లభిస్తుందట.. ఇంతకీ ఆ పరమేశ్వరుని దేవాలయం ఎక్కడుంది.. పాలు ఇస్తే మజ్జీగ ఎలా దొరుకుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పాలతో అభిషేకం..
మన దేశంలో మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులందరూ తమ కోరికలన్నీ తీరాలని.. కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ.. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివాలయానికి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో శివ లింగానికి పాలాభిషేకం వంటివి చేయిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల పాలన్నీ వృథా అవుతున్నాయని, చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని, ఈ సమయంలో పాలతో అభిషేకాలు వద్దని అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని భక్తులు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. ప్రతి ఏడాది ఇది సంప్రదాయబద్ధంగా జరుగుతుందని చెబుతారు.

బెంగళూరులోని శివాలయంలో..
ఈ నేపథ్యంలో భక్తులందరూ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా.. పాలు కూడా వృథా కాకుండా.. ఓ శివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని దాసరహళ్లిలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ఇక్కడ ఉన్న గంగాధరేశ్వర ఆలయంలో శివునికి పాలు సమర్పిస్తే, ఆలయ సభ్యులు వారికి మజ్జిగను ప్రసాద రూపంలో అందజేస్తున్నారు. అభిషేకం చేసిన పాలు వృథా కాకుండా ఇలా చేయడం విశేషం.

ప్రతి సోమవారం..
మెట్రో సిటీ.. కూల్ సిటీ.. గ్రీన్ సిటీగా పేరు తెచ్చుకున్న బెంగళూరులోని ప్రసిద్ధ పరమేశ్వరుని ఆలయాల్లో గంగాధరేశ్వర దేవాలయం ఒకటి. ఈ శివాలయంలో ప్రతి సోమవారం రోజున సుమారు 500 లీటర్ల పాలను భక్తులు సమర్పిస్తారు. ఇక మహా శివరాత్రి, ఇతర ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ సందర్భంగా వేలాది లీటర్ల పాలు దేవాలయానికి అభిషేకం కోసం వస్తాయి. ఆలయ కమిటీ సభ్యులు ఈ పాలన్నీ వృథా కాకుండా, వాటిని మజ్జీగ రూపంలో తిరిగి భక్తులకు అందజేస్తారు. దీంతో ఈ దేవాలయంలో పాలు అనేవి వృథా కావు. భక్తుల మనోభావాలకు ఎలాంటి భంగం కలగకుండా ఇలా ఏర్పాటు చేశారు.

మంగళవారం మజ్జీగ..
ఈ శివాలయంలో పండితులు పూర్తిగా శుభ్రమైన లింగానికి పాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాతనే మిగిలిన పదార్థాలతో అభిషేకం చేస్తారు. మంగళవారాల్లో ఆలయాన్ని సందర్శించే వారికి ఇక్కడ మజ్జీగను అందజేస్తారు. అది కూడా మజ్జీగ నాణ్యతను పరీక్షించిన తర్వాతే ఇస్తారు. ఈ మజ్జీగను భక్తులందరూ అక్కడే తాగొచ్చు. లేదా ఇంటికి తీసుకెళ్లి కూడా తాగొచ్చు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ప్లాస్టిక్ బాటిళ్లను ఇంటికి తీసుకెళ్లేందుకు దేవాలయ కమిటీ సభ్యులు అనుమతించరు. ప్లాస్టిక్ చెత్త కలపడం వల్ల మజ్జీగ నాణ్యత పోతుందని వారి అభిప్రాయం.

తమ గుడి నుండే..
ఇలా ప్రజలకు పాలు పంచాలనే ఆలోచన ఆ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడు ఈశ్వరానంద స్వామిజీది. భారతదేశంలోని మిలియన్ల మంది పిల్లలు పాలు, పోషకాహారంతో బాధపడుతున్నారు. అందుకే తమ శివాలయం నుండే ఈ మోడల్ ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు, అందులో భాగంగా మజ్జీగ పరిష్కారం కనుగొన్నారు.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.
* మహా శివరాత్రి రోజున పరమేశ్వరునికి పెరుగుతో రుద్రాభిషేకం చేస్తే సంపద పెరుగుతుంది.
* ఆ భోలేనాథుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
* మహా శివరాత్రి రోజున తేనే మరియు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ సంపద పెరుగుతుందని, మీకు శుభ ఫలితాలొస్తాయి.
* మీకు రావాల్సిన బకాయిలు ఉంటే, మహా శివరాత్రి రోజున శివుని వాహనం నంది అంటే ఎద్దుకు పచ్చి మేత తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి.
* మహా శివరాత్రి రోజున సాయంత్రం 108 మహామృత్యుంజయ మంత్రాలు జపించండి.



Click it and Unblock the Notifications
