For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ 14న ఏం జరగబోతోంది? మరో సంచలన విషయం చెప్పిన బాల బ్రహ్మ అభిగ్య...!

|

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా కలవరపెడుతుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి బారిన దాదాపు 15 లక్షల మంది పడ్డారు. దాదాపు 80 వేల మందికి పైగా చనిపోయారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే కర్నాటకకు చెందిన అభిఘ్య ఆనంద్ ఇది వరకే కరోనా వైరస్ కు సంబంధించిన అంశాలపై గత సంవత్సరం ఆగస్టులోనే ఓ వీడియోను పోస్టు చేశాడు.

అందులో ఈ వైరస్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. 2020 సంవత్సరంలో మే నెల 20వ తేదీ వరకు చాలా గడ్డుకాలమన్న విషయం చెప్పాడు. ఆశ్చర్యకరంగా అతను చెప్పినట్లుగా కొన్ని విషయాలు జరిగాయి. ముఖ్యంగా మన దేశంతో పాటు చాలా దేశాలు కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అభిఘ్య ఆనంద్ కరోనా వైరస్ పేరు వాడకపోయినా.. బయోవార్ వంటి పదాలను వాడాడు. అయితే అదే బాలుడు తాజాగా ఈ కరోనా భూతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

జ్యోతిశాస్త్రం ఏం చెబుతోంది: కరోనావైరస్ మే 29 తో ముగుస్తుందా - ఇది వాస్తవమా? నిజం ఏమిటి?

పదేళ్ల ప్రాయంలోనే..

పదేళ్ల ప్రాయంలోనే..

అభిఘ్య ఆనంద్ పదేళ్ల ప్రాయంలోనే భగవద్డీతలోని 700 శ్లోకాలను అలవోకగా చెప్పేవాడట. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం గురించి ప్రస్తుతం కేవలం మూడంటే మూడు గంటల్లో వివరించే ప్రయత్నం చేస్తున్నాడట. అంతేకాదు చాలా సంస్థలలో ఈ బాలుడు జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రానికి సంబంధించిన బోధనలు కూడా చేశాడట.

తాజాగా ఓ వీడియో..

తాజాగా ఓ వీడియో..

అభిఘ్య ఆనంద్ కరోనా వైరస్ కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశాడు. మనం ఇంకా ఎన్నిరోజులు ఈ సమస్యను ఎదుర్కొంటాం. ఇంతకుముందు చెప్పినట్లు మే 29వ తేదీ తర్వాత మనం పూర్తిగా బయటపడతామా లేదా అనే విషయాలతో పాటు ఏప్రిల్ 14వ తేదీ గురించి అనేక విషయాలు చెప్పాడు.

మే నెలాఖారు వరకు

మే నెలాఖారు వరకు

గ్రహ స్థితిగతులను అనుసరించి మన దేశంతో పాటు ప్రపంచమంతా చాలా ఇబ్బందులు పడుతుందట. ఈ కాలంలో చాలా కష్టాలు ఉంటాయట. ఈ సందర్భంగా చాలా విషయాలు అతను చెప్పినట్టే జరుగుతుండటంతో అతను ఇంకా ఏమి చెప్తాడనే విషయంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కరోనా వైరస్ : క్వారెంటైన్ తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత కోసం మార్గదర్శకాలు..

ఏప్రిల్ 14 తర్వాత..

ఏప్రిల్ 14 తర్వాత..

ఏప్రిల్ 14వ తేదీ లేదా లాక్ డౌన్ ఎత్తివేసే సమయానికి కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందట. అయితే పూర్తిగా పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే మే నెల చివరివరకు ఆగాల్సిందేనట. అప్పుడే ప్రపంచ మానవాళి కూడా సాధారణ స్థితికి చేరుకుంటుందట.

నిత్యావసరాల ధరలకు రెక్కలు

నిత్యావసరాల ధరలకు రెక్కలు

అదే విధంగా ఏప్రిల్ 14 తర్వాత నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చి.. సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకుంటాయట. ఇప్పటికే చాలా మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు ఆకాశన్నంటిన కూరగాయల ధరలను చూసి భయపడిపోతారంట.

ఆర్థిక మాంద్యం...

ఆర్థిక మాంద్యం...

ప్రపంచంలోని చాలా దేశాలలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందట. అంతేకాదు కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోతారట.

Coronavirus Outbreak:కరోనావైరస్ పై మనందరికీ ఉన్న అపోహలు- వాస్తవాలు మీకోసం ఇక్కడ...

కరోనాకు మందు...

కరోనాకు మందు...

అయితే కరోనా వైరస్ కు మందు కూడా దొరుకుతుందని చెప్పాడు. అయితే ఇందుకోసం సుమారు ఆరు నెలల సమయం పట్టొచ్చని చెప్పాడు. అయితే ఇందుకోసం ఎన్నో దేశాలు కలిసి పని చేయాలి. ఎన్నో ప్రయోగాల తర్వాతే కంటికి కనబడని ఈ కరోనా మహమ్మారికి మందు దొరుకుతుందట.

మరో లాక్ డౌన్...

మరో లాక్ డౌన్...

ఏప్రిల్ 14వ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే... ప్రజలందరూ బయట ఎక్కువగా తిరగకూడదట. అయితే 20వ తేదీ తర్వాత మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశముందని కూడా చెప్పాడు అభిగ్య. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మరోసారి లాక్ డౌన్ విధించడం వల్ల మనకు మంచే జరుగుతుందని చెబుతున్నాడు అభిగ్య. దీనితో పాటు మే 19వ తేదీ నుండి మే 24 వరకు కూడా మరో లాక్ డౌన్ ఉండొచ్చని చెప్పాడు. అలాగే ఈ కరోనా మహమ్మారి మే నెలఖారుకు వెళ్లిపోతుందని చెప్పాడు.

ప్రతిరోజూ దీపారాధన..

ప్రతిరోజూ దీపారాధన..

ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతిరోజూ మీ ఇంట్లో దీపాలు వెలిగిస్తే మీకు, మీ ఇంట్లోని కుటుంబ సభ్యులకు చాలా మంచి జరుగుతుందట. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి శుభప్రదంగా ఉంటుందట. అంతేకాదు ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదట.

ఏది ఏమైనా కరోనా వైరస్ ను తరమికొట్టడానికి సామాజిక దూరాన్ని పాటిద్దాం. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉందాం. మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకుందాం.

ఈ వ్యాసంలోని జ్యోతిషశాస్త్ర వివరాలు 14 ఏళ్ల వేద విద్యార్థి అబిఘ్య ఆనంద్ వివరాల ఆధారంగా ఇచ్చినవే. ఈ వివరాలు మీరు నమ్ముతున్నారో లేదో మీ ఇష్టం. బోల్డ్ స్కై తెలుగుకి దీనితో సంబంధం లేదని మీరు గుర్తుంచుకోవాలి.

English summary

Shocking Prediction made by Abhigya Anand About Coronavirus

Here are the shocking prediction made by abhigya anand about coronavirus. Take a look,
Story first published: Friday, April 10, 2020, 9:21 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more