For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాలీవుడ్ ప్రముఖుల సైడ్ బిజినెస్ గురించి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

తాము సంపాదించిన సొమ్మును స్థిరాస్తుల కొనుగోలు, బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇలా పరిమితమైన సాధనాల్లో మాత్రమే మదుపు చేసేవారు. అవసరమైన సొమ్మును మాత్రం వినియోగించేవారు. కానీ నేటి తరం సెలబ్రెటీలు ఇందుకు భి

|

సెలబ్రిటీలు ఇటీవల కాలంలో వ్యాపార రంగంలోకి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వీటిని కొత్త ప్రవృత్తిగా ఎంచుకోగా.. ఇంకొందరు వారిని అనుసరిస్తున్నారు. గతంలో సెలబ్రిటీలు తమ ప్రధాన వృత్తికి తోడుగా కమర్షియల్ యాడ్స్, ఇతర ప్రచార కార్యక్రమాల ద్వారా మాత్రమే ఆదాయాన్ని అర్జించేవారు. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.

Side Business of Tollywood Stars

అలాగే తాము సంపాదించిన సొమ్మును స్థిరాస్తుల కొనుగోలు, బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇలా పరిమితమైన సాధనాల్లో మాత్రమే మదుపు చేసేవారు. అవసరమైన సొమ్మును మాత్రం వినియోగించేవారు. కానీ నేటి తరం సెలబ్రెటీలు ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. నేరుగా వ్యాపారాల్లోకి దిగుతున్నాయి. చురుకైన భాగస్వాములుగా మారి వ్యాపారాలను ప్రమోట్ చేస్తున్నారు.

1) అక్కినేని నాగార్జున..

1) అక్కినేని నాగార్జున..

మన్మథుడు, కింగ్ నాగార్జున తన విలక్షణమైన కథనలను ఎంచుకుంటూ తన నటనతో సినిమాల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు హీరోగా.. మరోవైపు యాంకర్ గా.. ఇంకోవైపు నిర్మాతగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న నాగార్జున ఇంకా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తున్నారు. ఎన్ గ్రిల్ రెస్టారెంట్, ఎన్ కన్వెన్షన్ సెంటర్లను నడిపిస్తున్నారు. కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సైతం కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక స్టార్ మా లో పెట్టుబుడులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తను పెట్టుబడి పెట్టడమే కాకుండా చిరంజీవితో సైతం అందులో కొంత పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించారు.

2) కాజల్ అగర్వాల్..

2) కాజల్ అగర్వాల్..

12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ టాలీవుడ్ భామ సినిమాలతో పాటు అనేక రకాల బిజినెస్ లను చేస్తోంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా కేవలం నటన, బిజినెస్ పైనే తన ఇంట్రెస్ట్ ను చూపుతోంది. కాజల్ పేరు మీద ఓ జ్యువెలరీ షాపుతో పాటు ఒక షూ కంపెనీ కూడా ఉంది. తన చెల్లి నిషా అగర్వాల్ ఇవన్నీ చూసుకుంటోందంట. చందమామతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ తాజాగా నిర్మాతగా మారనున్నారట. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడుతోందట. కెఎ వెంచర్ పేరుతో అందుకు తగిన పనులను ప్రారంభించిందంట.

3) మోహన్ బాబు..

3) మోహన్ బాబు..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రూటే సపరేటు.. విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం నిర్మాతగా, నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి విజయవంతంగా నడిపిస్తున్నారు. ఆయన బాటలోనే వారి తనయులు మంచు విష్ణు కూడా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు.

4) జగపతి బాబు..

4) జగపతి బాబు..

ప్రముఖ నిర్మాత వివి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి జగపతి బాబు అడుగుపెట్టారు. సినిమాల్లో హీరోగా, విలన్ గా రెండింట్లోనూ రాణించిన ఈయన టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని మొదలుపెట్టారు. క్లిక్ సినీ కార్ట్ పేరుతో వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. సినీరంగానికి, ఔత్సాహికులకు సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు.

5) రామ్ చరణ్..

5) రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ చిన్నవయసులోనే బిజినెస్ లో అడుగుపెట్టారు. హైదరాబాద్ పోల్ అండ్ రైడింగ్ క్లబ్ కి యజమాని అయ్యారు. టర్బో మెగా ఎయిర్ వేస్ లిమిటెడ్ ను స్థాపించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈయనకు అతని భార్య ఉపాసన ఎంతగానో సహకరిస్తున్నారు. ఇటీవలే నిర్మాతగా మారి తన తండ్రి 150వ చిత్రాన్ని నిర్మించారు. తొలి సినిమాతోనే సక్సెన్ అందుకున్నారు. కొణిదెల బ్యానర్ మీద కొత్త వారికి కూడా అవకాశాలిస్తున్నారు. తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఈ బ్యానర్ లోనే నిర్మించారు.

6) రకుల్ ప్రీత్ సింగ్..

6) రకుల్ ప్రీత్ సింగ్..

రకుల్ ప్రీత్ సింగ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరితో నటించేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా తాజాగా బిజినెస్ వైపు అడుగులు వేసింది. ఇప్పటికే జిమ్ బిజినెస్ ను మొదలుపెట్టిన ఈ భామ వీటిని మరిన్ని బ్రాంచ్ లను ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోందట.

7) దగ్గుబాటి రానా..

7) దగ్గుబాటి రానా..

దగ్గుబాటి రానా అయితే సినిమా రంగంలోకి రాకముందే నుండే వ్యాపార రంగంలో ఉన్నాడు. విఎఫ్ ఎక్స్ కంపెనీ ఓనర్ గా ఉండేవాడు. హీరోగా మారిన తర్వాత కూడా ఓ మేనేజ్ మెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. ముంబైలో ఉన్న ఈ కంపెనీ ద్వారా కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తోంది.

8) అల్లు అర్జున్..

8) అల్లు అర్జున్..

ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఏకంగా ఒక అంతర్జాతీయ కంపెనీతో కలిసి ఓ పెద్ద రెస్టారెంట్ ను రన్ చేస్తున్నారు. ఇందులో క్లబ్, ఈవెంట్స్ చేసుకునేందుకు హాలుతో పాటు అన్ని సౌకర్యాలుంటాయి. సెలబ్రెటీలు ఎంజాయ్ చేసేందుకు ఇది మంచి కేంద్రంగా మారింది.

9) తాప్సీ..

9) తాప్సీ..

తెలుగులో తాప్సీ తీసింది తక్కువ సినిమాలే అయినా డార్లింగ్ సినిమా హిట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమట. అందుకే సంపాదించిన సొమ్మునంతా స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడి పెడుతోందట. అంతేకాదు రియల్ ఎస్టేట్ ను ప్రారంభించాలని ఈ భామ తెగ ఆసక్తి చూపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

10) నవదీప్..

10) నవదీప్..

యువ హీరో నవదీప్ సినిమాల్లో అంతగా రాణించకపోయినా బిజినెస్ లో బాగా రాణిస్తున్నాడు. రా ప్రొడక్షన్ హౌస్ పేరుతో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

మరో యువ హీరో శర్వానంద్ తన అభిరుచి మేరకు బీంజ్ అనే కాఫీ షాప్ ను ప్రారంభించాడు. ద అర్బన్ కాఫీ విలేజ్ అనే ట్యాగ్ లైన్ ఉన్న ఈ కాఫీ షాపులో వివిధ దేశాలలో ప్రసిద్ధి గాంచిన కాఫీలన్నీ లభిస్తాయి. ఈ హీరోతో పాటు తమిళ హీరోలు రజనీకాంత్, విజయ్, సూర్యతో పాటు చాలా మంది హీరోలు అనేక రకాల బిజినెస్ లు చేస్తున్నారు.

హీరో సూర్య అయితే బిజినెస్ తో పాటు కొన్ని ఛారిటబుల్ ట్రస్టులను నడుపుతున్నాడు. తనకు తోచినంత సహాయం చేస్తున్నాడు. చాలా మంది చదువుకునేందుకు తాను ఆర్థిక సాయం చేస్తున్నాడు.

English summary

Side Business of Tollywood Stars

Cupid, King Nagarjuna has already proven himself in the cinemas with his acting, picking his distinctive stories. On the one hand, as anchor, on the other hand, as a producer of Inkovaipu, Nagarjuna is making a profit by investing in other sectors. He runs the N Grill Restaurant and the N Convention Center. He is also the co-owner of the Kerala Blasters team. Everyone knows about investing in Star Ma
Desktop Bottom Promotion