For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sun Transit in Leo on 17 August 2021: సింహ రాశి లోకి సూర్యుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...

2021లో ఆగస్టు 17న సింహరాశిలోకి సూర్యుని సంచారంతో ఏ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలకు సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో ఆగస్టు 17వ తేదీన అంటే మంగళవారం రోజున సూర్యుడు మరోసారి తన దిశను మార్చుకోనున్నాడు.

Sun Transit in Leo On 17 August 2021, Effect of Zodiac Signs in Telugu

తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి మంగళవారం నాడు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితమైన ప్రభావం ఉంటుంది. సుమారు ఏడాది తర్వాత సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల సూర్యుడు కూడా బలంగా ఉంటాడు.

Sun Transit in Leo On 17 August 2021, Effect of Zodiac Signs in Telugu

ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఇంతకీ ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడనుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sun Transit in Leo on 17 August 2021:సింహంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!Sun Transit in Leo on 17 August 2021:సింహంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానంలో రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం కూడా మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఓపికగా ఉంటే.. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు పూర్తి పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. మరోవైపు మీ కుటుంబంలో కలహాల వల్ల మీ ప్రశాంతత దెబ్బ తింటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈ కాలంలో సాధారణంగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు ధైర్యం, శక్తి వంటివి పెరుగుతాయి. ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. వ్యాపారులు వ్యాపారంలో మంచి లాభాలను సాధిస్తారు. కష్ట సమయాల్లో మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. వారి మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు పేదలకు దానం వంటివి కూడా చేయొచ్చు. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు రెండో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు చాలా విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే దానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. వ్యాపారులకు ఈ కాలంలో మంచి లాభాలు రావొచ్చు. మీ కుటుంబంలో అంతా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి.

Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి సూర్యుడే అధిపతిగా పరిగణిస్తారు. తన సొంత రాశిలోకే సూర్యుడు అడుగు పెట్టడం వల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. మీరు ఏ పనినైనా చేసేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీరు యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్య పరమైన సమస్యల నుండి బయటపడతారు. కష్ట సమయాల్లో మీ కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల విషయంలో అందరి మద్దతు లభిస్తుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులకు ఈ కాలంలో ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు మీ పని కోసం చాలా కష్టపడతారు. విద్యార్థులు పరిశోధనా రంగంలో రాణించే అవకాశం ఉంది. మరోవైపు మీరు ఈ కాలంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి.

Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!Venus Transit in Virgo: కన్యరాశిలో శుక్రుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థిక ప్రయోజనం...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో పని చేసే వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులకు చాలా విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల ప్రమోషన్ గురించి కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం నుండి ప్రయాణించనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ సమయంలో శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు. మీరు ఈ కాలంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని చూస్తుంటే, సూర్యుడి రవాణా వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు తొమ్మిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా ధనస్సు రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. విద్యార్థులకు ఈ కాలంలో మంచి విజయాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ పిల్లలు అనేక విషయాల్లో పురోగతి సాధిస్తారు. మరోవైపు మీరు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో మీరు తీర్థయాత్రలకు వెళ్లేందుకు ఓ ప్లాన్ వేసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా జీవనం గడుపుతారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఎనిమిదో స్థానం నుండి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు మీ పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీకు మానసిక అశాంతి ఉంటుంది. మీరు వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అధిక ఖర్చులను వీలైనంత మేరకు తగ్గించండి. మీ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఏడో స్థానం ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో కుంభ రాశి వారి వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందొచ్చు. మీ వ్యాపారం కూడా విస్తరించే అవకాశం ఉంది. మీరు ఈ కాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈ కాలం చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. దీని వల్ల మీ బాస్ తో సంబంధం మెరుగుపడుతుంది. దీని వల్ల మీ పురోగతి సులభమవుతుంది. మీరు ఈ కాలంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మరోవైపు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు తమ వ్యాపారంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ కాలంలో కొంచెం కష్టంగా ఉంటుంది.

English summary

Sun Transit in Leo On 17 August 2021, Effect of Zodiac Signs in Telugu

Sun Transit in Leo Effects on Zodiac Signs in Telugu:The Sun Transit in Leo Will take place on 17th August 2021. Learn about remedies to perform in telugu
Story first published:Thursday, August 12, 2021, 11:26 [IST]
Desktop Bottom Promotion