Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Teacher's Day 2020 : ఎందరో గురువులు... అందరికీ వందనాలు...
సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.
మన తొలి ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గురువులకు గురువు. ఆయన ఒక గొప్ప విద్యావేత్త మాత్రమే కాదు ఒక యుగ పురుషుడు. మన దేశ జాతిపితగా భావించే మహాత్మ గాంధీజీనే 'మీరు నా ఉపాధ్యాయుడు' అని కొనియాడారు.

మన సమాజంలో ఇప్పటికీ గురువు అంటే ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. గురువులో 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ణానాన్ని తొలగించి, జ్ణానదీప్తిని వెలిగించేవాడే గురువు అన్నమాట.

అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంప్రదాయం మనది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఉపాధ్యాయుల విశిష్టత, ప్రాధాన్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

1962 నుండి..
భారతరత్న, భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్. ఆయన జయంతి రోజును పురస్కరించుకుని, సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం 1962 నుండి ఈయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది.

నోబెల్ బహుమతికి నామినేట్..
‘భారతదేశంలో ఆనాడు ఉన్న మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్ తాత్విక స్థాయికి తీసుకెళ్లిన గొప్ప పండితులు సర్వేపల్లి రాధాక్రిష్ణన్. ఈయన ఏకంగా 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు.

గురుశిష్య బంధానికి..
మన దేశంలో మహాభారత కాలం నుండి శ్రీక్రిష్ణార్జునల అసలు సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. మహాత్మ గాంధీజీ కూడా సర్వేపల్లి రాధాక్రిష్ణన్ తనకు క్రిష్ణుడితో సమానమని కొనియాడారు. ‘మీరు నా క్రిష్ణుడు, నేను అర్జునుడిని' అనేవార. అందుకే మన తొలి ప్రధాని పండిట్ నెహ్రు ఈ వ్యాఖ్యల నేపథ్యం నుండే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆలోచన చేశారేమో.

సూటిగా, స్పష్టంగా..
మన సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజేసిన ధీమంతుడు, గొప్ప విద్యావేత్త సర్వేపల్లి. తత్వశాస్త్రానికి సాహిత్యాన్ని జోడించిన మహా రచయిత రాధాక్రిష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు.

గురువు ద్వారా..
మహాభారతం యొక్క అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల అంశంలో.. యక్షుడు ‘మనిషి మనిషి ఎలా అవుతాడు'? అని ధర్మరాజును ప్రశ్నిస్తే.. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా' అని బదులిస్తాడట. గురువుకు ఉన్న శక్తి అంతగొప్పది. ఆధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థనా చేస్తాడు. ఆ తర్వాత గురువును స్మరిస్తాడు.

ధర్మం స్పష్టంగా..
ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఏయే లక్షణాలు ఉండాలి.. ఏయే లక్షణాలు ఉండకూడదు.. అలాగే గురువు యొక్క గొప్పదనం గురించి స్కాంద పురాణంలో కూడా వివరించారు.

ఎందరో గురువులు..
గురువులలో కొందరిని ఇప్పుడు గుర్తు చేసుకుందాం. చాణక్యుడి చేతిలో తయారైన మాణిక్యం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీరఖడ్గం శివాజీ. రామక్రిష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరమే వివేకానందుడు. మన దేశంలో గురుశిష్య శక్తికి వీరు ప్రతీకగా నిలుస్తారు. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది.

గురువును మించిన దైవం లేదు..
అందుకే గురువును మించిన దైవం లేదని అంటూ ఉంటారు. వాస్తవానికి మనల్ని ఉన్నత స్థానాలలో చూడాలనే ప్రతి ఒక్క గురువు కోరుకుంటారు. తన శిష్యుడు సాధించిన విజయాన్ని తన విజయంగా భావించి గర్వంతో ఉప్పొంగిపోతారు.
బోల్డ్ స్కై తెలుగు తరపున హ్యాపీ టీచర్స్ డే...



Click it and Unblock the Notifications